Failed to fetch language order
ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రక్షా బంధనం - రాఖీ పూర్ణిమ - జంధ్యాల పౌర్ణమి - హయగ్రీవ జయంతి 🚩
9 Posts • 360 views
PSV APPARAO
743 views 5 months ago
#హయగ్రీవ జయంతి - శ్రావణమాసంలో రాఖీ పౌర్ణమి రోజు మరో ఆధ్యాత్మిక ప్రత్యేకత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రక్షా బంధనం - రాఖీ పూర్ణిమ - జంధ్యాల పౌర్ణమి - హయగ్రీవ జయంతి 🚩 #హయగ్రీవ జయంతి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *హయగ్రీవ ఆవిర్భావం* శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రూపాల్లో అవతరించాడు. ఆయన తేజోమయమైన రూపంతో హయగ్రీవావతారం పొంది వేదాలను రక్షించాడు. వేదోద్ధరణే లక్ష్యంగా హయగ్రీవావతారం కనిపిస్తుంది. వేదాల సంరక్షణలో నిరంతరం మహా విష్ణువు నిమగ్నమై ఉంటాడని, హయగ్రీవావతారం తెలియజేస్తుంది. సృష్టికర్త బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉండగా ల మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ దగ్గర ఉన్న నాలుగు వేదాలను అపహరించారు. వారు సముద్రంలో ప్రవేశించి, రాసాతలానికి చేరకున్నారు. వేదాలను కోల్పోయిన బ్రహ్మ అవి లేకపోతే తానూ సృష్టిని చేయడం కుదరదని విచారించసాగాడు. శ్రీమహావిష్ణువును స్తుతించాడు. బ్రహ్మ ఆవేదన శ్రీహరి అర్థం చేసుకొని వేద క్షణ కోసం ఒక దివ్య రూపాన్ని పొందాడు. ఆ రూపమే హయగ్రీవ అవతారం శ్రీహరి ధరించిన హయగ్రీవావతరం బ్రహ్మ ముందు నుంచి అంతర్ధానమై రాసాతలానికి ప్రవేశించింది. అక్కడ హయగ్రీవుడు సామవేదం గానం చేయసాగాడు. ఆ గానావాహిని రసాతలం అంటా మారు మోగింది ఆ గానానికి రసం రసాతలంలో వేదాలను దొంగిలించి దాక్కున రాక్షసులకూ వినిపించింది. ఆ గానానికి పరవశించిన ఆ రాక్షసులిద్దరు బ్రహ్మ దగ్గర నుంచి దొంగిలించిన వేదాలను ఒక చోట దాచిపెట్టి గానం వినిపించిన వైపుకు బయలుచేరారు. ఎంత వెతికినా వారికి ఎవరూ కనిపించలేదు. తిరిగి వేదాలను దాచిన ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ వేదాలు కనిపించలేదు. వెంటనే ఆ ఇద్దరూ రసాతలం నుంచి వెలుపలకి వచ్చి చూశారు అక్కడ దివ్య కాంతితో ఉన్న హయగ్రీవుడిని చూసి తాము దాచిన వేదాలను మాయం చేసింది. అతడేనని గ్రహించి కోపంతో అతని మీదకు యుద్ధానికి వెళ్లారు. అప్పుడు హయగ్రీవుడు ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. అలా హయగ్రీవావతారం వేదోద్ధారణ లక్ష్యంగా అవతరించింది. వేదాలను కాపాడిన ఆ స్వామి విద్యలకు అధిపతిగా జ్ఞాన ప్రదాతగా పూజలందుకుంటున్నాడు. తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దైవతలకు దర్శనమిచ్చాడు. శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఆ రోజున హయగ్రీవస్వామిని పూజించడం వలన విద్యతో పాటు విజ్ఞానం లభిస్తాయని పురాణ వచనం. *జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్ |* *ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||* జ్ఞానం, ఆనందం మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు నిర్మలమైన స్పటికాకృతి కలిగి అన్ని విద్యలకు ఆధారమైన విద్యాధిదేవుడైన హయగ్రీవుడికి సమస్కరిస్తున్నాను. అని ఈ శ్లోకానికి అర్ధం. హయగ్రీవుడిని పూజించిన వారికి విద్యలం లభించడమే కాదు సకల సమస్యలు తీరి చల్లగా బతుకుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. భాగవతంతో పాటు దేవీ పురాణం, స్కాంధ పురాణం. అగమ శాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యను: అభ్యసించేవారు హయగ్రీవ ఆవిర్భావం రోజునే ప్రారంభిస్తారు. ఆ రోజున హయగ్రీవస్వామిని షోడశోపవారాలతో అష్టోత్తరాలతో పూజించాలి. ఆయనకు ప్రీతికరమైన యాలకుల మాలను వేసి శనగ గుగ్గిళ్లను నివేదించాలి తెల్లని పూలతో పూజించడం శ్రేష్టం. ఆ రోజున ఉప్పులేని ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
