*జాతిపితకు నివాళులు అర్పించిన గిద్దలూరు తెలుగుదేశం నాయకులు*
*మార్కాపురం జిల్లా : జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్బంగా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం భారత రాజ్యాంగం పంచాయితీ వ్యవస్థను రూపొందించిందని, సత్యం, అహింస, త్యాగాలతో భారతదేశ స్వాతంత్య్రానికి నాయకత్వం వహించిన మహనీయుడు, ప్రపంచానికి శాంతి సందేశం ప్రబోధించిన జాతిపిత మహాత్మా గాంధీ అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గాంధీజీ ఆశయాలను పంచాయితీలలో అమలు చేస్తూ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తుందని, గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ప్రజా పాలన కొనసాగిస్తున్నారన్నారు*..
*ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షుడు సయ్యద్ శానేశావలి , సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య , 11 వ వార్డు కౌన్సిలర్ లోక్కు రమేష్ , పట్టణ ఉపాధ్యక్షులు పందీటి రజిని బాబు , టీడీపీ సీనియర్ నాయకులు గుంటక కొండయ్య , పార్లమెంట్ నాయకులు గుర్రం డానియేలు , బోయిలపల్లి కిషోర్ , ఓబిలిబోయిన వెంకటయ్య, తిరుమలరెడ్డి, మోడిగారి క్రిష్ణ , ఎలిశెట్టి వెంకటప్ప , సురేష్ (బిల్డర్) , గులాం గోవింద్ , మహబూబ్ బాషా(sk) , చిలకల రమణ , సంపత్ కుమార్ రెడ్డి , గిద్దలూరు మద్దిలేటి , బద్రి బాషా , దూదేకుల దస్తగిరి , గర్రె సాయినాధ్ , నర్సింహ మూర్తి , సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు*
#🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్