PSV APPARAO
537 views
8 hours ago
#సర్వదేవాత్మకుడు ఆదిత్యుడు 🌄 #ఆరోగ్య ప్రదాయిని 🌄 ఆదిత్యుని పూజ🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రథసప్తమి 🌅 సూర్యభగవానుని జయంతి 🌄🙏 *ఆరోగ్య ప్రదాయిని.. ఆదిత్యుని పూజ* *జనవరి 25 ఆదివారం రథసప్తమి సూర్య భగవానుని జయంతి...* "మతం అని ఒకదానిని ఎంచుకోవలసి వస్తే, లోకానికి అంతటికీ వెలుగును ప్రసాదించే సూర్యుడిని దేవునిగా ఎంచు కుంటాను" అన్నాడు నిఖిల లోక విఖ్యాతుడైన నెపోలియన్ చక్రవర్తి. భారతావనిలో సూర్యారాధన ప్రాచీనమైనది. రుగ్వే దంలో సూర్యుని స్తుతితో పది రుక్కులు ఉన్నాయి. వేద మంత్రం గాయత్రి సూర్యపరమైనదే. వేదంలోని సూర్యస్తుతిలో సూర్యరథ, సూర్య గుర్రాల ప్రస్తావన ఉంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం. అయినా ఆదిలో విగ్రహ పూజ, ఆలయాలు లేకుండేవి. నవగ్రహాలలో సూర్యపూజ ఉత్కృష్టమైనది. వేదా లలో సౌరసూక్తాలు, రామాయణంలో ఆదిత్య హృదయం భార తదేశంలో సూర్యపూజ పౌరాతనాన్ని స్పష్ట పరుస్తాయి. యాలెన్ అనే చరిత్రకారుని ప్రకారం ఆదిలో సూర్యుని రూపా నికి ప్రతినిధిగా కిరణాలతో కూడిన బింబం పుట్టి, పూజార్హ మైంది. ఆదిలో నాణాల మీద క్రీ.పూ.రెండు, ఒకవంద ఏళ్ళ మధ్య తొలుత కిరణాల బింబం కానవచ్చేది. పాంచాలంలోని రాజులైన సూర్యమిత్ర, భానుమిత్ర నామముల నాణేలపైన ఉండేవి. విగ్రహ రూప మిత్ర (సూర్య) పూజ పారశీకమున (ఇరేనియన్) ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. సూర్యాలయాలు భారతావనికి శకనృపులతో వచ్చిన మగి పూజారుల భిక్ష. కృష్ణుని కుమారుడు సాంబుడు చంద్రబాగా (చీనాబ్) నదీ తీరాన సూర్యదేవాలయం నిర్మించాడని భవిష్యత్ పురాణ కథనం. నంబాపురం లేదా మూలాస్థానం (ముల్తాన్)లో ఒక సూర్యాలయం ఉందని హూయన్ త్సాంగ్ పేర్కొన్నాడు. ఒరిస్సాలోని కోణార్కాలయం మగి బ్రాహ్మణ పూజారుల ప్రాబల్యానికి ప్రతీకగా ఉంది. గుప్తుల పాలనానం తరం, హర్షవర్ధనుని కాలాన సూర్యారాధన పెరిగి, ఆదిత్య భక్తులైన ఆయన తండ్రి తాతలకు ప్రభాకర, ఆదిత్య వర్ధన నామాలున్నాయి. నవ గ్రహాలలో సూర్యపూజ ప్రధానమైనందున, అట్టి సూర్యుని కొలుచుట ఏడాదికోసారి మాత్రమే, రథ సప్తమినాడే కావడం విశేషం. ఈశ్వరుడు మాఘ శుద్ద సప్తమి నాడు సూర్యుడిని సృష్టించాడని పేర్కొం టారు. పంచాంగ కర్తలు ఈదినాన్నే 'సూర్య జయంతి'గా, 'రథ సప్తమి'గా, 'మన్వాది'గా పేర్కొం టారు. రథ సప్తమిని రాజపుటానాలో సౌర సప్తమియని, వంగ దేశంలో భాస్కర సప్తమియని, కొన్ని చోట్ల జయంతి సప్తమి యని, మరికొన్ని చోట్ల మహా సప్తమియని అంటారు. సూర్యు నికి వివస్వంతుడని పేరు. వివస్వంతుని కుమారుడు ఏడవమనువైన వైవస్వతుడు. మన్వంతరానికి రథ సప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినమైనందున పితృదేవతలకు ప్రియక రమైనది. ఒకప్పుడు భారత దేశంలో వైవస్వత మన్వాది తిథి సంవత్సరాదిగా చెప్పబడి, ఉగాది పండగగా ఉండేదని భావించ బడుతున్నది. తెలుగుదేశంలోనూ రథసప్తమినాడు అనేక స్త్రీల వ్రతాలు పట్టే ఆచారం ఉంది. సూర్య ఆరాధన ప్రధానంగా ఆచరించే ఈనాడు సూర్య రథాలు మళ్ళుతాయని, అవి ఉత్తర గతిని సూచిస్తాయని పురాణ కథనం. రథ సప్తమి నాడు సూర్య గ్రహణ తుల్యమైన పుణ్యకాలమని భావించే భక్తులు సూర్యోదయానికి పూర్వమే స్నానాదులు ఆచరించి, దానాదులు సూర్యోదయానంతరం చేయాలని ధర్మ సింధువు స్పష్ట పరుస్తున్నది. అతి పుణ్యప్రదమైన గ్రహణ కాలాలు వేయింటి ఫలితం ఒక్క రథ సప్తమికే ఉండగలదని మత గ్రంథాలు వివరిస్తున్నాయి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*