పంచాంగం ప్రకారం, పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత వచ్చే పదకొండవ రోజు, ఏకాదశి. ఇది ఉపవాసం చేయడానికి అనుకూలమైన రోజు. ఇవాళ రాత్రి భోజనం చేశాక, మరుసటి రాత్రి భోజన సమయం వరకు ఉపవాసం ఉండొచ్చు. శరీరాన్ని శుద్ధి చేసుకోవటానికి, అలాగే ఆహారం విషయంలో మరింత ఎరుక తీసుకురావటానికి, ఏకాదశి ఒక గొప్ప అవకాశం.
#sadhguru #SadhguruTelugu #ishayoga #ekadashi #fasting