9 likes
12 shares
PSV APPARAO
1K views 5 months ago
#శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రక్షా బంధనం - రాఖీ పూర్ణిమ - జంధ్యాల పౌర్ణమి - హయగ్రీవ జయంతి 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #హయగ్రీవ జయంతి - శ్రావణమాసంలో రాఖీ పౌర్ణమి రోజు మరో ఆధ్యాత్మిక ప్రత్యేకత *హయగ్రీవ జయంతి* *గురు స్వరూపం.. హయగ్రీవుడు!* *ఆగస్టు 09 శనివారం హయగ్రీవ జయంతి సందర్భంగా...* భగవంతుడే అందరికీ ఆది గురువు. ఒక్కో దేవ తకూ ఒక్కో గురు స్వరూపం ఉంది. పరమేశ్వరుడిని గురువుగా భావిస్తే దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తాడు. అమ్మవారిని గురువుగా కొలిస్తే శారదగా జ్ఞానం ప్రసా దిస్తుంది. విష్ణుమూర్తిని గురువుగా పూజిస్తే.. హయగ్రీ వుడుగా కరుణిస్తాడు. నారాయణుడు ధరించిన అనేక అవతారాల్లో. గురు స్వరూపం హయగ్రీవుడు. గుర్రం ముఖం, నర శరీరంతో ఉంటాడు. ఆయన అవతరిం చిన శ్రావణ శుద్ధ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు. హయగ్రీవుడి ఉత్పత్తి గురించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. సృష్టి ఆదిలో మహా విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు, ఆయన నుంచి దేవతలు ఉద్భవించారు. దేవతలంతా తమ కర్తవ్యం ఏమిటని బ్రహ్మను అడిగా రట. అదే విషయాన్ని బ్రహ్మదేవుడు.. విష్ణుమూర్తిని అడిగాడట. అప్పుడు మహావిష్ణువు యజ్ఞం చేయాలని వారికి సూచించాడట. అయితే యజ్ఞం ఆచరించడానికి తగిన జ్ఞానం ప్రసాదించమని కోరాడట బ్రహ్మ. అప్పుడు నారాయణుడు హయగ్రీవ రూపంలో ప్రకటి తమై.. "ప్రపంచాన్ని సృష్టించి, నడపగలిగే జ్ఞానం, యజ్ఞ విజ్ఞానాన్ని ఇస్తున్నాన'ని వేదాలను బ్రహ్మ దేవు డికి అనుగ్రహించాడట. ఈ వేదాలను మధుకైటభులు అనే రాక్షసులు అపహరించగా.. హయగ్రీవుడు వాటిని సంరంక్షించి మళ్లీ బ్రహ్మకు అందజేశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. హయగ్రీవుడి రూపం విచిత్రంగా ఉంటుంది. గుర్రం ముఖం చైతన్యానికి ప్రతీక. గుర్రం సకలింపు నుంచి బీజాక్షరాలు ఉద్భవించాయని అంటారు. శుద్ద స్పటిక రూపం ఆయనది. నిర్మలత్వానికి చిహ్నం ఇది. రెండు చేతుల్లో శంఖ, చక్రాలు ధరించి ఉంటాడు. మరో చేతిలో పుస్తకం ఉంటుంది. ఇంకో చేతిని చిన్ముద్రతో చూపుతూ భక్తులను అనుగ్రహిస్తుంటాడీ దేవుడు. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు హయగ్రీవుడు. ఆయన్ను గురువుగా భావించి ఉపాసిస్తే.. సద్బుద్ధి కలుగుతుంది. సత్వ గుణం వికసిస్తుంది. విద్యాప్రాప్తి కలుగుతుంది. సకల దేవతా మంత్రాలు ఆధీనంలోకి వస్తాయని చెబుతారు. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
17 likes
19 shares
PSV APPARAO
633 views 5 months ago
