Mohan
961 views
3 months ago
#🗞️అక్టోబర్ 24th అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party దగాకోరు కాంగ్రెస్‌ను.. గల్లాపట్టి నిలదీయాలె❗ రేవంత్‌ దోపిడీ పాలనతో రాష్ట్రం గుల్ల‼️ 💥జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ విజయం ఎప్పుడో ఖాయం.. తేలాల్సింది మెజార్టీనే: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 📢పదేండ్లు పస్తులుండి కాపాడితే.. రెండేండ్లలోనే నాశనం 🚜బుల్డోజర్లను పంపి పేదలకు నిలువనీడ లేకుండా చేస్తున్నరు 💪కాంగ్రెస్‌ను ఓడించి ప్రజలు తమ గౌరవాన్ని కాపాడుకుంటరు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతా గోపీనాథ్‌ గెలుపు పక్కా 📝ప్రతీ నేత పట్టుదలతో, చిత్తశుద్ధితో మనసు పెట్టి పనిచేయాలి ఇంటింటికీ వెళ్లి ప్రమాదకర పరిస్థితులను విడమర్చి చెప్పాలి 📌రాష్ట్రంలోని దుష్టపాలనను వివరించి భారీ మెజార్టీ తేవాలి ♦️జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు, కార్యాచరణపై శ్రేణులకు అధినేత దిశానిర్దేశం కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసహ్యం, ఏహ్యభావం ఏర్పడింది. నమ్మి మోసపోయినమని జనం కోపంలో ఉన్నరు. సక్కదనంగ నడిసే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్న సందర్భంలో ఈ ఉప ఎన్నికలు వచ్చినయ్‌. వాళ్లకు ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్‌ఎస్‌ మాత్రమే. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో క్లారిటీతో ఉన్నది. బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో రియల్‌ ఎస్టేట్‌లో తెలంగాణ రాష్ట్రం ముంబై, ఢిల్లీలతో పోటీ పడే పరిస్థితి ఉండేది. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొడుతూ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కాంగ్రెస్‌ పాలకులు మొత్తానికే కుప్ప కూల్చిండ్రు. ఆ రంగంలో పనిచేసే లక్షలాది మంది జీవితాలను ఆగం చేసిండ్రు. జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్‌ ఆ నియోజకవర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేయాలి. ఆయన నిత్యం జనసామాన్యంలో ఉంటూ, పేదలను ఆపదలో ఆదుకుంటూ ప్రజల హృదయాలను గెలిచారు. గోపీనాథ్‌ కుటుంబం పట్ల ప్రజలకున్న అభిమానాన్ని కాపాడుకోవాలి. సునీతను భారీ మెజార్టీతో గెలిపించుకొని గులాబీ జెండా మళ్లీ ఎగరేయాలి. #JubileeHillsWithBRS #VoteForCar