👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
954 views • 1 months ago
శంకరుడు పిల్లవాడి తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా? జవాబు పార్వతీ దేవి అంటే పరమ ప్రకృతి (సృష్టి). పరమ శివుడు అంటే పరమ పురుషుడు (చైతన్యం). ప్రకృతి అంటే పంచభూతాలు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం). పంచభూతాలలో కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నింటినీ తయారు చేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. పార్వతి తయారు చేసిన మానవదేహానికి లోపల శివ సంబంధమైన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము 'నేను' అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము మూడు గుణాల (సత్వ, రజస్, తమో గుణాలు) చేత బంధించబడి ఉంది. ఈ మూడు గుణాలే ప్రకృతి యొక్క మూలం. ఆ అమ్మవారి శరీరానికి సంబంధించిన నలుగుతో పిల్లవాడు తయారయ్యాడు. అంటే త్రిగుణాలలో కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఆ పిల్లవాని తలకు ప్రకృతి తెలుసు కానీ శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆ పిల్లవాడు చైతన్యంతో పోరాటం చేశాడు. అందుకే శంకరుడు ఆ పిల్లవాడి తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణాలు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు ఎప్పుడైతే శివుడి చేతి త్రిశూలం పిల్లవాడి కంఠమునకు తగిలిందో, పిల్ల వానిలో త్రిగుణాలకు సంబంధించిన బుద్ధిపోయింది. 'గ' అంటే గతి అంటే కదలడం; 'జ' అంటే పుట్టడం. గజ శిరము పెట్టిన తరువాత ఆ పిల్లవానికి ఎందులోంచి పుట్టి ఎందు లోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివసంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఈ కథ ప్రతీకాత్మకం మానవులమైన మనం చేయ వలసిన ఉపాసనా క్రమాన్ని వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం కోసం నలుగు పిండితో బొమ్మ, ప్రాణం, శివుడు తల నరికి వేయటం ఇలాంటివన్ని చెప్పారు. వినాయకుని ఏనుగు తల బ్రహ్మాండమును చెబితే, మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతాలు ఉన్నాయి. రెండూ పంచ భూతాలలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి అర్థమయితే 'తత్ త్వం అసి' అంటే 'అదే వాడై ఉన్నాడు' జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఈ కథ వెనుక ఉన్న కథ కాబట్టి తత్వమసి మహావాక్యం మహాగణపతిగా మన పూజలందుకొంటున్నాడు. 🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #🕉️ గణపతి బప్పా మోరియా
28 shares