#ఎన్‌టీఆర్ — మన తెలుగుజాతి ఆత్మగౌరవం.
#ఎన్‌టీఆర్ — తెలుగు ప్రజల గుండె చప్పుడు.
#ఎన్‌టీఆర్ — యుగపురుషుడు.
అలాంటి మహానేత #నందమూరితారకరామారావు (ఎన్‌టీఆర్) గారిని స్మరించుకుంటూ, రాబోయే తరాల కోసం ఆయన పేరుతో #నీరుకొండ ప్రాంతంలో ఒక నేషనల్ పార్క్ నిర్మిస్తే తప్పేంటి? అది ప్రభుత్వ సొమ్ముతో కాకుండా, అభిమానులు, సేవా సంస్థలు, దాతల నిధులతో చేస్తే దాంట్లో తప్పేముంది?
నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానేత. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలను పాలనలో భాగస్వాములను చేసి, ప్రజాస్వామ్య విలువలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన నేత.
అమరావతిలో నెలకొల్పబడబోయే ఎన్‌టీఆర్ గారి విగ్రహం ఆయన సేవలకు, నాయకత్వానికి, ప్రజాసేవకు అంకితమైన జీవితానికి ప్రతీక. ఇది తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఆయన ఆశయాలకు, ఆంధ్రప్రదేశ్ గౌరవానికి చిరస్థాయిగా నిలిచే చిహ్నం.
ఇది కేవలం ఒక విగ్రహం కాదు — తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం, రాజకీయ స్వరం ఇచ్చిన శ్రీ ఎన్.టి. రామారావు గారికి అంకితమైన గౌరవాంజలి. ఇలాంటి మహానుభావుడిని స్మరించడం రాజకీయమేం కాదు — ఇది చరిత్రకు, కృతజ్ఞతకు చిహ్నం.
ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్నో ప్రతీకాత్మక విగ్రహాలు పర్యాటక అభివృద్ధికి బలమైన ఆధారాలుగా నిలిచాయి. #హైదరాబాద్ లో ఉన్న NTR గార్డెన్స్ మూలంగా ఆ ప్రాంతం పర్యాటకంగా ఎంత అభివృద్ధి జరిగిందో మనం చూసాం, ఇక్కడ కూడా అదే తరహాలో ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది, ఇంకా గొప్పగా.. ఇది పూర్తిగా ప్రజలు, అభిమానుల నిధులతోనే నిర్మించబడుతోంది. ప్రభుత్వం కేవలం #స్థల అనుమతి మాత్రమే ఇస్తోంది.
రెండు సార్లు సీఎం అయిన వ్యక్తుల విగ్రహాలు ప్రతి గ్రామంలో పెట్టినప్పుడు మాట్లాడని నోర్లు, ఒక చరిత్రను మలిచిన ఎన్‌టీఆర్ గారి విగ్రహం విషయంలో లేవడం ఎందుకు?
నిజాలు తెలుసుకోకుండా, కేవలం రాజకీయ కుట్రలతో మాట్లాడటం మీ మూర్కత్వనికి నిదర్శనం. ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి Nara Chandrababu Naidu సార్, మీరు ముందుకెళ్ళండి, మేము ఉన్నాం, ప్రజల అండదండలు ఉన్నాయ్, యుగపురుషుడి మీద అభిమానం ఉంది.
#జోహార్ఎన్‌టీఆర్… #జైటీడీపీ… ✌️✌️
#🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్