Magic Share BannerEpisodic Banner

#పురాణాలూ_కథలు

1K Posts • 3M views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
839 views • 3 months ago
🪔🌺 కాశీ అన్నపూర్ణాదేవి స్థల పురాణం – విశిష్టత 🌺🪔 📍 కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని పవిత్రమైన వారణాసి (కాశీ)లో, శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి సమీపంలో ఉంది. అమ్మవారు ఇక్కడ అన్నపూర్ణేశ్వరి రూపంలో భక్తులకు అన్నం ప్రసాదిస్తూ కొలువై ఉన్నారు. 🌸 స్థల పురాణం ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో... "ఈ జగత్తంతా మాయ. అన్నం కూడా మాయే" అని అన్నారు.🙏🏻 అది విన్న పార్వతీదేవి, "అన్నమే జీవానికి ఆధారం. అన్నం లేకపోతే సృష్టి ఎలా కొనసాగుతుంది?" అని భావించి తన శక్తిని ఉపసంహరించుకుంది.🌺 🌍 వెంటనే ప్రపంచమంతా కరువు ఏర్పడింది. 🍚 అన్నం దొరకలేదు. 💧 జీవరాశులు ఆకలితో అలమటించాయి. 🙏 దేవతలు కూడా బాధపడ్డారు. అప్పుడు పరమశివుడు తన మాటలోని లోపాన్ని గ్రహించాడు. అమ్మవారు కాశీలో అన్నపూర్ణాదేవిగా ప్రత్యక్షమై బంగారు పాత్రలో అన్నం, బంగారు గరిటతో భిక్షను పంచసాగింది. పరమశివుడు స్వయంగా భిక్షాపాత్ర చేతబట్టి అమ్మవారి వద్దకు వచ్చి భిక్ష స్వీకరించాడు.🍚 ఆ తరువాత శివుడు ఇలా ప్రకటించాడు: "అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానం అన్నింటికంటే గొప్ప దానం." 🍚 అమ్మవారు శివుడికి ఎందుకు భిక్ష వేశారు? 🌺 ప్రపంచానికి అన్నం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి. 🌺 ఆహారం దైవస్వరూపమని బోధించడానికి. 🌺 శక్తి (అమ్మవారు) లేకుండా శివుడే కూడా కార్యరహితుడని తెలియజేయడానికి. 🌺 అన్నదానం మహాదానమని లోకానికి ఉపదేశించడానికి. 🌺 అహంకారాన్ని విడిచి వినయంతో జీవించాలని బోధించడానికి. ✨ కాశీ అన్నపూర్ణాదేవి విశిష్టత 🌾 అన్నపూర్ణాదేవిని దర్శిస్తే ఇంట్లో అన్నానికి లోటు ఉండదని విశ్వాసం. 🙏 ధనధాన్య సమృద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. 🍚 అన్నదానం చేసిన వారికి అమ్మవారి ప్రత్యేక కటాక్షం లభిస్తుందని చెబుతారు. 🪔 కాశీ విశ్వనాథుని దర్శనం, అన్నపూర్ణాదేవి దర్శనం కలిపి చేస్తే పుణ్యం మరింత పెరుగుతుందని విశ్వాసం. 🌺 ఆకలి తీర్చడం అంటే భగవంతుని సేవ చేసినట్లేనని ఈ క్షేత్రం బోధిస్తుంది. 📿 అన్నపూర్ణాదేవి ప్రార్థన అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణ వల్లభే । జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ॥,🙏🏻🍚 🙏 భావం ఓ అన్నపూర్ణా! ఎల్లప్పుడూ సంపూర్ణ కరుణతో నిండిన తల్లీ! శంకరునికి ప్రియమైన దేవీ! నాకు జ్ఞానం, వైరాగ్యం ప్రసాదించి నీ దివ్య భిక్షను అనుగ్రహించు. 🌺 అన్నం పరబ్రహ్మ స్వరూపం. 🍚 అన్నదానం మహాదానం. 🙏 అన్నపూర్ణ అమ్మవారి కృపతో ప్రతి ఇంటా అన్నపూర్ణత, ఐశ్వర్యం, ఆనందం నిండిపోవాలని కోరుకుందాం. 🌾🌾ఓం శ్రీ అన్నపూర్ణేశ్వర్యై నమః 🌺🙏,🌾🌾 #కాశీఅన్నపూర్ణ #అన్నపూర్ణాదేవి #కాశీవిశ్వనాథ్ ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం #🙏శ్రీ అన్నపూర్ణ దేవి🙏 #అన్నపూర్ణ దేవి
16 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
954 views • 1 months ago
శంకరుడు పిల్లవాడి తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా? జవాబు పార్వతీ దేవి అంటే పరమ ప్రకృతి (సృష్టి). పరమ శివుడు అంటే పరమ పురుషుడు (చైతన్యం). ప్రకృతి అంటే పంచభూతాలు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం). పంచభూతాలలో కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నింటినీ తయారు చేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. పార్వతి తయారు చేసిన మానవదేహానికి లోపల శివ సంబంధమైన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము 'నేను' అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము మూడు గుణాల (సత్వ, రజస్, తమో గుణాలు) చేత బంధించబడి ఉంది. ఈ మూడు గుణాలే ప్రకృతి యొక్క మూలం. ఆ అమ్మవారి శరీరానికి సంబంధించిన నలుగుతో పిల్లవాడు తయారయ్యాడు. అంటే త్రిగుణాలలో కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఆ పిల్లవాని తలకు ప్రకృతి తెలుసు కానీ శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆ పిల్లవాడు చైతన్యంతో పోరాటం చేశాడు. అందుకే శంకరుడు ఆ పిల్లవాడి తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణాలు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు ఎప్పుడైతే శివుడి చేతి త్రిశూలం పిల్లవాడి కంఠమునకు తగిలిందో, పిల్ల వానిలో త్రిగుణాలకు సంబంధించిన బుద్ధిపోయింది. 'గ' అంటే గతి అంటే కదలడం; 'జ' అంటే పుట్టడం. గజ శిరము పెట్టిన తరువాత ఆ పిల్లవానికి ఎందులోంచి పుట్టి ఎందు లోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివసంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఈ కథ ప్రతీకాత్మకం మానవులమైన మనం చేయ వలసిన ఉపాసనా క్రమాన్ని వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం కోసం నలుగు పిండితో బొమ్మ, ప్రాణం, శివుడు తల నరికి వేయటం ఇలాంటివన్ని చెప్పారు. వినాయకుని ఏనుగు తల బ్రహ్మాండమును చెబితే, మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతాలు ఉన్నాయి. రెండూ పంచ భూతాలలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి అర్థమయితే 'తత్ త్వం అసి' అంటే 'అదే వాడై ఉన్నాడు' జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఈ కథ వెనుక ఉన్న కథ కాబట్టి తత్వమసి మహావాక్యం మహాగణపతిగా మన పూజలందుకొంటున్నాడు. 🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #🕉️ గణపతి బప్పా మోరియా
28 shares