PSV APPARAO
633 views
5 months ago
#*రక్షాబంధన్* ఎంత పవర్ఫులో ఒకసారి చూద్దాం.... #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రక్షా బంధనం - రాఖీ పూర్ణిమ - జంధ్యాల పౌర్ణమి - హయగ్రీవ జయంతి 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శ్రావణ పూర్ణిమ / జంధ్యాల పూర్ణిమ ప్రాశస్త్యం *రక్షాబంధనం ఇలా జరపాలి* #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక మాత్రమే కాక విశ్వాసం, రక్షణ, ఆపత్కాలంలో ఆదుకుంటారన్న నమ్మకమే రక్షాబంధనం. తన రక్షణను కోరే ఎవరైనా రక్షించగల వ్యక్తికి రక్షాసూత్రం కట్టి వారి నుండి రక్షణ లభిస్తుందని విశ్వసించవచ్చు. సూత్రం అంటే అవిచ్ఛిన్నతకు ప్రతీక. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సమస్త ప్రపంచం సూత్రంలో మణులలా నాలో ఇమిడి ఉంది అని చెప్పడానికి కారణం ఇదే. విడిగా ఉన్న ముత్యాలు, రత్నాలను కలిపి హారంగా మలిచేదే సూత్రం. శ్రేయస్సును కోరే చెల్లెలు తన సోదరుని చేతికి సూత్రాన్ని కట్టి రక్షణ కోరుతుంది. సోదరుని శ్రేయస్సును కాంక్షిస్తుంది. ఈ పండుగను శ్రావణ మాసం శుక్లపక్ష పూర్ణిను నాడు జరుపుకోవడం ఆచారం. ఈ పండుగ గురించిన ప్రస్తావన భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఒకమారు యుధిష్ఠిరుడు మహాభారత యుద్ధంలో నేనెలా రక్షింపబడతాను అని ప్రశ్నిస్తే శ్రీకృష్ణుడు "రక్షా సూత్రమే నిన్ను రక్షిస్తుంద"ని సమాధానం చెబుతారు. పూర్వం ఒకసారి దేవతలకు, రాక్షసులకు పన్నెండు సంవత్సరాలపాటు జరిగిన యుద్ధంలో దేవేంద్రుడు ఓడిపోయి అమరావతికి వచ్చి తలదాచుకున్నాడు. ముల్లోకాలను ఆక్రమించిన రాక్షసులు అమరావతిని కూడా ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలిసి దేవేంద్రుడు దేవతల గురువు బృహస్పతిని ఏదైనా ఉపాయం చేసి విజయం లభించేలా ఆశీర్వదించమని ప్రార్ధించాడు. తన భర్త బృహస్పతిని ప్రార్ధించడం విన్న శచీదేవి "నేడు గొప్ప పర్వదినం. నేను మీ చేతికి ఈ రక్ష కడతాను అందువల్ల మీకు విజయం లభిస్తుంద"ని చెప్పింది. అనంతరం రక్షా సూత్రమును ఒకదానిని తయారుచేసి దానికి పూజలు చేసి దేవేంద్రుని కుడిచేతి మణికట్టుకు కట్టింది. తరువాత అమరావతిపై దండయాత్రకు వచ్చిన రాక్షసులను ఓడించి దేవేంద్రుడు విజయం సాధించాడు. ఓడిపోయిన రాక్షసులు తమ గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి దేవతలపై విజయం సాధించడానికి ఉపాయం చెప్ప మని కోరారు. శుక్రాచార్యుడు, "శచీదేవి కట్టిన రక్షా బంధనం వల్ల దేవేంద్రునికి విజయం లభించింది. దీని ప్రభావం ఒక సంవత్సర కాలం ఉంటుంది. అంతవరకు ఓపిక పట్టండి" అని సమాధానమిస్తాడు. ఈ విధంగా రక్షాబంధనం అమల్లోకి వచ్చినట్లు పురాణ కథనం. ఇది క్రమేణా సోదరి లేక సోదరి సమా సురాలు తన సోదరుని విజయం కోరుతూ రక్షాబంధనం కట్టడం ఆచారమైంది. మన దేశంలో 13వ శతాబ్దం నుంచే అమల్లో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. _రాఖీ పండుగ ఆచారం:_ రాఖీ పండుగనాడు నిత్యపూజల అనం తరం ఇంటిలో ఒకచోట ముగ్గు వేసి దాని | పై పీట పెట్టి సోదరుని కూర్చోబెట్టి నుదు టిపై బొట్టు పెట్టాలి. రాఖీని తీసుకొని... యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః | తేన త్వామభి బధ్నామి రక్ష మాచల మాచల || అనే శ్లోకాన్ని పఠిస్తూ సోదరుని ముంజేతికి రాఖీని కట్టాలి. మిఠాయి తినిపించాలి. రాఖీ కట్టిన అనంతరం సోదరుడు కృత జ్ఞతగా తన సోదరికి బహుమతి ఇవ్వడం ఆచారం. ఈ విధంగా సోదరి క్షేమాన్ని, రక్షణను కోరుతూ రాఖీ కట్టడం వల్ల సోదరుడికి శుభం కలుగుతుంది. సోదరికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సాధారణ జనసంప్రదాయం ప్రకారం రక్షాబంధనం నాడు పురోహితులు తమను పోషించే గృహాలకు వెళ్లి ఆ కుటుంబ సభ్యులందరికి రక్షా సూత్రం కట్టి ఆశీర్వదించే పద్ధతి ఉంది. కులపురోహితులు ఇళ్ల ద్వారాలు, కిటికీలు, పుస్తకాలకు కూడా పవిత్ర సూత్రం కడతారు. కొత్త పాత్రలకు కూడా పవిత్ర సూత్రం కట్టి బొట్టుపెట్టే ఆచారం ఉంది. గురువులు శిష్యులకు రక్షాసూత్రం కట్టే ఆచారం కూడా ఉంది. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*