v. v. guptha
ShareChat
click to see wallet page
@299580595
299580595
v. v. guptha
@299580595
ఐ లవ్ షేర్ చాట్
#📙ఆధ్యాత్మిక మాటలు #🛕అయోధ్య రామమందిరం🙏 #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి 31-10-2025 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీరు ఆధ్యాత్మిక, ఆత్మిక గుప్త ముక్తిదళము, మీరు మొత్తం ప్రపంచానికి ముక్తిని ఇవ్వాలి, మీరు మునిగిపోయిన నావలను తీరానికి చేర్చాలి’’ ప్రశ్న:-సంగమములో తండ్రి మొత్తము కల్పమంతటిలోనూ ఉండని ఏ యూనివర్శిటీని తెరుస్తారు? జవాబు:-రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోవడము కోసం చదువుకునే గాడ్ ఫాదర్లీ యూనివర్శిటీని లేక కాలేజ్ ను సంగమములో తండ్రి మాత్రమే తెరుస్తారు. ఇటువంటి యూనివర్శిటీ మొత్తము కల్పములో ఉండదు. ఈ యూనివర్శిటీలో చదువు చదువుకుని మీరు డబల్ కిరీటధారులుగా, రాజులకే రాజులుగా అవుతారు. ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలను మొట్టమొదట బాబా అడుగుతున్నారు, ఇక్కడకు వచ్చి కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ మీకు ఎటువంటి వ్యాపార-వ్యవహారాలు లేవు, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు కూడా లేరు. మేము అనంతమైన తండ్రిని కలుసుకునేందుకు వెళ్తున్నాము అన్న ఆలోచనతో మీరు వస్తారు. ఇలా ఎవరు అంటున్నారు? ఆత్మ శరీరము ద్వారా అంటుంది. పారలౌకిక తండ్రి ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు, ఈ శరీరము ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఇలా అనంతమైన తండ్రి వచ్చి నేర్పించడమనేది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది. ప్రతి ఒక్కరి నావ మునిగిపోయి ఉంది, ఎవరు ఎంతగా పురుషార్థము చేస్తారో, అంతగా నావ తీరానికి చేరుతుంది. ఓ నావికుడా, నా నావను తీరానికి చేర్చండి అని పాడుతారు కదా. వాస్తవానికి ప్రతి ఒక్కరూ తమ పురుషార్థముతో తీరానికి చేరాలి. ఏ విధముగా ఈత నేర్పిస్తే, అది నేర్చుకున్న తర్వాత తమంతట తామే ఈదుతారు. అవన్నీ దైహిక విషయాలు. ఇవి ఆత్మిక విషయాలు. ఆత్మ ఇప్పుడు బురద ఊబిలో చిక్కుకుపోయిందని మీకు తెలుసు. దీని గురించి ఒక జింక ఉదాహరణను కూడా ఇస్తారు. అది నీరు అనుకుని వెళ్తుంది, కానీ అక్కడ బురద ఉంటుంది, అప్పుడు అందులో చిక్కుకుపోతుంది. అప్పుడప్పుడు స్టీమర్లు, కార్లు మొదలైనవి కూడా బురదలో చిక్కుకుపోతాయి, అప్పుడు వాటిని బయటకు తీస్తారు. అలా తీసేవారిని సాల్వేషన్ ఆర్మీ (ముక్తిదళము) అని అంటారు. మీరు ఆత్మిక ముక్తిదళము. అందరూ మాయ యొక్క ఊబిలో చాలా చిక్కుకుని ఉన్నారని మీకు తెలుసు, దీనిని మాయ ఊబి అని అంటారు. దీని నుండి మీరు బయటకు ఎలా రావచ్చు అనేది తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. వారు కూడా రక్షిస్తారు కానీ అక్కడ మనుష్యులకు మనుష్యుల సహాయము అవసరమవుతుంది. ఇక్కడైతే ఆత్మ వెళ్ళి ఊబిలో చిక్కుకుంది, దీని నుండి మీరు బయటకు ఎలా రావచ్చు అనే మార్గాన్ని తండ్రి తెలియజేస్తారు. అప్పుడు ఇతరులకు కూడా మీరు మార్గాన్ని తెలియజేయవచ్చు. మీ నావ ఈ విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి ఎలా వెళ్ళగలదు అని స్వయానికి మరియు ఇతరులకు మార్గాన్ని తెలియజేయాలి. సత్యయుగాన్ని క్షీర సాగరము అనగా సుఖ సాగరము అని అంటారు. ఇది దుఃఖ సాగరము. రావణుడు దుఃఖ సాగరములో ముంచేస్తాడు. తండ్రి వచ్చి సుఖ సాగరములోకి తీసుకువెళ్తారు. మిమ్మల్ని ఆత్మిక ముక్తిదళము అని అంటారు. మీరు శ్రీమతము ఆధారముగా అందరికీ మార్గాన్ని తెలియజేస్తారు. ఇద్దరు తండ్రులు ఉన్నారని, ఒకరు హద్దు తండ్రి, మరొకరు అనంతమైన తండ్రి అని ప్రతి ఒక్కరికీ అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రి ఉన్నా కూడా అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కానీ వారి గురించి ఏ మాత్రము తెలియదు. బాబా ఏమీ నింద చేయడము లేదు కానీ డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఈ సమయములో మనుష్యమాత్రులందరూ పంచ వికారాల రూపీ ఊబిలో చిక్కుకుని ఉన్న ఆసురీ సాంప్రదాయులుగా ఉన్నారని ఇది కూడా అర్థం చేయించేందుకని మాత్రమే చెప్తారు. దైవీ సాంప్రదాయులు వద్దకు వెళ్ళి ఆసురీ సాంప్రదాయులు నమస్కరిస్తారు ఎందుకంటే దైవీ సాంప్రదాయులు సంపూర్ణ నిర్వికారులు. సన్యాసులకు కూడా నమస్కరిస్తారు, వారు కూడా ఇళ్ళు-వాకిళ్ళు వదిలి వెళ్తారు, పవిత్రముగా ఉంటారు. ఈ సన్యాసులకు మరియు దేవతలకు రాత్రి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. దేవతలదైతే జన్మ కూడా యోగబలముతో జరుగుతుంది. ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఈశ్వరుడు ఇచ్చే గతి, వారు చూపే మార్గము అతీతమైనవని, ఈశ్వరుడి గురించి సంపూర్ణముగా ఎవ్వరూ తెలుసుకోలేరని అందరూ అంటారు. కేవలం ఈశ్వరుడు లేక భగవంతుడు అని అంటే అంత ప్రేమ అనుభవమవ్వదు. అన్నిటికన్నా మంచి పదము ‘బాప్’ (తండ్రి). మనుష్యులకు అనంతమైన తండ్రి గురించి తెలియదు అంటే అనాథల వలె ఉన్నారు. మనుష్యులు ఏమంటారు మరియు భగవంతుడు ఏమంటారు అన్న టాపిక్ గురించి మ్యాగజైన్ లో కూడా వచ్చింది. తండ్రి ఏమీ నిందించడం లేదు, వారు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఎందుకంటే తండ్రికైతే అందరి గురించి తెలుసు కదా. వీరిలో ఆసురీ గుణాలు ఉన్నాయని, పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారని అర్థం చేయించడము కోసం చెప్తారు. ఇక్కడైతే కొట్లాడే అవసరమే లేదు. వారు కౌరవులు అనగా ఆసురీ సాంప్రదాయులు. ఇది దైవీ సాంప్రదాయము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మనుష్యులు, మనుష్యులకు ముక్తి లేక జీవన్ముక్తి కోసం రాజయోగాన్ని నేర్పించడమనేది జరగదు. ఈ సమయములో తండ్రియే ఆత్మలైన మీకు నేర్పిస్తున్నారు. దేహ-అభిమానానికి, దేహీ-అభిమానానికి మధ్యన ఎంత వ్యత్యాసము ఉందో చూడండి. దేహాభిమానము వలన మీరు పడిపోతూ వచ్చారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. మీకు సత్యయుగములో దైహిక సంబంధాలు ఉండవని కాదు. అక్కడ - నేను ఆత్మను, పరమపిత పరమాత్ముని సంతానాన్ని అన్న జ్ఞానము ఉండదు. ఈ జ్ఞానము ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది, ఇది తర్వాత కనుమరుగైపోతుంది. మీరు మాత్రమే శ్రీమతముపై నడుచుకుని ప్రారబ్ధాన్ని పొందుతారు. తండ్రి రాజయోగాన్ని నేర్పించేందుకే వస్తారు. ఇటువంటి చదువు ఇంకేదీ ఉండదు. డబల్ కిరీటధారులైన రాజులు సత్యయుగములో ఉంటారు, ఆ తర్వాత సింగిల్ కిరీటధారుల రాజ్యాలు కూడా ఉంటాయి, ఇప్పుడు ఆ రాజ్యాలు లేవు, ప్రజలపై ప్రజల రాజ్యము ఉంది. పిల్లలైన మీరు ఇప్పుడు రాజ్యము కోసం చదువుతున్నారు, దీనిని గాడ్ ఫాదర్లీ యూనివర్శిటీ అని అంటారు. మీ పేరు కూడా వ్రాసి ఉంది. వారు గీతా పాఠశాల అన్న పేరు పెట్టుకుంటారు కానీ వాస్తవానికి అది చదివించేది ఎవరు? శ్రీకృష్ణ భగవానువాచ అని అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడైతే చదివించలేరు. శ్రీకృష్ణుడైతే స్వయమే పాఠశాలలో చదువుకునేందుకు వెళ్తారు. రాకుమార, రాకుమారీలు స్కూల్ కు ఎలా వెళ్తారు, అక్కడి భాషే వేరుగా ఉంటుంది. అలాగని సంస్కృతములో గీతను వినిపించారని కూడా కాదు. ఇక్కడైతే అనేక భాషలు ఉన్నాయి. ఏ రాజు ఉంటే, అతను తన భాషను నడిపిస్తారు. సంస్కృత భాష అనేది రాజులెవ్వరిదీ కాదు. బాబా ఏమీ సంస్కృతాన్ని నేర్పించటము లేదు. తండ్రి అయితే సత్యయుగము కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తండ్రి అంటున్నారు, కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందండి. ఇక్కడ ప్రతిజ్ఞ చేయిస్తారు. ఇక్కడకు ఎవరు వచ్చినా కూడా వారి చేత ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. కామముపై విజయాన్ని పొందడము ద్వారా మీరు జగత్ జీతులుగా అవుతారు. ఇది ముఖ్యమైన వికారము. ఈ హింస ద్వాపరము నుండి కొనసాగుతూ వస్తుంది, దీని ద్వారానే వామ మార్గము ప్రారంభమైంది. దేవతలు వామ మార్గములోకి ఎలా వెళ్తారో చూపించే మందిరాలు కూడా ఉన్నాయి. అక్కడ చాలా ఛీ-ఛీ చిత్రాలను తయారుచేసారు. అయితే, వామ మార్గములోకి ఎప్పుడు వెళ్ళారు, ఆ తిథి-తారీఖులైతే లేవు. కామ చితిపై కూర్చోవడముతో నల్లగా అవుతారని ఋజువవుతుంది కానీ నామ-రూపాలైతే మారిపోతాయి కదా. కామ చితిపైకి ఎక్కడముతో ఇనుపయుగము వారిగా అవుతారు. ఇప్పుడైతే పంచ తత్వాలు కూడా తమోప్రధానముగా ఉన్నాయి కదా, అందుకే శరీరము కూడా ఆ విధముగా తమోప్రధానముగా అవుతుంది. జన్మించినప్పుడే ఒకరు ఒక విధముగా, మరొకరు మరో విధముగా ఉంటారు. అక్కడైతే పూర్తిగా సుందరమైన శరీరాలు ఉంటాయి. ఇప్పుడు తమోప్రధానముగా ఉన్న కారణముగా శరీరాలు కూడా అదే విధముగా ఉన్నాయి. మనుష్యులు - ఈశ్వరా, ప్రభు మొదలైన రకరకాల పేర్లతో తలచుకుంటారు కానీ పాపం వారికి అసలు తెలియనే తెలియదు. ఓ బాబా, మీరు వచ్చి శాంతిని ఇవ్వండి అని ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఇక్కడైతే కర్మేంద్రియాలతో పాత్రను అభినయిస్తుంది కావున శాంతి ఎలా లభిస్తుంది. విశ్వములో లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు శాంతి ఉండేది. కానీ కల్పము ఆయుష్షు లక్షల సంవత్సరాలు అనేటప్పటికి పాపం మనుష్యులు ఎలా అర్థం చేసుకుంటారు. వీరి (దేవతల) రాజ్యము ఉన్నప్పుడు ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉండేది, ఇతర ఏ ఖండములోనూ ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంది అని అనరు. ఇక్కడ ఆత్మ ఏక రాజ్యము ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు మనము ఏక రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని ఆత్మ అయిన మీకు తెలుసు. అక్కడ మొత్తం విశ్వానికి యజమానులుగా మనమే ఉంటాము. తండ్రి మనకు అంతా ఇచ్చేస్తారు. ఎవ్వరూ మన నుండి రాజ్యాన్ని లాక్కోలేరు. మనము మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతాము. విశ్వములో సూక్ష్మవతనము, మూలవతనము ఉండవు. ఈ సృష్టి చక్రము ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. దీని గురించి రచయిత అయిన తండ్రికి మాత్రమే తెలుసు. అలాగని రచనను రచిస్తారని కాదు. పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచముగా తయారుచేసేందుకు తండ్రి సంగమములోనే వస్తారు. బాబా దూరదేశము నుండి వచ్చారు. కొత్త ప్రపంచము మన కోసమే తయారవుతుందని మీకు తెలుసు. బాబా ఆత్మలైన మన అలంకరణను చేస్తున్నారు. దానితోపాటు శరీరాల అలంకరణ కూడా జరుగుతుంది. ఆత్మ పవిత్రముగా అయినందుకు మళ్ళీ శరీరము కూడా సతోప్రధానమైనది లభిస్తుంది. సతోప్రధాన తత్వాలతో శరీరాలు తయారవుతాయి. వీరివి సతోప్రధాన శరీరాలు కదా, అందుకే సహజ సౌందర్యము ఉంటుంది. రిలీజియన్ ఈజ్ మైట్ (ధర్మములో శక్తి ఉంది) అని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు శక్తి ఎక్కడ నుండి లభించింది? ఒక్క దేవీ-దేవతల ధర్మము నుండే శక్తి లభిస్తుంది. ఆ దేవతలే మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు, ఇతరులెవ్వరూ విశ్వానికి యజమానులుగా అవ్వరు. మీకు ఎంత శక్తి లభిస్తుంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపనను శివబాబా బ్రహ్మా ద్వారా చేస్తారని వ్రాసి కూడా ఉంది. ఈ విషయాలు ప్రపంచములో ఎవ్వరికీ తెలియవు. తండ్రి అంటారు, నేను బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తాను, ఆ తర్వాత వారిని సూర్యవంశీ రాజ్యములోకి తీసుకువస్తాను. ఎవరైతే బాగా చదువుకుంటారో, వారు పాస్ అయి సూర్యవంశములోకి వస్తారు. ఇదంతా జ్ఞానము యొక్క విషయము. కానీ వారు స్థూల బాణాలు, ఆయుధాలు మొదలైనవి చూపించారు. బాణాలు వేయడం కూడా నేర్చుకుంటారు. చిన్న పిల్లలకు కూడా తుపాకీ పేల్చడం నేర్పిస్తారు. మీది యోగ బాణము. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. హింస యొక్క విషయమేదీ లేదు. మీ చదువు కూడా గుప్తమైనది. మీరు ఆధ్యాత్మిక, ఆత్మిక ముక్తిదళము. ఆత్మిక సైన్యమెలా ఉంటుంది అనేది ఎవ్వరికీ తెలియదు. మీరు గుప్తమైన ఆధ్యాత్మిక, ఆత్మిక ముక్తిదళము. మీరు మొత్తము ప్రపంచానికి విముక్తిని ఇస్తారు. అందరి నావలు మునిగిపోయి ఉన్నాయి. ఇకపోతే బంగారు లంక ఏదీ లేదు. బంగారు ద్వారక కిందకు వెళ్ళిపోయిందని, అది బయటకు వస్తుందని కాదు. ద్వారకలో కూడా వీరి రాజ్యముండేది కానీ అది సత్యయుగములో ఉండేది. సత్యయుగీ రాజుల డ్రస్ పూర్తిగా వేరుగా ఉంటుంది, త్రేతాయుగములో వారిది వేరుగా ఉంటుంది. వేర్వేరు డ్రస్ లు, వేర్వేరు ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. ప్రతి ఒక్క రాజు యొక్క ఆచారాలు, పద్ధతులు ఎవరివి వారివే ఉంటాయి. సత్యయుగము పేరు వింటూనే మనసు సంతోషిస్తుంది. దానిని స్వర్గము, ప్యారడైజ్ అని అంటారు కానీ మనుష్యులకు ఏమీ తెలియదు. ముఖ్యమైనది ఈ దిల్వాడా మందిరము. ఇది పూర్తిగా మీ స్మృతిచిహ్నమే. మోడల్స్ అయితే సదా చిన్నవిగానే తయారుచేస్తారు కదా. ఇవి పూర్తిగా ఏక్యురేట్ మోడల్స్. శివబాబా కూడా ఉన్నారు, ఆదిదేవ్ కూడా ఉన్నారు, పైన వైకుంఠాన్ని చూపించారు. శివబాబా ఉన్నప్పుడు తప్పకుండా రథము కూడా ఉంటుంది. ఆదిదేవ్ కూర్చుని ఉన్నారు, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది శివబాబా రథము. మహావీరులే రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఆత్మలో శక్తి ఎలా వస్తుంది, ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పదే-పదే స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అయిన మనము సతోప్రధానముగా ఉన్నప్పుడు పవిత్రముగా ఉండేవారము. శాంతిధామములో, సుఖధామములో తప్పకుండా పవిత్రముగానే ఉంటాము. ఇది ఎంత సహజమైన విషయము అనేది ఇప్పుడు బుద్ధిలోకి వస్తుంది. భారత్ సత్యయుగములో పవిత్రముగా ఉండేది. అక్కడ అపవిత్ర ఆత్మలు ఉండలేవు. ఇంతమంది పతిత ఆత్మలు పైకి ఎలా వెళ్తారు. తప్పకుండా పవిత్రముగా అయ్యే వెళ్తారు. నిప్పు అంటుకుంటుంది, అప్పుడు ఆత్మలందరూ వెళ్ళిపోతారు. ఇకపోతే శరీరాలు ఉండిపోతాయి. ఈ గుర్తులన్నీ కూడా ఉన్నాయి. హోలిక యొక్క అర్థాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. మొత్తము ప్రపంచమంతా ఇందులో స్వాహా అవ్వనున్నది. ఇది జ్ఞాన యజ్ఞము. జ్ఞానమనే పదాన్ని తీసేసి వారు రుద్ర యజ్ఞము అని అంటారు. వాస్తవానికి ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇది బ్రాహ్మణుల ద్వారానే రచింపబడుతుంది. సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు మీరే. ప్రజాపిత బ్రహ్మాకు అయితే అందరూ సంతానమే కదా. బ్రహ్మా ద్వారానే మనుష్య సృష్టి రచింపబడుతుంది. బ్రహ్మానే గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు, వారి వంశవృక్షము ఉంటుంది కదా. ఏ విధముగా వేర్వేరు వంశవృక్షాలు ఉంటాయి కదా. మూలవతనములో ఆత్మల వంశవృక్షము నియమానుసారముగా ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. శివబాబా, ఆ తర్వాత బ్రహ్మా-విష్ణు-శంకరులు, ఆ తర్వాత లక్ష్మీ-నారాయణులు మొదలైనవారు, ఇదంతా మనుష్యుల వంశవృక్షము. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఆత్మిక ముక్తిదళముగా అయి స్వయానికి మరియు సర్వులకు సరైన మార్గాన్ని తెలియజేయాలి. మొత్తం ప్రపంచాన్ని విషయ సాగరము నుండి విముక్తి చేసేందుకు తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి. 2. జ్ఞాన-యోగాలతో పవిత్రముగా అయి ఆత్మ యొక్క అలంకరణను చేయాలి, శరీరాలను కాదు. ఆత్మ పవిత్రముగా అయితే శరీరము యొక్క అలంకరణ స్వతహాగానే జరుగుతుంది. వరదానము:-దేని నుండైనా పక్కకు తప్పుకునేందుకు బదులుగా ప్రతి క్షణము తండ్రి ఆధారాన్ని అనుభవము చేసే నిశ్చయబుద్ధి విజయీ భవ విజయీ భవ యొక్క వరదానాన్ని పొందిన ఆత్మ ప్రతి క్షణము స్వయాన్ని ఆధారము కింద ఉన్నట్లుగా అనుభవము చేస్తుంది. వారి మనసులో సంకల్పమాత్రముగా కూడా ఏ ఆధారము లేనట్లుగా లేక ఒంటరిగా ఉన్నట్లుగా అనుభవమవ్వదు. వారికి ఎప్పుడూ ఉదాసీనత లేక అల్పకాలికమైన హద్దులోని వైరాగ్యము రాదు. వారు ఎప్పుడూ ఏ కార్యము నుండైనా, సమస్య నుండైనా లేక వ్యక్తి నుండైనా పక్కకు తప్పుకోరు. వారు ప్రతి కర్మ చేస్తూ, ప్రతీది ఎదుర్కొంటూ, సహయోగులుగా అవుతూ, అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటారు. స్లోగన్:-ఒక్క తండ్రి సాంగత్యములోనే ఉండండి మరియు తండ్రినే మీ కంపానియన్ (సహచరుని)గా చేసుకోండి.   అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి దివ్య బుద్ధి రూపీ విమానము ద్వారా అన్నిటికంటే ఉన్నతమైన శిఖరము యొక్క స్థితిలో స్థితులై, అవ్యక్త వతనవాసులుగా అయ్యి విశ్వములోని సర్వాత్మల కొరకు శుభ భావన మరియు శ్రేష్ఠ కామనల సహయోగపు అలను వ్యాపింపజేయండి. యోగ ప్రయోగము ద్వారా దుఃఖిత-అశాంత ఆత్మలకు శాంతి మరియు శక్తుల సకాష్ ను ఇవ్వండి. "
#📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🙏నా దేశ గొప్పతనం #🎶భక్తి పాటలు🔱 30-10-2025 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు చాలా-చాలా సాధారణముగా ఉండాలి, ఫ్యాషనబుల్ మరియు ఖరీదైన వస్త్రాలు ధరించినా కూడా దేహాభిమానము వస్తుంది’’ ప్రశ్న:-భాగ్యములో ఉన్నత పదవి లేకపోతే పిల్లలు ఏ విషయములో సోమరులుగా ఉంటారు? జవాబు:-బాబా అంటారు - పిల్లలూ, స్వయాన్ని తీర్చిదిద్దుకునేందుకు చార్ట్ పెట్టండి. స్మృతి చార్ట్ పెట్టడము వలన చాలా లాభము ఉంటుంది. నోట్ బుక్ సదా చేతిలో ఉండాలి. చెక్ చేసుకోండి - ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాను? నా రిజిస్టర్ ఎలా ఉంది? దైవీ క్యారెక్టర్ ఉందా? కర్మలు చేస్తున్నప్పుడు బాబా స్మృతి ఉంటుందా? స్మృతి ద్వారానే తుప్పు తొలగుతుంది, ఉన్నతమైన భాగ్యము తయారవుతుంది. పాట:-భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు... ▶ ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లల వద్ద ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రము ఇంటిలో తప్పకుండా ఉండాలి. వీరిని (లక్ష్మీ-నారాయణులను) చూస్తే చాలా సంతోషము కలగాలి ఎందుకంటే ఇదే మీ చదువు యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము. మనము విద్యార్థులము మరియు మనల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారు అని మీకు తెలుసు. మనము ఈశ్వరీయ స్టూడెంట్స్ లేక విద్యార్థులము, మనము ఇది చదువుకుంటున్నాము. అందరి కొరకు ఇదొక్కటే ఉద్దేశ్యము. వీరిని చూస్తే చాలా సంతోషము కలగాలి. పాట కూడా పిల్లలు విన్నారు. వారు చాలా భోళానాథుడు. కొంతమంది శంకరుడిని భోళానాథుడని భావిస్తారు, మళ్ళీ శివుడిని మరియు శంకరుడిని కలిపేస్తారు. ఇప్పుడు మీకు తెలుసు - ఆ శివుడు ఉన్నతోన్నతమైన భగవంతుడు మరియు