#*రక్షాబంధన్* ఎంత పవర్ఫులో ఒకసారి చూద్దాం.... #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రక్షా బంధనం - రాఖీ పూర్ణిమ - జంధ్యాల పౌర్ణమి - హయగ్రీవ జయంతి 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శ్రావణ పూర్ణిమ / జంధ్యాల పూర్ణిమ ప్రాశస్త్యం *రక్షాబంధనం ఇలా జరపాలి* #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక మాత్రమే కాక విశ్వాసం, రక్షణ, ఆపత్కాలంలో ఆదుకుంటారన్న నమ్మకమే రక్షాబంధనం. తన రక్షణను కోరే ఎవరైనా రక్షించగల వ్యక్తికి రక్షాసూత్రం కట్టి వారి నుండి రక్షణ లభిస్తుందని విశ్వసించవచ్చు. సూత్రం అంటే అవిచ్ఛిన్నతకు ప్రతీక. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సమస్త ప్రపంచం సూత్రంలో మణులలా నాలో ఇమిడి ఉంది అని చెప్పడానికి కారణం ఇదే. విడిగా ఉన్న ముత్యాలు, రత్నాలను కలిపి హారంగా మలిచేదే సూత్రం. శ్రేయస్సును కోరే చెల్లెలు తన సోదరుని చేతికి సూత్రాన్ని కట్టి రక్షణ కోరుతుంది. సోదరుని శ్రేయస్సును కాంక్షిస్తుంది. ఈ పండుగను శ్రావణ మాసం శుక్లపక్ష పూర్ణిను నాడు జరుపుకోవడం ఆచారం. ఈ పండుగ గురించిన ప్రస్తావన భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఒకమారు యుధిష్ఠిరుడు మహాభారత యుద్ధంలో నేనెలా రక్షింపబడతాను అని ప్రశ్నిస్తే శ్రీకృష్ణుడు "రక్షా సూత్రమే నిన్ను రక్షిస్తుంద"ని సమాధానం చెబుతారు. పూర్వం ఒకసారి దేవతలకు, రాక్షసులకు పన్నెండు సంవత్సరాలపాటు జరిగిన యుద్ధంలో దేవేంద్రుడు ఓడిపోయి అమరావతికి వచ్చి తలదాచుకున్నాడు. ముల్లోకాలను ఆక్రమించిన రాక్షసులు అమరావతిని కూడా ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలిసి దేవేంద్రుడు దేవతల గురువు బృహస్పతిని ఏదైనా ఉపాయం చేసి విజయం లభించేలా ఆశీర్వదించమని ప్రార్ధించాడు. తన భర్త బృహస్పతిని ప్రార్ధించడం విన్న శచీదేవి "నేడు గొప్ప పర్వదినం. నేను మీ చేతికి ఈ రక్ష కడతాను అందువల్ల మీకు విజయం లభిస్తుంద"ని చెప్పింది. అనంతరం రక్షా సూత్రమును ఒకదానిని తయారుచేసి దానికి పూజలు చేసి దేవేంద్రుని కుడిచేతి మణికట్టుకు కట్టింది. తరువాత అమరావతిపై దండయాత్రకు వచ్చిన రాక్షసులను ఓడించి దేవేంద్రుడు విజయం సాధించాడు. ఓడిపోయిన రాక్షసులు తమ గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి దేవతలపై విజయం సాధించడానికి ఉపాయం చెప్ప మని కోరారు. శుక్రాచార్యుడు, "శచీదేవి కట్టిన రక్షా బంధనం వల్ల దేవేంద్రునికి విజయం లభించింది. దీని ప్రభావం ఒక సంవత్సర కాలం ఉంటుంది. అంతవరకు ఓపిక పట్టండి" అని సమాధానమిస్తాడు. ఈ విధంగా రక్షాబంధనం అమల్లోకి వచ్చినట్లు పురాణ కథనం. ఇది క్రమేణా సోదరి లేక సోదరి సమా సురాలు తన సోదరుని విజయం కోరుతూ రక్షాబంధనం కట్టడం ఆచారమైంది. మన దేశంలో 13వ శతాబ్దం నుంచే అమల్లో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. _రాఖీ పండుగ ఆచారం:_ రాఖీ పండుగనాడు నిత్యపూజల అనం తరం ఇంటిలో ఒకచోట ముగ్గు వేసి దాని | పై పీట పెట్టి సోదరుని కూర్చోబెట్టి నుదు టిపై బొట్టు పెట్టాలి. రాఖీని తీసుకొని... యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః | తేన త్వామభి బధ్నామి రక్ష మాచల మాచల || అనే శ్లోకాన్ని పఠిస్తూ సోదరుని ముంజేతికి రాఖీని కట్టాలి. మిఠాయి తినిపించాలి. రాఖీ కట్టిన అనంతరం సోదరుడు కృత జ్ఞతగా తన సోదరికి బహుమతి ఇవ్వడం ఆచారం. ఈ విధంగా సోదరి క్షేమాన్ని, రక్షణను కోరుతూ రాఖీ కట్టడం వల్ల సోదరుడికి శుభం కలుగుతుంది. సోదరికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సాధారణ జనసంప్రదాయం ప్రకారం రక్షాబంధనం నాడు పురోహితులు తమను పోషించే గృహాలకు వెళ్లి ఆ కుటుంబ సభ్యులందరికి రక్షా సూత్రం కట్టి ఆశీర్వదించే పద్ధతి ఉంది. కులపురోహితులు ఇళ్ల ద్వారాలు, కిటికీలు, పుస్తకాలకు కూడా పవిత్ర సూత్రం కడతారు. కొత్త పాత్రలకు కూడా పవిత్ర సూత్రం కట్టి బొట్టుపెట్టే ఆచారం ఉంది. గురువులు శిష్యులకు రక్షాసూత్రం కట్టే ఆచారం కూడా ఉంది. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
15 likes
12 shares