* త్రాగునీటీ సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి నారాయణను కోరిన ఎమ్మెల్యే ముత్తుముల..
* తక్షణమే ASC గ్రాంట్ ద్వారా రూ. కోటి రూపాయలు మంజూరు చేసిన మంత్రి ..
* విజయవాడ : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారిని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శుక్రవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా గిద్దలూరు మున్సిపాలిటీలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. రానున్న వేసవిలో పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కారం చేసేందుకు, ముందస్తు చర్యలు చేపట్టెందుకు నిధులు మంజూరు చేయాలని వారికీ విన్నవించారు. తక్షణమే స్పందించిన మంత్రి నారాయణ గారు ASC గ్రాంట్ ద్వారా తక్షణ సహాయంగా రూ. కోటి రూపాయలు నిధులు మంజూరు చేశారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు..
#🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్