శంకరుడు దేవత, మరి ఇద్దరూ ఒక్కరే ఎలా అవుతారు. భక్తులను రక్షించేవారు... అని కూడా పాటలో విన్నారు, అనగా తప్పకుండా భక్తులకు ఏవో ఆపదలు ఉన్నాయి. పంచ వికారాల ఆపదలు అందరికీ ఉన్నాయి. అందరూ భక్తులే. జ్ఞాని అని ఎవ్వరినీ అనలేరు. ఏ విధముగా శివుడు మరియు శంకరుడు వేర్వేరో, అదే విధముగా జ్ఞానము మరియు భక్తి పూర్తిగా వేర్వేరు విషయాలు. ఎప్పుడైతే జ్ఞానము లభిస్తుందో, అప్పుడిక భక్తి ఉండదు. మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. అర్ధకల్పము కొరకు సద్గతి లభిస్తుంది. ఒక్క సూచనతోనే మీరు అర్ధకల్పము యొక్క వారసత్వాన్ని పొందుతారు. భక్తులకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీరు చూస్తున్నారు. జ్ఞానము ద్వారా మీరు దేవతలుగా అవుతారు, ఆ తర్వాత భక్తులకు కష్టాలు వచ్చినప్పుడు అంటే దుఃఖము కలిగినప్పుడు తండ్రి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, డ్రామానుసారముగా ఏదైతే గతించిందో, అది మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. ఆ తర్వాత భక్తి మొదలైనప్పుడు వామ మార్గము ప్రారంభమవుతుంది అనగా పతితులుగా అయ్యే మార్గము ప్రారంభమవుతుంది. అందులో కూడా నంబర్ వన్ కామము, ఈ విషయములోనే ఏమని చెప్తారంటే - కామముపై విజయాన్ని పొందినట్లయితే మీరు జగత్ జీతులుగా అవుతారు. వారెవ్వరూ విజయము పొందలేరు. రావణ రాజ్యములో వికారాలు లేకుండానైతే ఎవ్వరి శరీరమూ జన్మించదు, సత్యయుగములో రావణ రాజ్యము ఉండదు. అక్కడ కూడా ఒకవేళ రావణుడు ఉంటే ఇక మరి భగవంతుడు రామ రాజ్యాన్ని స్థాపన చేసి ఏమి చేసినట్లు? తండ్రికి ఎంత చింత ఉంటుంది. నా పిల్లలు సుఖముగా ఉండాలి అని కోరుకుంటారు. పిల్లలు సుఖముగా ఉండాలని ధనాన్ని కూడబెట్టి పిల్లలకు ఇస్తారు. కానీ ఇక్కడైతే అలా జరగదు. ఇది ఉన్నదే దుఃఖము యొక్క ప్రపంచము. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు అక్కడ జన్మ-జన్మాంతరాలు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీకు అపారమైన ధనము లభిస్తుంది, 21 జన్మలు అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు. దివాలా తీయరు. ఈ విషయాలను బుద్ధిలో ధారణ చేసి ఆంతరికముగా చాలా సంతోషముగా ఉండాలి. మీ జ్ఞానము మరియు యోగము అంతా గుప్తమైనవి. స్థూలమైన ఆయుధాలు మొదలైనవేవీ లేవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది జ్ఞాన ఖడ్గము. కానీ దీనికి గుర్తుగా వారు స్థూలమైన ఆయుధాలను దేవీల చేతులలో చూపించారు. శాస్త్రాలు మొదలైనవి ఎవరైతే చదువుతారో, వారెప్పుడూ, ఇది జ్ఞాన ఖడ్గము, ఇది జ్ఞాన కత్తి అని అనరు. ఇది అనంతమైన తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. శక్తి సైన్యము విజయము పొందారంటే వారి వద్ద తప్పకుండా ఏవో ఆయుధాలు ఉంటాయని వారు భావిస్తారు. తండ్రి వచ్చి ఈ పొరపాట్లన్నింటినీ తెలియజేస్తారు. మీ ఈ విషయాలను చాలామంది మనుష్యులు వింటారు. విద్వాంసులు మొదలైనవారు కూడా ఒక రోజు వస్తారు. వీరు అనంతమైన తండ్రి కదా. పిల్లలైన మీరు శ్రీమతముపై నడుచుకోవడములోనే కళ్యాణముంది, అప్పుడు దేహాభిమానము తొలగుతుంది, అందుకే షావుకారులు రారు. తండ్రి అంటున్నారు, దేహ అహంకారాన్ని వదలండి. మంచి వస్త్రాలు మొదలైనవాటి యొక్క నషా కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు వనవాహములో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అత్తవారింటికి వెళ్తారు. అక్కడ మీకు చాలా ఆభరణాలు వేస్తారు. ఇక్కడ ఖరీదైన వస్త్రాలు ధరించకూడదు. తండ్రి చెప్తున్నారు, పూర్తిగా సాధారణముగా ఉండాలి. నేను ఎటువంటి కర్మలు చేస్తానో, నన్ను చూసి ఇతరులు చేస్తారు. పిల్లలు కూడా సాధారణముగా ఉండాలి. లేకపోతే దేహ అభిమానము వస్తుంది. అవన్నీ చాలా నష్టపరుస్తాయి. మనము అత్తవారింటికి వెళ్తామని, అక్కడ మనకు చాలా ఆభరణాలు లభిస్తాయని మీకు తెలుసు. ఇక్కడ మీరు ఆభరణాలు మొదలైనవి ధరించకూడదు. ఈ రోజుల్లో దొంగతనాలు మొదలైనవి ఎన్ని జరుగుతున్నాయి. దారిలోనే దొంగలు దోచుకుంటారు. రోజురోజుకూ ఈ గొడవలు మొదలైనవి ఎక్కువవుతూ ఉంటాయి, అందుకే తండ్రి అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. దేహాభిమానములోకి రావడముతో తండ్రిని మర్చిపోతారు. ఈ శ్రమ ఇప్పుడే చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత భక్తి మార్గములో ఎప్పుడూ ఈ శ్రమ చేయవలసిన అవసరముండదు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. తండ్రి పురుషోత్తమ సంగమయుగములోనే వస్తారని మీకు తెలుసు. యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది. అటామిక్ బాంబులు మొదలైనవి చాలా తయారుచేస్తూ ఉంటారు. వాటిని తయారుచేయడం ఆపమని ఎంత తల కొట్టుకున్నా కానీ అలా జరగదు. అది డ్రామాలో నిశ్చితమై ఉంది. అర్థం చేయించినా కూడా అర్థం చేసుకోరు. మృత్యువు జరగవలసిందే అన్నప్పుడు అవి తయారుచేయడమనేది ఎలా ఆగుతుంది. వారు అర్థం చేసుకున్నా కానీ తయారుచేయడం మానరు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. యాదవులు మరియు కౌరవులు సమాప్తమవ్వాల్సిందే. యాదవులంటే యూరోప్ వాసులు. వారిది సైన్స్ గర్వము, దానితో వినాశనము జరుగుతుంది. ఆ తర్వాత సైలెన్స్ గర్వము యొక్క విజయము జరుగుతుంది. మీకు శాంతి యొక్క గర్వములో ఉండటము (శాంతి స్వరూపముగా ఉండటము) నేర్పించడం జరుగుతుంది. తండ్రిని స్మృతి చేయండి - డెడ్ సైలెన్స్. ఆత్మనైన నేను శరీరము నుండి అతీతముగా ఉన్నాను. శరీరాన్ని విడిచిపెట్టడానికి మనము పురుషార్థము చేసినట్లుగా, ఎప్పుడైనా, ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టడానికి పురుషార్థము చేస్తారా? ప్రపంచమంతా వెతికి రండి - ఓ ఆత్మా, ఇప్పుడు నీవు శరీరాన్ని వదలి వెళ్ళాలి అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా. పవిత్రముగా అవ్వండి. లేకపోతే తర్వాత శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. శిక్షలు ఎవరు అనుభవిస్తారు? ఆత్మ. నీవు ఫలానా పాపాలు చేసావు, శిక్షలు అనుభవించు అని ఆ సమయములో సాక్షాత్కారమవుతుంది. ఆ సమయములో జన్మ-జన్మాంతరాల శిక్ష లభిస్తున్నట్లుగా అనుభవమవుతుంది. ఇంతటి దుఃఖాన్ని అనుభవించడమంటే, ఇక సుఖము యొక్క బ్యాలెన్స్ ఏముంటుంది? తండ్రి అంటున్నారు, ఇప్పుడు ఎటువంటి పాప కర్మలు చేయకండి, మీ రిజిస్టర్ పెట్టుకోండి. ప్రతి ఒక్క పాఠశాలలో నడవడిక యొక్క రిజిస్టర్ ను పెడతారు కదా. భారత్ యొక్క క్యారెక్టర్ బాలేదు అని ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అంటారు. మేము వీరి (లక్ష్మీ-నారాయణుల) వంటి క్యారెక్టర్స్ ను తయారుచేసుకుంటున్నామని చెప్పండి. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రమైతే సదా మీతోపాటు ఉండాలి. ఇది లక్ష్యము-ఉద్దేశ్యము. మనము ఈ విధముగా తయారవుతాము. శ్రీమతము ఆధారముగా మనము ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నాము. ఇక్కడ నడవడికను తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇక్కడ మీ కచేరి కూడా జరుగుతుంది. అన్ని సెంటర్లలోనూ పిల్లలు కచేరి జరపాలి. చార్ట్ పెడితే పరివర్తన అవుతారు అని రోజూ చెప్పండి. ఎవరి భాగ్యములోనైనా లేకపోతే, ఇక వారు సోమరులుగా అయిపోతారు. చార్ట్ పెట్టడము చాలా మంచిది. మనము ఈ 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడము ద్వారానే చక్రవర్తీ రాజులుగా అవుతామని మీకు తెలుసు. ఇది ఎంత సహజము. అంతేకాక పవిత్రముగా కూడా అవ్వాలి. స్మృతియాత్ర యొక్క చార్ట్ పెట్టండి, ఇందులో మీకు చాలా లాభముంది. నోట్ బుక్ తీయలేదంటే, బాబాను స్మృతి చేయలేదని భావించండి. నోట్ బుక్ సదా చేతిలో ఉంచుకోండి. ఎంత సమయము తండ్రిని స్మృతి చేసాను అని మీ చార్ట్ చూసుకోండి. స్మృతి లేకుండా తుప్పు వదలదు. తుప్పును వదిలించేందుకు వస్తువును కిరోసిన్ లో వేస్తారు కదా. కర్మలు చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడు పురుషార్థము యొక్క ఫలము లభిస్తుంది. ఇందులో శ్రమ ఉంది కదా. తలపై కిరీటాన్ని ఊరికే అలా పెట్టరు కదా. బాబా ఇంత ఉన్నత పదవిని ఇస్తున్నారు, ఎంతోకొంత శ్రమించాలి కదా. ఇందులో కాళ్ళు, చేతులు మొదలైనవేవీ కదిలించవలసిన అవసరము లేదు. చదువైతే పూర్తిగా సహజమైనది. శివబాబా నుండి బ్రహ్మా ద్వారా మనము ఈ విధముగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాడ్జ్ ధరించి ఉండాలి. వాస్తవానికి ఇది కోట్ ఆఫ్ ఆర్మ్స్ (రాజ ముద్ర) అని చెప్పండి. అర్థం చేయించడములో చాలా రాయల్టీ ఉండాలి. చాలా మధురతతో అర్థం చేయించాలి. రాజ ముద్ర గురించి కూడా అర్థం చేయించాలి. ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి అని దేనిని అంటారు? మీకు తండ్రి గురించి తెలుసా? లౌకిక తండ్రినైతే గాడ్ అని అనరు. ఆ అనంతమైన తండ్రియే పతిత-పావనుడు, సుఖ సాగరుడు. వారి నుండే అపారమైన సుఖము లభిస్తుంది. తల్లి-తండ్రులు సుఖము ఇస్తారని అజ్ఞాన కాలములో భావిస్తారు. వారు అత్తవారింటికి పంపిస్తారు. ఇప్పుడు మీది అనంతమైన అత్తవారిల్లు, అది హద్దులోని అత్తవారిల్లు. ఆ తల్లి-తండ్రులు మహా అయితే 5-7 లక్షలు లేక కోటి రూపాయలు ఇస్తారు. మీకైతే తండ్రి, పదమా పదమపతులుగా అయ్యే పిల్లలు అని పేరు పెట్టారు. అక్కడైతే ధనము యొక్క విషయమే లేదు. అక్కడ అన్నీ లభిస్తాయి. చాలా మంచి-మంచి మహళ్ళు ఉంటాయి. జన్మ-జన్మాంతరాల కొరకు మీకు మహళ్ళు లభిస్తాయి. సుదాముని ఉదాహరణ ఉంది కదా. పిడికెడు బియ్యమని విన్నారు కనుక ఇక్కడకు కూడా అవి తీసుకుని వస్తారు. ఇప్పుడు వట్టి బియ్యమైతే తినరు. కావున దానితో పాటు కొంత మసాలా మొదలైనవి కూడా తీసుకువస్తారు. ఎంత ప్రేమతో తీసుకువస్తారు. బాబా అయితే మనకు జన్మ-జన్మాంతరాల కొరకు ఇస్తారు, అందుకే వారిని దాత అని అంటారు. భక్తి మార్గములో మీరు ఈశ్వరార్థము ఇస్తే దానికి అల్పకాలము కొరకు మరుసటి జన్మలో లభిస్తుంది. కొంతమంది పేదవారికి ఇస్తారు, కాలేజ్ నిర్మిస్తారు, దానికి వారికి మరుసటి జన్మలో చదువు దానముగా లభిస్తుంది. ధర్మశాలలు నిర్మిస్తే ఇల్లు లభిస్తుంది ఎందుకంటే ధర్మశాలలకు చాలామంది వచ్చి సుఖము పొందుతారు. ఇక్కడ ఇది జన్మ-జన్మాంతరాల విషయము. శివబాబాకు ఏదైతే ఇస్తారో, దానినంతా మన కోసమే ఉపయోగిస్తారని మీకు తెలుసు. శివబాబా అయితే తమ వద్ద ఉంచుకోరు. అంతా ఇచ్చేయండి, అప్పుడు విశ్వానికి యజమానిగా అవుతారని వీరికి కూడా చెప్పారు. వినాశన సాక్షాత్కారము కూడా చేయించారు, రాజ్యము యొక్క సాక్షాత్కారము కూడా చేయించారు. అంతే, బాబా నన్ను విశ్వానికి యజమానిగా చేస్తున్నారు అని నషా కలిగింది. గీతలో కూడా అర్జునుడికి - నన్ను స్మృతి చేసినట్లయితే నీవు ఈ విధముగా అవుతావు అని సాక్షాత్కారము చేయించినట్లుగా ఉంది. వినాశనము మరియు స్థాపన యొక్క సాక్షాత్కారము చేయించారు. వీరికి కూడా ప్రారంభములో సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కింది. డ్రామాలో ఈ పాత్ర ఉంది. భగీరథుని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. మేము ఇలా అవుతాము అని పిల్లలైన మీకు ఈ లక్ష్యము-ఉద్దేశ్యము బుద్ధిలో ఉండాలి. ఎంత పురుషార్థము చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. ఫాలో ఫాదర్ అని అంటూ ఉంటారు. ఇది ఈ సమయము యొక్క విషయమే. అనంతమైన తండ్రి చెప్తున్నారు, నేను ఏదైతే సలహా ఇస్తున్నానో, దానిని ఫాలో చేయండి. వీరు ఏం చేసారో, అది కూడా చెప్తారు. వారిని వ్యాపారి, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అని అంటారు కదా. బాబా అకస్మాత్తుగానే అంతా వదిలేశారు. మొదట ఆ రత్నాల వ్యాపారిగా ఉండేవారు, ఇప్పుడు అవినాశీ జ్ఞాన రత్నాల వ్యాపారిగా అయ్యారు. నరకాన్ని స్వర్గముగా చేయడం ఎంత గొప్ప ఇంద్రజాలము. అంతేకాక, వీరు వ్యాపారి కూడా. పిల్లలకు ఎంత మంచి వ్యాపారము ఇస్తారు. మీ వద్ద ఉన్న విలువలేనివాటిని మరియు పిడికెడు బియ్యాన్ని తీసుకుని మహళ్ళు ఇస్తారు. వారు ఎంత మంచి సంపాదనను చేయిస్తారు. వజ్రాల వ్యాపారములో కూడా ఇలాగే జరుగుతుంది. ఎవరైనా అమెరికన్ కస్టమర్ వస్తే, వారి నుండి 100 రూపాయల వస్తువుకు 500, 1000 రూపాయలు కూడా తీసుకుంటారు. వారి నుండైతే చాలా డబ్బులు తీసుకుంటారు. మీ వద్దనైతే అన్నిటికన్నా పాత వస్తువు ఉంది, అదే ప్రాచీన యోగము. మీకు ఇప్పుడు భోళానాథుడైన తండ్రి లభించారు. వారు ఎంత భోళా. మిమ్మల్ని వారు ఎలా తయారుచేస్తున్నారు. విలువలేనివాటికి రిటర్న్ లో మిమ్మల్ని 21 జన్మల కోసం ఎలా తయారుచేస్తారు. మనుష్యులకు ఏమీ తెలియదు. అప్పుడప్పుడు భోళానాథుడు ఇది ఇచ్చారని అంటారు, అప్పుడప్పుడు అంబ ఇచ్చారని అంటారు లేక గురువు ఇచ్చారని అంటారు. ఇక్కడ ఉన్నది చదువు. మీరు ఈశ్వరీయ పాఠశాలలో కూర్చున్నారు. ఈశ్వరీయ పాఠశాల అని గీతను అంటారు. గీతలో భగవానువాచ అని ఉంది. కానీ భగవంతుడు అని ఎవరిని అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ గురించి తెలుసా అని ఎవరినైనా అడగండి. తండ్రి తోట యజమాని. మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తున్నారు. దానిని గార్డెన్ ఆఫ్ అల్లాహ్ (అల్లా యొక్క పుష్పాల తోట) అని అంటారు. యూరోపియన్లు కూడా ప్యారడైజ్ అని అంటారు. భారత్ పరిస్తాన్ గా ఉండేది, ఇప్పుడు కబ్రిస్తాన్ (స్మశానవాటిక) గా ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు పరిస్తాన్ కు యజమానులుగా అవుతారు. తండ్రి వచ్చి నిద్రిస్తున్న వారిని మేలుకొలుపుతారు. ఇది కూడా మీకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఎవరైతే స్వయం మేలుకుంటారో, వారు ఇతరులను కూడా మేలుకొలుపుతారు. మేలుకొలపడం లేదు అంటే స్వయం మేలుకోలేదని అర్థము. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ పాటలు మొదలైనవి కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. కొన్ని పాటలు చాలా బాగున్నాయి. మీరు ఉదాసీనముగా ఉన్నప్పుడు ఈ పాటలు పెట్టుకున్నట్లయితే సంతోషములోకి వస్తారు. రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు - ఈ పాట కూడా బాగుంటుంది. ఇప్పుడు రాత్రి పూర్తవుతుంది. భక్తి ఎంతగా చేస్తే అంత త్వరగా భగవంతుడు లభిస్తారని మనుష్యులు భావిస్తారు. హనుమంతుడు మొదలైనవారి సాక్షాత్కారము కలిగితే భగవంతుడు లభించారని భావిస్తారు. తండ్రి అంటున్నారు, ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. ఎటువంటి భావన పెట్టుకుంటే, అటువంటి సాక్షాత్కారము జరుగుతుంది. అంతేకానీ అటువంటి వారెవ్వరూ ఉండరు. తండ్రి చెప్పారు - ఈ బ్యాడ్జి అయితే అందరూ సదా ధరించి ఉండాలి. రకరకాల బ్యాడ్జిలు తయారవుతూ ఉంటాయి. అర్థం చేయించేందుకు ఇది చాలా బాగుంటుంది. మీరు ఆత్మిక మిలటరీ కదా. మిలటరీ వారికి సదా గుర్తులు ఉంటాయి. పిల్లలైన మీ వద్ద కూడా బ్యాడ్జి ఉంటే - మేము ఇలా తయారవుతున్నాము అని నషా ఉంటుంది. మనము విద్యార్థులము. బాబా మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తున్నారు. మనుష్యులు దేవతలను పూజిస్తారు. దేవతలు దేవతలను పూజించరు. ఇక్కడ మనుష్యులు దేవతలను పూజిస్తారు ఎందుకంటే వారు శ్రేష్ఠమైనవారు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. బుద్ధిలో సదా మీ లక్ష్యము-ఉద్దేశ్యము గుర్తుంచుకోవాలి. లక్ష్మీ-నారాయణుల చిత్రము సదా మీతోపాటు ఉండాలి. మేము ఈ విధముగా తయారయ్యేందుకు చదువుకుంటున్నాము, ఇప్పుడు మేము ఈశ్వరీయ విద్యార్థులము అని ఇదే సంతోషములో ఉండండి. 2. మీ వద్ద ఉన్న పాత విలువలేనివాటిని మరియు పిడికెడు బియ్యాన్ని ఇచ్చి మహళ్ళను తీసుకోవాలి. బ్రహ్మాబాబాను ఫాలో చేసి అవినాశీ జ్ఞాన రత్నాల వ్యాపారులుగా అవ్వాలి. వరదానము:-నిశ్చయము యొక్క ఆధారముగా విజయీ రత్నాలుగా అయ్యి సర్వుల కొరకు మాస్టర్ ఆశ్రయ దాత భవ నిశ్చయబుద్ధి కలిగిన పిల్లలు విజయులుగా అయిన కారణముగా సదా సంతోషములో నాట్యము చేస్తారు. వారు తమ విజయాన్ని వర్ణన చెయ్యరు, కానీ విజయులుగా అయిన కారణముగా వారు ఇతరులకు కూడా ధైర్యాన్ని పెంచుతారు. వారు ఎవ్వరినీ కించపరిచే ప్రయత్నము చెయ్యరు. వారు తండ్రి సమానముగా మాస్టర్ ఆశ్రయ దాతలుగా అవుతారు అనగా ఇతరులను కింది నుండి పైకి లేపుతారు. వారు వ్యర్థము నుండి సదా దూరముగా ఉంటారు. వ్యర్థము నుండి పక్కకు వెళ్ళటమే విజయులుగా అవ్వటము. ఇటువంటి విజయీ పిల్లలు సర్వుల కొరకు మాస్టర్ ఆశ్రయ దాతలుగా అవుతారు. స్లోగన్:-నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసేవారే సఫలతా మూర్తులు.   అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి యోగ ప్రయోగము చేసేందుకు దృష్టి-వృత్తిలో కూడా పవిత్రతను ఇంకా ఎక్కువగా అండర్ లైన్ చెయ్యండి. ముఖ్యమైన పునాది ఏమిటంటే - మీ సంకల్పాలను శుద్ధముగా, జ్ఞాన స్వరూపముగా, శక్తి స్వరూపముగా తయారుచేసుకోండి. ఎవరు ఎంతగా భ్రమిస్తూ, అలజడి మరియు దుఃఖపు అలతో వచ్చినా కానీ, వారు సంతోషముగా ఉండటాన్ని అసంభవముగా భావించినా కానీ, మీ ఎదురుగా వస్తూనే మీ మూర్తి, మీ వృత్తి, మీ దృష్టి ఆ ఆత్మను పరివర్తన చేయాలి. ఇదే యోగ ప్రయోగము. "
https://youtube.com/watch?v=hb9I0RCeCoM&si=WjBbCNsKBMEDWI8s #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🙏నా దేశ గొప్పతనం
youtube-preview
https://youtube.com/watch?v=FaYCRZzvqCY&si=21eSqayaJjNg6eic #🕉️ గణపతి బప్పా మోరియా #🙏నా దేశ గొప్పతనం #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు
youtube-preview
#🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🙏నా దేశ గొప్పతనం #🕉️ గణపతి బప్పా మోరియా 30-10-2025 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు చాలా-చాలా సాధారణముగా ఉండాలి, ఫ్యాషనబుల్ మరియు ఖరీదైన వస్త్రాలు ధరించినా కూడా దేహాభిమానము వస్తుంది’’ ప్రశ్న:-భాగ్యములో ఉన్నత పదవి లేకపోతే పిల్లలు ఏ విషయములో సోమరులుగా ఉంటారు? జవాబు:-బాబా అంటారు - పిల్లలూ, స్వయాన్ని తీర్చిదిద్దుకునేందుకు చార్ట్ పెట్టండి. స్మృతి చార్ట్ పెట్టడము వలన చాలా లాభము ఉంటుంది. నోట్ బుక్ సదా చేతిలో ఉండాలి. చెక్ చేసుకోండి - ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాను? నా రిజిస్టర్ ఎలా ఉంది? దైవీ క్యారెక్టర్ ఉందా? కర్మలు చేస్తున్నప్పుడు బాబా స్మృతి ఉంటుందా? స్మృతి ద్వారానే తుప్పు తొలగుతుంది, ఉన్నతమైన భాగ్యము తయారవుతుంది. పాట:-భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు... ▶ ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లల వద్ద ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రము ఇంటిలో తప్పకుండా ఉండాలి. వీరిని (లక్ష్మీ-నారాయణులను) చూస్తే చాలా సంతోషము కలగాలి ఎందుకంటే ఇదే మీ చదువు యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము. మనము విద్యార్థులము మరియు మనల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారు అని మీకు తెలుసు. మనము ఈశ్వరీయ స్టూడెంట్స్ లేక విద్యార్థులము, మనము ఇది చదువుకుంటున్నాము. అందరి కొరకు ఇదొక్కటే ఉద్దేశ్యము. వీరిని చూస్తే చాలా సంతోషము కలగాలి. పాట కూడా పిల్లలు విన్నారు. వారు చాలా భోళానాథుడు. కొంతమంది శంకరుడిని భోళానాథుడని భావిస్తారు, మళ్ళీ శివుడిని మరియు శంకరుడిని కలిపేస్తారు. ఇప్పుడు మీకు తెలుసు - ఆ శివుడు ఉన్నతోన్నతమైన భగవంతుడు మరియు శంకరుడు దేవత, మరి ఇద్దరూ ఒక్కరే ఎలా అవుతారు. భక్తులను రక్షించేవారు... అని కూడా పాటలో విన్నారు, అనగా తప్పకుండా భక్తులకు ఏవో ఆపదలు ఉన్నాయి. పంచ వికారాల ఆపదలు అందరికీ ఉన్నాయి. అందరూ భక్తులే. జ్ఞాని అని ఎవ్వరినీ అనలేరు. ఏ విధముగా శివుడు మరియు శంకరుడు వేర్వేరో, అదే విధముగా జ్ఞానము మరియు భక్తి పూర్తిగా వేర్వేరు విషయాలు. ఎప్పుడైతే జ్ఞానము లభిస్తుందో, అప్పుడిక భక్తి ఉండదు. మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. అర్ధకల్పము కొరకు సద్గతి లభిస్తుంది. ఒక్క సూచనతోనే మీరు అర్ధకల్పము యొక్క వారసత్వాన్ని పొందుతారు. భక్తులకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీరు చూస్తున్నారు. జ్ఞానము ద్వారా మీరు దేవతలుగా అవుతారు, ఆ తర్వాత భక్తులకు కష్టాలు వచ్చినప్పుడు అంటే దుఃఖము కలిగినప్పుడు తండ్రి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, డ్రామానుసారముగా ఏదైతే గతించిందో, అది మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. ఆ తర్వాత భక్తి మొదలైనప్పుడు వామ మార్గము ప్రారంభమవుతుంది అనగా పతితులుగా అయ్యే మార్గము ప్రారంభమవుతుంది. అందులో కూడా నంబర్ వన్ కామము, ఈ విషయములోనే ఏమని చెప్తారంటే - కామముపై విజయాన్ని పొందినట్లయితే మీరు జగత్ జీతులుగా అవుతారు. వారెవ్వరూ విజయము పొందలేరు. రావణ రాజ్యములో వికారాలు లేకుండానైతే ఎవ్వరి శరీరమూ జన్మించదు, సత్యయుగములో రావణ రాజ్యము ఉండదు. అక్కడ కూడా ఒకవేళ రావణుడు ఉంటే ఇక మరి భగవంతుడు రామ రాజ్యాన్ని స్థాపన చేసి ఏమి చేసినట్లు? తండ్రికి ఎంత చింత ఉంటుంది. నా పిల్లలు సుఖముగా ఉండాలి అని కోరుకుంటారు. పిల్లలు సుఖముగా ఉండాలని ధనాన్ని కూడబెట్టి పిల్లలకు ఇస్తారు. కానీ ఇక్కడైతే అలా జరగదు. ఇది ఉన్నదే దుఃఖము యొక్క ప్రపంచము. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు అక్కడ జన్మ-జన్మాంతరాలు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీకు అపారమైన ధనము లభిస్తుంది, 21 జన్మలు అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు. దివాలా తీయరు. ఈ విషయాలను బుద్ధిలో ధారణ చేసి ఆంతరికముగా చాలా సంతోషముగా ఉండాలి. మీ జ్ఞానము మరియు యోగము అంతా గుప్తమైనవి. స్థూలమైన ఆయుధాలు మొదలైనవేవీ లేవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది జ్ఞాన ఖడ్గము. కానీ దీనికి గుర్తుగా వారు స్థూలమైన ఆయుధాలను దేవీల చేతులలో చూపించారు. శాస్త్రాలు మొదలైనవి ఎవరైతే చదువుతారో, వారెప్పుడూ, ఇది జ్ఞాన ఖడ్గము, ఇది జ్ఞాన కత్తి అని అనరు. ఇది అనంతమైన తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. శక్తి సైన్యము విజయము పొందారంటే వారి వద్ద తప్పకుండా ఏవో ఆయుధాలు ఉంటాయని వారు భావిస్తారు. తండ్రి వచ్చి ఈ పొరపాట్లన్నింటినీ తెలియజేస్తారు. మీ ఈ విషయాలను చాలామంది మనుష్యులు వింటారు. విద్వాంసులు మొదలైనవారు కూడా ఒక రోజు వస్తారు. వీరు అనంతమైన తండ్రి కదా. పిల్లలైన మీరు శ్రీమతముపై నడుచుకోవడములోనే కళ్యాణముంది, అప్పుడు దేహాభిమానము తొలగుతుంది, అందుకే షావుకారులు రారు. తండ్రి అంటున్నారు, దేహ అహంకారాన్ని వదలండి. మంచి వస్త్రాలు మొదలైనవాటి యొక్క నషా కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు వనవాహములో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అత్తవారింటికి వెళ్తారు. అక్కడ మీకు చాలా ఆభరణాలు వేస్తారు. ఇక్కడ ఖరీదైన వస్త్రాలు ధరించకూడదు. తండ్రి చెప్తున్నారు, పూర్తిగా సాధారణముగా ఉండాలి. నేను ఎటువంటి కర్మలు చేస్తానో, నన్ను చూసి ఇతరులు చేస్తారు. పిల్లలు కూడా సాధారణముగా ఉండాలి. లేకపోతే దేహ అభిమానము వస్తుంది. అవన్నీ చాలా నష్టపరుస్తాయి. మనము అత్తవారింటికి వెళ్తామని, అక్కడ మనకు చాలా ఆభరణాలు లభిస్తాయని మీకు తెలుసు. ఇక్కడ మీరు ఆభరణాలు మొదలైనవి ధరించకూడదు. ఈ రోజుల్లో దొంగతనాలు మొదలైనవి ఎన్ని జరుగుతున్నాయి. దారిలోనే దొంగలు దోచుకుంటారు. రోజురోజుకూ ఈ గొడవలు మొదలైనవి ఎక్కువవుతూ ఉంటాయి, అందుకే తండ్రి అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. దేహాభిమానములోకి రావడముతో తండ్రిని మర్చిపోతారు. ఈ శ్రమ ఇప్పుడే చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత భక్తి మార్గములో ఎప్పుడూ ఈ శ్రమ చేయవలసిన అవసరముండదు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. తండ్రి పురుషోత్తమ సంగమయుగములోనే వస్తారని మీకు తెలుసు. యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది. అటామిక్ బాంబులు మొదలైనవి చాలా తయారుచేస్తూ ఉంటారు. వాటిని తయారుచేయడం ఆపమని ఎంత తల కొట్టుకున్నా కానీ అలా జరగదు. అది డ్రామాలో నిశ్చితమై ఉంది. అర్థం చేయించినా కూడా అర్థం చేసుకోరు. మృత్యువు జరగవలసిందే అన్నప్పుడు అవి తయారుచేయడమనేది ఎలా ఆగుతుంది. వారు అర్థం చేసుకున్నా కానీ తయారుచేయడం మానరు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. యాదవులు మరియు కౌరవులు సమాప్తమవ్వాల్సిందే. యాదవులంటే యూరోప్ వాసులు. వారిది సైన్స్ గర్వము, దానితో వినాశనము జరుగుతుంది. ఆ తర్వాత సైలెన్స్ గర్వము యొక్క విజయము జరుగుతుంది. మీకు శాంతి యొక్క గర్వములో ఉండటము (శాంతి స్వరూపముగా ఉండటము) నేర్పించడం జరుగుతుంది. తండ్రిని స్మృతి చేయండి - డెడ్ సైలెన్స్. ఆత్మనైన నేను శరీరము నుండి అతీతముగా ఉన్నాను. శరీరాన్ని విడిచిపెట్టడానికి మనము పురుషార్థము చేసినట్లుగా, ఎప్పుడైనా, ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టడానికి పురుషార్థము చేస్తారా? ప్రపంచమంతా వెతికి రండి - ఓ ఆత్మా, ఇప్పుడు నీవు శరీరాన్ని వదలి వెళ్ళాలి అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా. పవిత్రముగా అవ్వండి. లేకపోతే తర్వాత శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. శిక్షలు ఎవరు అనుభవిస్తారు? ఆత్మ. నీవు ఫలానా పాపాలు చేసావు, శిక్షలు అనుభవించు అని ఆ సమయములో సాక్షాత్కారమవుతుంది. ఆ సమయములో జన్మ-జన్మాంతరాల శిక్ష లభిస్తున్నట్లుగా అనుభవమవుతుంది. ఇంతటి దుఃఖాన్ని అనుభవించడమంటే, ఇక సుఖము యొక్క బ్యాలెన్స్ ఏముంటుంది? తండ్రి అంటున్నారు, ఇప్పుడు ఎటువంటి పాప కర్మలు చేయకండి, మీ రిజిస్టర్ పెట్టుకోండి. ప్రతి ఒక్క పాఠశాలలో నడవడిక యొక్క రిజిస్టర్ ను పెడతారు కదా. భారత్ యొక్క క్యారెక్టర్ బాలేదు అని ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అంటారు. మేము వీరి (లక్ష్మీ-నారాయణుల) వంటి క్యారెక్టర్స్ ను తయారుచేసుకుంటున్నామని చెప్పండి. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రమైతే సదా మీతోపాటు ఉండాలి. ఇది లక్ష్యము-ఉద్దేశ్యము. మనము ఈ విధముగా తయారవుతాము. శ్రీమతము ఆధారముగా మనము ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నాము. ఇక్కడ నడవడికను తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇక్కడ మీ కచేరి కూడా జరుగుతుంది. అన్ని సెంటర్లలోనూ పిల్లలు కచేరి జరపాలి. చార్ట్ పెడితే పరివర్తన అవుతారు అని రోజూ చెప్పండి. ఎవరి భాగ్యములోనైనా లేకపోతే, ఇక వారు సోమరులుగా అయిపోతారు. చార్ట్ పెట్టడము చాలా మంచిది. మనము ఈ 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడము ద్వారానే చక్రవర్తీ రాజులుగా అవుతామని మీకు తెలుసు. ఇది ఎంత సహజము. అంతేకాక పవిత్రముగా కూడా అవ్వాలి. స్మృతియాత్ర యొక్క చార్ట్ పెట్టండి, ఇందులో మీకు చాలా లాభముంది. నోట్ బుక్ తీయలేదంటే, బాబాను స్మృతి చేయలేదని భావించండి. నోట్ బుక్ సదా చేతిలో ఉంచుకోండి. ఎంత సమయము తండ్రిని స్మృతి చేసాను అని మీ చార్ట్ చూసుకోండి. స్మృతి లేకుండా తుప్పు వదలదు. తుప్పును వదిలించేందుకు వస్తువును కిరోసిన్ లో వేస్తారు కదా. కర్మలు చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడు పురుషార్థము యొక్క ఫలము లభిస్తుంది. ఇందులో శ్రమ ఉంది కదా. తలపై కిరీటాన్ని ఊరికే అలా పెట్టరు కదా. బాబా ఇంత ఉన్నత పదవిని ఇస్తున్నారు, ఎంతోకొంత శ్రమించాలి కదా. ఇందులో కాళ్ళు, చేతులు మొదలైనవేవీ కదిలించవలసిన అవసరము లేదు. చదువైతే పూర్తిగా సహజమైనది. శివబాబా నుండి బ్రహ్మా ద్వారా మనము ఈ విధముగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాడ్జ్ ధరించి ఉండాలి. వాస్తవానికి ఇది కోట్ ఆఫ్ ఆర్మ్స్ (రాజ ముద్ర) అని చెప్పండి. అర్థం చేయించడములో చాలా రాయల్టీ ఉండాలి. చాలా మధురతతో అర్థం చేయించాలి. రాజ ముద్ర గురించి కూడా అర్థం చేయించాలి. ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి అని దేనిని అంటారు? మీకు తండ్రి గురించి తెలుసా? లౌకిక తండ్రినైతే గాడ్ అని అనరు. ఆ అనంతమైన తండ్రియే పతిత-పావనుడు, సుఖ సాగరుడు. వారి నుండే అపారమైన సుఖము లభిస్తుంది. తల్లి-తండ్రులు సుఖము ఇస్తారని అజ్ఞాన కాలములో భావిస్తారు. వారు అత్తవారింటికి పంపిస్తారు. ఇప్పుడు మీది అనంతమైన అత్తవారిల్లు, అది హద్దులోని అత్తవారిల్లు. ఆ తల్లి-తండ్రులు మహా అయితే 5-7 లక్షలు లేక కోటి రూపాయలు ఇస్తారు. మీకైతే తండ్రి, పదమా పదమపతులుగా అయ్యే పిల్లలు అని పేరు పెట్టారు. అక్కడైతే ధనము యొక్క విషయమే లేదు. అక్కడ అన్నీ లభిస్తాయి. చాలా మంచి-మంచి మహళ్ళు ఉంటాయి. జన్మ-జన్మాంతరాల కొరకు మీకు మహళ్ళు లభిస్తాయి. సుదాముని ఉదాహరణ ఉంది కదా. పిడికెడు బియ్యమని విన్నారు కనుక ఇక్కడకు కూడా అవి తీసుకుని వస్తారు. ఇప్పుడు వట్టి బియ్యమైతే తినరు. కావున దానితో పాటు కొంత మసాలా మొదలైనవి కూడా తీసుకువస్తారు. ఎంత ప్రేమతో తీసుకువస్తారు. బాబా అయితే మనకు జన్మ-జన్మాంతరాల కొరకు ఇస్తారు, అందుకే వారిని దాత అని అంటారు. భక్తి మార్గములో మీరు ఈశ్వరార్థము ఇస్తే దానికి అల్పకాలము కొరకు మరుసటి జన్మలో లభిస్తుంది. కొంతమంది పేదవారికి ఇస్తారు, కాలేజ్ నిర్మిస్తారు, దానికి వారికి మరుసటి జన్మలో చదువు దానముగా లభిస్తుంది. ధర్మశాలలు నిర్మిస్తే ఇల్లు లభిస్తుంది ఎందుకంటే ధర్మశాలలకు చాలామంది వచ్చి సుఖము పొందుతారు. ఇక్కడ ఇది జన్మ-జన్మాంతరాల విషయము. శివబాబాకు ఏదైతే ఇస్తారో, దానినంతా మన కోసమే ఉపయోగిస్తారని మీకు తెలుసు. శివబాబా అయితే తమ వద్ద ఉంచుకోరు. అంతా ఇచ్చేయండి, అప్పుడు విశ్వానికి యజమానిగా అవుతారని వీరికి కూడా చెప్పారు. వినాశన సాక్షాత్కారము కూడా చేయించారు, రాజ్యము యొక్క సాక్షాత్కారము కూడా చేయించారు. అంతే, బాబా నన్ను విశ్వానికి యజమానిగా చేస్తున్నారు అని నషా కలిగింది. గీతలో కూడా అర్జునుడికి - నన్ను స్మృతి చేసినట్లయితే నీవు ఈ విధముగా అవుతావు అని సాక్షాత్కారము చేయించినట్లుగా ఉంది. వినాశనము మరియు స్థాపన యొక్క సాక్షాత్కారము చేయించారు. వీరికి కూడా ప్రారంభములో సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కింది. డ్రామాలో ఈ పాత్ర ఉంది. భగీరథుని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. మేము ఇలా అవుతాము అని పిల్లలైన మీకు ఈ లక్ష్యము-ఉద్దేశ్యము బుద్ధిలో ఉండాలి. ఎంత పురుషార్థము చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. ఫాలో ఫాదర్ అని అంటూ ఉంటారు. ఇది ఈ సమయము యొక్క విషయమే. అనంతమైన తండ్రి చెప్తున్నారు, నేను ఏదైతే సలహా ఇస్తున్నానో, దానిని ఫాలో చేయండి. వీరు ఏం చేసారో, అది కూడా చెప్తారు. వారిని వ్యాపారి, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అని అంటారు కదా. బాబా అకస్మాత్తుగానే అంతా వదిలేశారు. మొదట ఆ రత్నాల వ్యాపారిగా ఉండేవారు, ఇప్పుడు అవినాశీ జ్ఞాన రత్నాల వ్యాపారిగా అయ్యారు. నరకాన్ని స్వర్గముగా చేయడం ఎంత గొప్ప ఇంద్రజాలము. అంతేకాక, వీరు వ్యాపారి కూడా. పిల్లలకు ఎంత మంచి వ్యాపారము ఇస్తారు. మీ వద్ద ఉన్న విలువలేనివాటిని మరియు పిడికెడు బియ్యాన్ని తీసుకుని మహళ్ళు ఇస్తారు. వారు ఎంత మంచి సంపాదనను చేయిస్తారు. వజ్రాల వ్యాపారములో కూడా ఇలాగే జరుగుతుంది. ఎవరైనా అమెరికన్ కస్టమర్ వస్తే, వారి నుండి 100 రూపాయల వస్తువుకు 500, 1000 రూపాయలు కూడా తీసుకుంటారు. వారి నుండైతే చాలా డబ్బులు తీసుకుంటారు. మీ వద్దనైతే అన్నిటికన్నా పాత వస్తువు ఉంది, అదే ప్రాచీన యోగము. మీకు ఇప్పుడు భోళానాథుడైన తండ్రి లభించారు. వారు ఎంత భోళా. మిమ్మల్ని వారు ఎలా తయారుచేస్తున్నారు. విలువలేనివాటికి రిటర్న్ లో మిమ్మల్ని 21 జన్మల కోసం ఎలా తయారుచేస్తారు. మనుష్యులకు ఏమీ తెలియదు. అప్పుడప్పుడు భోళానాథుడు ఇది ఇచ్చారని అంటారు, అప్పుడప్పుడు అంబ ఇచ్చారని అంటారు లేక గురువు ఇచ్చారని అంటారు. ఇక్కడ ఉన్నది చదువు. మీరు ఈశ్వరీయ పాఠశాలలో కూర్చున్నారు. ఈశ్వరీయ పాఠశాల అని గీతను అంటారు. గీతలో భగవానువాచ అని ఉంది. కానీ భగవంతుడు అని ఎవరిని అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ గురించి తెలుసా అని ఎవరినైనా అడగండి. తండ్రి తోట యజమాని. మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తున్నారు. దానిని గార్డెన్ ఆఫ్ అల్లాహ్ (అల్లా యొక్క పుష్పాల తోట) అని అంటారు. యూరోపియన్లు కూడా ప్యారడైజ్ అని అంటారు. భారత్ పరిస్తాన్ గా ఉండేది, ఇప్పుడు కబ్రిస్తాన్ (స్మశానవాటిక) గా ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు పరిస్తాన్ కు యజమానులుగా అవుతారు. తండ్రి వచ్చి నిద్రిస్తున్న వారిని మేలుకొలుపుతారు. ఇది కూడా మీకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఎవరైతే స్వయం మేలుకుంటారో, వారు ఇతరులను కూడా మేలుకొలుపుతారు. మేలుకొలపడం లేదు అంటే స్వయం మేలుకోలేదని అర్థము. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ పాటలు మొదలైనవి కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. కొన్ని పాటలు చాలా బాగున్నాయి. మీరు ఉదాసీనముగా ఉన్నప్పుడు ఈ పాటలు పెట్టుకున్నట్లయితే సంతోషములోకి వస్తారు. రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు - ఈ పాట కూడా బాగుంటుంది. ఇప్పుడు రాత్రి పూర్తవుతుంది. భక్తి ఎంతగా చేస్తే అంత త్వరగా భగవంతుడు లభిస్తారని మనుష్యులు భావిస్తారు. హనుమంతుడు మొదలైనవారి సాక్షాత్కారము కలిగితే భగవంతుడు లభించారని భావిస్తారు. తండ్రి అంటున్నారు, ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. ఎటువంటి భావన పెట్టుకుంటే, అటువంటి సాక్షాత్కారము జరుగుతుంది. అంతేకానీ అటువంటి వారెవ్వరూ ఉండరు. తండ్రి చెప్పారు - ఈ బ్యాడ్జి అయితే అందరూ సదా ధరించి ఉండాలి. రకరకాల బ్యాడ్జిలు తయారవుతూ ఉంటాయి. అర్థం చేయించేందుకు ఇది చాలా బాగుంటుంది. మీరు ఆత్మిక మిలటరీ కదా. మిలటరీ వారికి సదా గుర్తులు ఉంటాయి. పిల్లలైన మీ వద్ద కూడా బ్యాడ్జి ఉంటే - మేము ఇలా తయారవుతున్నాము అని నషా ఉంటుంది. మనము విద్యార్థులము. బాబా మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తున్నారు. మనుష్యులు దేవతలను పూజిస్తారు. దేవతలు దేవతలను పూజించరు. ఇక్కడ మనుష్యులు దేవతలను పూజిస్తారు ఎందుకంటే వారు శ్రేష్ఠమైనవారు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. బుద్ధిలో సదా మీ లక్ష్యము-ఉద్దేశ్యము గుర్తుంచుకోవాలి. లక్ష్మీ-నారాయణుల చిత్రము సదా మీతోపాటు ఉండాలి. మేము ఈ విధముగా తయారయ్యేందుకు చదువుకుంటున్నాము, ఇప్పుడు మేము ఈశ్వరీయ విద్యార్థులము అని ఇదే సంతోషములో ఉండండి. 2. మీ వద్ద ఉన్న పాత విలువలేనివాటిని మరియు పిడికెడు బియ్యాన్ని ఇచ్చి మహళ్ళను తీసుకోవాలి. బ్రహ్మాబాబాను ఫాలో చేసి అవినాశీ జ్ఞాన రత్నాల వ్యాపారులుగా అవ్వాలి. వరదానము:-నిశ్చయము యొక్క ఆధారముగా విజయీ రత్నాలుగా అయ్యి సర్వుల కొరకు మాస్టర్ ఆశ్రయ దాత భవ నిశ్చయబుద్ధి కలిగిన పిల్లలు విజయులుగా అయిన కారణముగా సదా సంతోషములో నాట్యము చేస్తారు. వారు తమ విజయాన్ని వర్ణన చెయ్యరు, కానీ విజయులుగా అయిన కారణముగా వారు ఇతరులకు కూడా ధైర్యాన్ని పెంచుతారు. వారు ఎవ్వరినీ కించపరిచే ప్రయత్నము చెయ్యరు. వారు తండ్రి సమానముగా మాస్టర్ ఆశ్రయ దాతలుగా అవుతారు అనగా ఇతరులను కింది నుండి పైకి లేపుతారు. వారు వ్యర్థము నుండి సదా దూరముగా ఉంటారు. వ్యర్థము నుండి పక్కకు వెళ్ళటమే విజయులుగా అవ్వటము. ఇటువంటి విజయీ పిల్లలు సర్వుల కొరకు మాస్టర్ ఆశ్రయ దాతలుగా అవుతారు. స్లోగన్:-నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసేవారే సఫలతా మూర్తులు.   అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి యోగ ప్రయోగము చేసేందుకు దృష్టి-వృత్తిలో కూడా పవిత్రతను ఇంకా ఎక్కువగా అండర్ లైన్ చెయ్యండి. ముఖ్యమైన పునాది ఏమిటంటే - మీ సంకల్పాలను శుద్ధముగా, జ్ఞాన స్వరూపముగా, శక్తి స్వరూపముగా తయారుచేసుకోండి. ఎవరు ఎంతగా భ్రమిస్తూ, అలజడి మరియు దుఃఖపు అలతో వచ్చినా కానీ, వారు సంతోషముగా ఉండటాన్ని అసంభవముగా భావించినా కానీ, మీ ఎదురుగా వస్తూనే మీ మూర్తి, మీ వృత్తి, మీ దృష్టి ఆ ఆత్మను పరివర్తన చేయాలి. ఇదే యోగ ప్రయోగము. "
7 Days Rajyoga Meditation Course | Telugu |: http://www.youtube.com/playlist?list=PLmxOj5aY081ZE7TexAG9E6luWtBBsfCYr #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🙏నా దేశ గొప్పతనం #🕉️ గణపతి బప్పా మోరియా
youtube-preview
#📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🙏నా దేశ గొప్పతనం 29-10-2025 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీరు ఒక్కొక్కరినీ దేవతలుగా తయారుచేయాలి, మీరు అందరి కళ్యాణము చేసేవారు, మీ కర్తవ్యము పేదవారిని షావుకారులుగా చేయడము’’ ప్రశ్న:-తండ్రికి గల ఏ పేరు సాధారణమైనదైనా కానీ కర్తవ్యము చాలా గొప్పది? జవాబు:-బాబాను తోట యజమాని, నావికుడు అని అంటారు. ఈ పేరు ఎంత సాధారణమైనది, కానీ మునిగిపోయేవారిని తీరానికి చేర్చడము, ఇది ఎంత గొప్ప కర్తవ్యము. ఏ విధముగా ఈత ఈదే ఈతగాడు ఇతరులకు చేతినందించి తీరానికి చేరుస్తాడో, అదే విధముగా తండ్రి చేయి లభించడముతో మీరు స్వర్గవాసులుగా అవుతారు. ఇప్పుడు మీరు కూడా మాస్టర్ నావికులు. మీరు ప్రతి ఒక్కరి నావను తీరానికి చేర్చే మార్గాన్ని తెలియజేస్తారు. ఓంశాంతి. స్మృతిలోనైతే పిల్లలు కూర్చునే ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి, దేహము కూడా ఉంది. దేహము లేకుండా కూర్చున్నారని కాదు. కానీ తండ్రి అంటున్నారు, దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అయి కూర్చోండి. దేహీ-అభిమానము శుద్ధమైనది, దేహాభిమానము అశుద్ధమైనది. దేహీ-అభిమానులుగా అవ్వడముతోనే మనము శుద్ధముగా, పవిత్రముగా అవుతున్నామని మీకు తెలుసు. దేహాభిమానులుగా అవ్వడముతో అశుద్ధముగా, అపవిత్రముగా అయిపోయాము. ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు కూడా. పావన ప్రపంచము ఉండేది. ఇప్పుడు అది పతితముగా ఉంది, మళ్ళీ పావన ప్రపంచము తప్పకుండా వస్తుంది. సృష్టి చక్రము తిరుగుతుంది. ఎవరైతే ఈ సృష్టి చక్రము గురించి తెలుసుకుంటారో, వారిని స్వదర్శన చక్రధారులని అంటారు. మీలోని ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారులు. స్వయం ఆత్మకు సృష్టి చక్రము యొక్క జ్ఞానము లభించింది. జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? తప్పకుండా వారు కూడా స్వదర్శన చక్రధారియే అయి ఉంటారు. తండ్రి తప్ప ఇతర మనుష్యులెవ్వరూ నేర్పించలేరు. తండ్రియైన పరమ ఆత్మయే పిల్లలకు నేర్పిస్తారు. వారు అంటారు - పిల్లలూ, మీరు దేహీ-అభిమానులుగా అవ్వండి. సత్యయుగములో ఈ జ్ఞానాన్ని లేక శిక్షణను ఇవ్వవలసిన అవసరము ఉండదు. అలాగని అక్కడ భక్తి కూడా ఉండదు. జ్ఞానముతో వారసత్వము లభిస్తుంది. ఈ విధముగా మీరు శ్రేష్ఠముగా అవుతారు అని తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. మీరు శ్మశానవాసులుగా ఉండేవారని, ఇప్పుడు తండ్రి శ్రేష్ఠమైన దేవతలుగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచము శ్మశానముగా అవ్వనున్నది. మృత్యులోకాన్ని శ్మశానమనే అంటారు. పరిస్తాన్ అని కొత్త ప్రపంచాన్ని అంటారు. డ్రామా రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ మొత్తం సృష్టిని అడవి అని అంటారు. బాబా అర్థం చేయించారు, మొత్తం సృష్టిపై ఈ సమయములో రావణ రాజ్యము ఉంది. దసరాను కూడా జరుపుకుంటారు, ఎంత సంతోషపడతారు. తండ్రి అంటున్నారు, పిల్లలందరినీ దుఃఖము నుండి విడిపించడానికి నేను కూడా రావణుడి పాత ప్రపంచములోకి రావలసి ఉంటుంది. ఒక కథను వినిపిస్తారు. నీకు మొదట సుఖము కావాలా లేదా దుఃఖము కావాలా అని ఎవరో అడిగారు. అప్పుడు సుఖము కావాలని అన్నారు. సుఖములోకి వెళ్ళినట్లయితే అక్కడకు ఎటువంటి యమదూతలు మొదలైనవారు రాలేరు. ఇది కూడా ఒక కథ. తండ్రి చెప్తున్నారు, సుఖధామములోకి ఎప్పుడూ కాలుడు రాడు, అది అమరపురిగా అవుతుంది. మీరు మృత్యువుపై విజయము పొందుతారు. మీరు ఎంత సర్వశక్తివంతులుగా అవుతారు. అక్కడ ఎప్పుడూ ఫలానావారు మరణించారు అని అనరు, అక్కడ మరణమనే పేరే ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. సర్పము కూడా కుబుసాన్ని మారుస్తుంది కదా. మీరు కూడా పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మములోకి అనగా కొత్త శరీరములోకి వస్తారు. అక్కడ పంచ తత్వాలు కూడా సతోప్రధానముగా అవుతాయి. అన్ని వస్తువులు సతోప్రధానముగా అయిపోతాయి. ప్రతి వస్తువు, ఫలాలు మొదలైనవి ది బెస్ట్ గా ఉంటాయి. సత్యయుగాన్ని స్వర్గము అని అంటారు. అక్కడ చాలా ధనవంతులుగా ఉండేవారు. వారు ఉన్నంత సుఖముగా, విశ్వానికి యజమానులుగా ఎవ్వరూ ఉండలేరు. మనమే అలా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు, కావున ఎంత సంతోషము ఉండాలి. ఒక్కొక్కరినీ దేవతలుగా తయారుచేయాలి, అనేకుల కళ్యాణము చేయాలి. మీరు చాలా షావుకారులుగా అవుతారు. వారంతా పేదవారు. ఎంతవరకైతే మీ చేతికి వారి చేతిని అందించరో అంతవరకు వారు స్వర్గవాసులుగా అవ్వలేరు. తండ్రి చేయి అయితే అందరికీ లభించదు. తండ్రి చేయి మీకు లభిస్తుంది. మీ చేయి ఇతరులకు లభిస్తుంది. ఆ తర్వాత వారి చేతులు మరికొంతమందికి లభిస్తాయి. ఏ విధముగా ఈత ఈదేవారు ఒక్కొక్కరిని తీరానికి చేరుస్తారో, అలా మీరు కూడా మాస్టర్ నావికులు. అనేకమంది నావికులుగా అవుతున్నారు. మీ వ్యాపారమే ఇది. మనము ప్రతి ఒక్కరి నావను తీరానికి చేర్చే మార్గాన్ని తెలియజేయాలి. నావికుడి పిల్లలు నావికులుగా అవ్వాలి. పేరు ఎంత సాధారణముగా ఉంది - తోట యజమాని, నావికుడు. ఇప్పుడు ప్రాక్టికల్ గా మీరు చూస్తున్నారు. మీరు పరిస్తాన్ ను స్థాపన చేస్తున్నారు. మీ స్మృతిచిహ్నము ఎదురుగా నిలబడి ఉంది. కింద రాజయోగ తపస్య, పైన రాజ్యము కనిపిస్తుంది. దిల్వాడా అన్న పేరు కూడా చాలా బాగుంది. తండ్రి అందరి హృదయాలను గెలుచుకుంటారు. అందరికీ సద్గతిని ఇస్తారు. హృదయాన్ని గెలుచుకునేవారు ఎవరు, ఇది ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మాకు కూడా తండ్రి శివబాబా. అందరి హృదయాలను గెలుచుకునేవారు అనంతమైన తండ్రియే అవుతారు. వారు తత్వాలు మొదలైనవాటన్నిటి కళ్యాణము చేస్తారు, ఇది కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఇతర ధర్మాల వారి శాస్త్రాలు మొదలైనవి నిలిచి ఉంటాయి. మీకు జ్ఞానమనేది సంగమయుగములోనే లభిస్తుంది, వినాశనమైన తర్వాత ఇక ఏ శాస్త్రాలు ఉండవు. శాస్త్రాలు భక్తి మార్గానికి గుర్తు. ఇది జ్ఞానము. తేడా చూసారు కదా. భక్తి అపారముగా ఉంది, దేవీలు మొదలైనవారి పూజల కోసం ఎంత ఖర్చు చేస్తారు. తండ్రి అంటున్నారు, వీటి ద్వారా అల్పకాలికమైన సుఖముంటుంది. ఎటువంటి భావన పెట్టుకుంటారో, అది నెరవేరుతుంది. దేవీలను అలంకరిస్తూ, అలంకరిస్తూ ఉండగా ఎవరికైనా సాక్షాత్కారము జరిగితే, ఇక చాలా సంతోషిస్తారు. కానీ లాభమేమీ ఉండదు. మీరా పేరు కూడా మహిమ చేయబడింది. భక్తుల మాల ఉంది కదా. స్త్రీలలో మీరాను, పురుషులలో నారదుడిని భక్త శిరోమణులుగా భావిస్తారు. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. మాలలోని పూసలైతే చాలామంది ఉన్నారు. పైన ఉన్న పుష్పము బాబా, ఆ తర్వాత జంట పూసలు. ఆ పుష్పానికి అందరూ నమస్కరిస్తారు. ఒక్కొక్క పూసకు నమస్కరిస్తారు. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు అందులో కూడా ఎక్కువ పూజ శివునికి చేస్తారు. సాలిగ్రామాలకు అంత పూజ చేయరు. మొత్తం ధ్యాస అంతా శివుని వైపే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు పావనముగా అవుతున్నారు కదా, ఇలా శివబాబా ద్వారానే సాలిగ్రామాలు ఇంత చురుకైనవారిగా అయ్యారు. పతిత-పావనుడైన తండ్రి యొక్క పిల్లలైన మీరు కూడా మాస్టర్ పతిత-పావనులు. ఒకవేళ ఎవ్వరికీ మార్గాన్ని తెలియజేయకపోతే చాలా చిన్న పదవి లభిస్తుంది. అయినా తండ్రినైతే కలుసుకున్నారు కదా, అది కూడా తక్కువేమీ కాదు. అందరికీ తండ్రి వారొక్కరే. శ్రీకృష్ణుని కోసం ఈ విధముగా అనరు. శ్రీకృష్ణుడు ఎవరికి తండ్రి అవుతారు? శ్రీకృష్ణుడిని తండ్రి అని అనరు. పిల్లలను తండ్రి అని అనలేరు. వివాహము అయిన తర్వాత, బిడ్డ జన్మించినప్పుడు తండ్రి అని అంటారు. ఆ బిడ్డే వారిని తండ్రి అని సంబోధిస్తాడు. ఇతరులెవ్వరూ ఇలా అనలేరు. ఇకపోతే వృద్ధులనెవరినైనా బాపూజీ అని అంటారు. వీరు (శివబాబా) అయితే అందరికీ తండ్రి. బ్రదర్ హుడ్ (సోదర భావము) అని పాడుతారు కూడా. ఈశ్వరుడిని సర్వవ్యాపి అన్నట్లయితే ఫాదర్ హుడ్ (పితృ భావము) అవుతుంది. పిల్లలైన మీరు పెద్ద-పెద్ద సభలలో అర్థం చేయించవలసి ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా భాషణ చేసేందుకు వెళ్ళవలసి ఉంటే, ఏ టాపిక్ పైనైతే భాషణ చేయవలసి ఉంటుందో, దానిపై విచార సాగర మంథనము చేసి వ్రాసుకోవాలి. తండ్రి అయితే విచార సాగర మంథనము చేయనవసరము లేదు. కల్పక్రితము ఏదైతే వినిపించారో, దానిని వినిపించి వెళ్ళిపోతారు. మీరైతే టాపిక్ పై అర్థం చేయించాలి. మొదట వ్రాసుకుని, ఆ తర్వాత చదువుకోవాలి. భాషణ చేసిన తర్వాత, ఫలానా పాయింట్లు చెప్పలేదే అని గుర్తుకొస్తుంది. ఇవి అర్థం చేయించి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఎన్నో కొన్ని పాయింట్లు మర్చిపోతారు, ఇలా జరుగుతుంటుంది. సోదరీ, సోదరులారా, ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని మొట్టమొదట ఇలా చెప్పవలసి ఉంటుంది. ఇదైతే ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇటువంటి సమాచారాన్ని బాబాకు ఎవ్వరూ వ్రాయరు. మొట్టమొదట అందరికీ చెప్పాలి - ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి. ఆత్మలైన మీరు అవినాశీ. ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. దేహధారులెవ్వరినీ స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి, మనము అక్కడి నివాసులము. మన బాబా కళ్యాణకారి అయిన శివుడు, ఆత్మలమైన మనము వారి పిల్లలము. తండ్రి అంటారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. నేను ఒక ఆత్మను. తండ్రి స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి. గంగా స్నానాలు మొదలైనవాటితో వికర్మలు వినాశనమవ్వవు. మీరు నన్ను స్మృతి చేయండి అని తండ్రి యొక్క డైరెక్షన్ ఉంది. వారు గీతను చదువుతారు, యదా యదాహి ధర్మస్య... అని అంటారు కానీ అర్థమేమీ తెలియదు. బాబా సేవ కొరకు సలహాలు ఇస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాను స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారు. వారు శ్రీకృష్ణుడు చెప్పారని భావిస్తారు కానీ మీరు - శివబాబా పిల్లలైన మనకు వారిని స్మృతి చేయమని చెప్తున్నారని అంటారు. ఎంతగా నన్ను స్మృతి చేస్తారో, అంతగా సతోప్రధానముగా అయి ఉన్నత పదవిని పొందుతారు. లక్ష్యము, ఉద్దేశ్యము కూడా ఎదురుగా ఉంది. పురుషార్థముతో ఉన్నత పదవిని పొందాలి. అటువైపు వారు వారి-వారి ధర్మాలలో ఉన్నత పదవిని పొందుతారు. మనము ఇతర ధర్మాలలోకి వెళ్ళము. వారు రావడమే వెనుక వస్తారు. వారి కన్నా ముందు స్వర్గముండేదని వారికి కూడా తెలుసు. భారత్ అన్నిటికన్నా ప్రాచీనమైనది. కానీ అలా ఎప్పుడుండేది, అది ఎవ్వరికీ తెలియదు. వారిని భగవాన్, భగవతి అని కూడా అంటారు, కానీ తండ్రి అంటారు, వారిని భగవాన్-భగవతి అని అనలేరు. భగవంతుడిని నేను ఒక్కడిని మాత్రమే. మనము బ్రాహ్మణులము. తండ్రినైతే బ్రాహ్మణుడు అని అనరు. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు, వారి శరీరానికి పేరు లేదు. మీ శరీరాలన్నిటికీ పేర్లు ఉంటాయి. ఆత్మ అయితే ఆత్మే. వారు కూడా పరమ ఆత్మ. ఆ ఆత్మ పేరు శివ, వారు నిరాకారుడు. వారికి సూక్ష్మ శరీరము కానీ, స్థూల శరీరము కానీ లేదు. అలాగని వారికి ఆకారము లేదని కాదు. ఎవరికైతే పేరు ఉందో, వారికి ఆకారము కూడా తప్పకుండా ఉంటుంది. నామ-రూపాలు లేని వస్తువేదీ ఉండదు. తండ్రియైన పరమాత్మను నామ-రూపాలకు అతీతమైనవారని అనడం ఎంత పెద్ద అజ్ఞానము. తండ్రి కూడా నామ-రూపాలకు అతీతమైనవారైతే, పిల్లలు కూడా నామ-రూపాలకు అతీతమైనవారైతే, ఇక సృష్టియే ఉండదు. మీరు ఇప్పుడు బాగా అర్థం చేయించవచ్చు. గురువులు చివరలో అర్థం చేసుకుంటారు. ప్రస్తుతము వారి రాజ్యము ఉంది. మీరు ఇప్పుడు డబల్ అహింసకులుగా అవుతారు. అహింసా పరమో దేవీ-దేవతా ధర్మము డబల్ అహింసాయుత ధర్మముగా గాయనం చేయబడింది. ఎవరిపైనైనా చేయి చేసుకోవడం, దుఃఖమునివ్వడం, ఇది కూడా హింస అయినట్లు. మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు అని తండ్రి ప్రతి రోజూ అర్థం చేయిస్తారు. మనసులో దుఃఖము తప్పకుండా వస్తుంది. సత్యయుగములో మనసులో కూడా రాదు. ఇక్కడైతే మనసా-వాచా-కర్మణా వస్తుంది. ఈ పదాలను మీరు అక్కడ వినను కూడా వినరు. అలాగే అక్కడ సత్సంగాలు మొదలైనవేవీ ఉండవు. సత్యమైనవారిగా తయారయ్యేందుకని సత్యమైనవారి ద్వారా సత్సంగము జరుగుతుంది. సత్యమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి కూర్చుని నరుని నుండి నారాయణునిగా తయారయ్యే కథను వినిపిస్తున్నారు, దీని ద్వారా మీరు నారాయణునిగా అవుతారు. ఆ తర్వాత భక్తి మార్గములో సత్యనారాయణుని కథను చాలా ప్రేమగా వింటారు. మీ స్మృతిచిహ్నమైన దిల్వాడా మందిరము ఎంత బాగుందో చూడండి. తప్పకుండా సంగమయుగములో వారు హృదయాన్ని గెలుచుకుని ఉంటారు. ఆదిదేవ్, ఆదిదేవి మరియు పిల్లలు కూర్చుని ఉన్నారు. ఇది యథార్థమైన స్మృతిచిహ్నము. దాని చరిత్ర-భౌగోళికాల గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అది మీ స్మృతిచిహ్నమే. ఇది కూడా అద్భుతము. లక్ష్మీ-నారాయణుల మందిరములోకి వెళ్ళినప్పుడు, మేము ఇలా తయారవుతున్నామని మీరంటారు. క్రైస్ట్ కూడా ఇక్కడే ఉన్నారు. క్రైస్ట్ బికారి రూపములో ఉన్నారని చాలామంది అంటూ ఉంటారు. తమోప్రధానముగా ఉన్నారంటే మరి బికారి అన్నట్లే కదా. పునర్జన్మలనైతే తప్పకుండా తీసుకుంటారు కదా. శ్రీకృష్ణుడు రాకుమారునిగా ఉండేవారు, ఇప్పుడు బికారిగా ఉన్నారు. తెల్లనివారు మరియు నల్లనివారు. భారత్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు కూడా తెలుసు. తండ్రి ఉన్నదే పేదల పెన్నిధి. మనుష్యులు ఈశ్వరార్థము దాన-పుణ్యాలను కూడా పేదవారికే చేస్తారు. చాలామందికి ధాన్యము లభించదు. మున్ముందు గొప్ప-గొప్ప షావుకారులకు కూడా ధాన్యము లభించకపోవడాన్ని మీరు చూస్తారు. ప్రతి ఊరులోనూ షావుకారులు ఉంటారు కదా, వారిని దొంగలు దోచుకుంటారు. పదవులలో తేడా అయితే ఉంటుంది కదా. తండ్రి అంటున్నారు, పురుషార్థము ఎలా చేయండంటే నంబరువన్ లోకి వెళ్ళాలి. టీచర్ పని సావధానపరచడము. పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి. ఇది అనంతమైన పాఠశాల. ఇది రాజ్యాన్ని స్థాపన చేసేందుకు రాజయోగము. అయినా కానీ పాత ప్రపంచము వినాశనమవ్వాలి. లేకపోతే రాజ్యము ఎక్కడ చేస్తారు. ఇది ఉన్నదే పతిత ధరణి. గంగను పతిత-పావని అని మనుష్యులు అంటారు. తండ్రి అంటారు, ఈ సమయములో పంచ తత్వాలన్నీ తమోప్రధానముగా, పతితముగా ఉన్నాయి. మొత్తం మురికి, చెత్త అంతా అందులోకి వెళ్ళి కలుస్తుంది. చేపలు మొదలైనవి కూడా అందులో ఉంటాయి. నీరు కూడా ఒక ప్రపంచము వలె ఉంటుంది. నీటిలో ఎన్ని జీవులు ఉంటాయి. పెద్ద-పెద్ద సముద్రాల నుండి కూడా ఎంత ఆహారము లభిస్తుంది. కావున అది కూడా ఒక ఊరు వంటిదే కదా. ఒక ఊరును మరి పతిత-పావని అని ఎలా అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, పతిత-పావనుడు ఒక్క తండ్రే. మీ ఆత్మ మరియు శరీరము పతితముగా అయిపోయాయి, ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా అవుతారు. మీరు విశ్వానికి యజమానులుగా, సుందరమైనవారిగా అవుతారు. అక్కడ ఇతర ఖండాలేవీ ఉండవు. భారత్ దే ఆల్రౌండ్ పాత్ర. మీరంతా ఆల్రౌండర్లు. నాటకములో పాత్రధారులు నంబరువారుగా వస్తూ-వెళ్తూ ఉంటారు. ఇది కూడా అటువంటిదే. బాబా అంటున్నారు, మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని మీరు భావించండి. మనము పతిత-పావనుడైన గాడ్ ఫాదర్లీ విద్యార్థులము, ఇందులో అంతా వచ్చేస్తుంది. వారు పతిత-పావనుడు కూడా అయినట్లు, గురువు, టీచర్ కూడా అయినట్లు, తండ్రి కూడా అయినట్లు. అది కూడా వారు నిరాకారుడు. ఇది నిరాకారీ గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్శిటీ. ఎంత మంచి పేరు. ఈశ్వరునికి ఎంత మహిమ చేస్తారు. వారు బిందువు అని విన్నప్పుడు ఆశ్చర్యము కలుగుతుంది. ఈశ్వరుని మహిమను ఇంతగా చేస్తారు, కానీ వారు ఎలా ఉన్నారు! బిందువు. వారిలో పాత్ర ఎంతగా నిండి ఉంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, దేహము ఉంటూ కూడా, గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా నన్నొక్కరినే స్మృతి చేయండి. భక్తి మార్గములో ఏదైతే నవ విధ భక్తిని చేస్తారో, దానిని సతోప్రధానమైన నవ విధ భక్తి అని అంటారు. ఆ భక్తి ఎంత తీవ్రమైన భక్తిగా ఉంటుంది. ఇప్పుడు అదే విధముగా స్మృతిలో తీవ్ర వేగము కావాలి. తీవ్రమైన స్మృతి చేసేవారి పేరే ఉన్నతముగా అవుతుంది. వారు విజయమాలలోని మణులుగా అవుతారు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు రోజూ సత్యమైన తండ్రి నుండి వినాలి. సత్యమైనవారి సాంగత్యము చేయాలి. ఎప్పుడూ మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. 2. విజయమాలలో మణిగా అయ్యేందుకు మరియు పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు స్మృతి వేగాన్ని తీవ్రతరము చేయాలి. మాస్టర్ పతిత-పావనులుగా అయి అందరినీ పావనముగా తయారుచేసే సేవ చేయాలి. వరదానము:-పరమాత్మ స్మృతి అనే ఒడిలో ఇమిడిపోయే సంగమయుగీ శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మా భవ సంగమయుగము సత్యయుగములోని స్వర్గముకంటే శ్రేష్ఠమైనది ఎందుకంటే బ్రాహ్మణుల ప్రపంచములో అప్రాప్తి అనే వస్తువేదీ లేదు అన్నది ఇప్పటి గాయనమే. ఒక్క తండ్రి లభించారంటే అన్నీ లభించినట్లే. ఇప్పుడు పిల్లలైన మీరు ఒక్కోసారి అతీంద్రియ సుఖము అనే ఊయలలో ఊగుతారు, ఒక్కోసారి సంతోషపు ఊయలలో, ఒక్కోసారి శాంతి, ఒక్కోసారి జ్ఞానము, ఒక్కోసారి ఆనందము మరియు ఒక్కోసారి పరమాత్మ ఒడి అనే ఊయలలో ఊగుతారు. పరమాత్మ ఒడి అంటే - స్మృతి యొక్క లవలీన అవస్థ. ఈ ఒడి క్షణములో అనేక జన్మల దుఃఖాన్ని, బాధను మరపింపజేస్తుంది. కావున ఈ శ్రేష్ఠ సంస్కారాలను సదా స్మృతిలో ఉంచుకుని భాగ్యవాన్ ఆత్మలుగా అవ్వండి. స్లోగన్:-ఎటువంటి సుపుత్రులుగా అవ్వండి అంటే, బాబా మీ పాటలు పాడాలి మరియు మీరు బాబా పాటలు పాడాలి.   అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి ముందుగా స్వయముపై యోగ ప్రయోగము చేసి చూడండి. నెలకొకసారి లేక 15 రోజులకొకసారి ఏదో ఒక విశేష గుణాన్ని లేక ఏదో ఒక విశేష శక్తిని స్వయము కొరకు ప్రయోగించి చూడండి ఎందుకంటే సంగఠనలో లేక సంబంధ-సంపర్కములో పరీక్షలైతే వస్తూనే ఉంటాయి, కనుక ముందుగా మీపై మీరు ప్రయోగించి చెక్ చేసుకోండి, ఏదైనా పరీక్ష వస్తే ఏ గుణాన్ని లేక ఏ శక్తిని ప్రయోగించినందు వలన ఎంత సమయములో సఫలత లభించింది? ఎప్పుడైతే స్వయము విషయములో సఫలతను పొందుతారో అప్పుడు ఇతరుల కొరకు కూడా ప్రయోగము చేసే ఉల్లాస-ఉత్సాహాలు స్వతహాగానే పెరుగుతూ ఉంటాయి. "
http://youtube.com/post/UgkxQe96B_X3vEd8VEfxoYvV2U18R9VNzVvP?si=7rteMuzbofgY6dfN #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🙏నా దేశ గొప్పతనం #🕉️ గణపతి బప్పా మోరియా
#🙏నా దేశ గొప్పతనం #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు
🙏నా దేశ గొప్పతనం - మంచి ఆలోచన సున్నితమైన మాటలతో కూడా తరచుగ్ా  గాయాలు తగులుతాయ్ి సంబంధాలన్ు ನಿಲಬಲು5ಏದಂ ವಾಲಾ ನುನ್ನಿಅನನ 5೪  V V Guptha శ్రీసాయి అప్నా బజార్ మంచి ఆలోచన సున్నితమైన మాటలతో కూడా తరచుగ్ా  గాయాలు తగులుతాయ్ి సంబంధాలన్ు ನಿಲಬಲು5ಏದಂ ವಾಲಾ ನುನ್ನಿಅನನ 5೪  V V Guptha శ్రీసాయి అప్నా బజార్ - ShareChat
https://youtube.com/watch?v=L7S3CqbkzEo&si=NyXf2aVyCLBEs0do #📙ఆధ్యాత్మిక మాటలు #🙏నా దేశ గొప్పతనం #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱
youtube-preview