👭 𝐀𝐍𝐈𝐋𝐊𝐔𝐌𝐀𝐑 🚶‍♂️🍎🚶‍♀️
ShareChat
click to see wallet page
@adcs7937
adcs7937
👭 𝐀𝐍𝐈𝐋𝐊𝐔𝐌𝐀𝐑 🚶‍♂️🍎🚶‍♀️
@adcs7937
ఐ లవ్ షేర్ చాట్
#తెలుసుకుందాం #తెలుసుకుందాం..రండి? *✅ తెలుసుకుందాం ✅* *🛑నేలలో దొరికే బొగ్గుతో విద్యుత్‌ ఎలా తయారుచేస్తారు?* 🟢బొగ్గు ఒక ఇంధన మూలకం (elemental fuel). అంటే అందులో చాలా అధిక మోతాదులో రసాయనిక శక్తి దాగుంది. ఆ రసాయనిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే ప్రక్రియ ఉష్ణ విద్యుత్‌ కేంద్రాల్లో (thermal power station) జరుగుతుంది. గనుల్లో దొరికే మలిన బొగ్గును కర్బనీకరణం అనే ప్రక్రియలో శుద్ధి చేసిన తర్వాత బాగా ఎండబెట్టి థర్మల్‌ స్టేషన్‌లలో గాలి సమక్షంలో మండిస్తారు. ఆ మంటలో వెలువడిన ఉష్ణంలో నుంచి నీటని ఆవిరి అయ్యేలా చేస్తారు. అధిక పీడనంలో ఈ వేడినీటి ఆవిరిని గొట్టాల ద్వారా పంపి గొట్టాల చివర ఉన్న టర్బైనులను తిప్పే ఏర్పాటు ఉంటుంది. ఈ టర్బైనులో ఒక విద్యుదయస్కాంత స్తూపం సెకనుకు 50 సార్లు తిరిగేలా నిర్మాణం ఉంటుంది. అయస్కాంత క్షేత్రంలో ఓ విద్యుత్తీగ కదిల్తే ఆ తీగలో ప్రేరణ విద్యుత్తు పుడుతుందనే ఫారడ్‌ నియమానుసారం అక్కడి విద్యుత్తీగల్లో ఆల్టర్నేటింగ్‌ కరెంట్‌ (ac)పుడుతుంది. టర్బైను బ్లేడులను యాంత్రిక శక్తిలో తిప్పిన తర్వాత శక్తిని కోల్పోయిన నీటి ఆవిరిని తిరిగి పునర్వినియోగం ద్వారా వాడుకుంటారు. కొంత వృథా అవుతుంది కూడా. మొత్తమ్మీద బొగ్గులో ఉన్న రసాయనిక శక్తిని మొదట టర్బైనులకు యాంత్రిక శక్తిగా మార్చి ఆ యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే ప్రక్రియ ద్వారా ఉష్ణ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ పుడుతుంది.
#mother's day May 11 "వేసా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకొన అమ్మ రుణమే తీరగా తోడుండగా నను ప్రేమించే అమ్మ ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా. అమ్మ అంటేనే ప్రేమ, అమ్మ అంటేనే త్యాగం, అమ్మ అంటేనే దయ, అమ్మ అంటేనే నిలువెత్తు మంచితనం.. అమ్మ అంటేనే మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే సైనికురాలు. మనం ఎక్కడ ఉన్నా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ అమ్మ మన గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది.. అలాంటి అమ్మకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆమె కడుపులో పుట్టినందుకు తనకు మంచి పేరు తీసుకువచ్చేలా నిజాయతీగా బతకడం తప్ప. ఏం చేసినా అమ్మ మనపై చూపిన ప్రేమకు సరితూగలేం. అందుకే అమ్మ దైవం కంటే ఎక్కువ. అమ్మ వున్నంత వరకూ మనం అమ్మతోనే వుంటాం. కానీ మనం వున్నంత వరకూ అమ్మ మనతో ఉండదు. అందుకే వున్నంత కాలం అమ్మను ప్రేమగా చూసుకుందాం. మనకు ఎప్పుడూ గుర్తుండిపోయే తియ్యని జ్ఞాపకం అమ్మ. *తమ పిల్లల భవిష్యత్ లోనే తమ ఆనందాన్ని అనుభవిస్తూ... వారి బంగారు భవిష్యత్ కోసం తమ జీవితాలను అంకితం చేస్తున్న మాతృముర్తులు అందరికీ...* 🌹 *హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు*🌹
#ప్రపంచ పుస్తక దినోత్సవం 23-April ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం పుస్తకాలు అధ్బుతమైనది - మన ఆలోచన విధానం లో మౌలిక మార్పుకు, ప్రగతికి పుస్తక పఠనం చాలా ఉపయోగపడుతుంది. మనం చేసే పని సంబంధించి తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలు కాకుండా విషయ పరిజ్ఞానం కోసం ఒక పుస్తకం చదివి ఎన్ని రోజులైంది. అభిరుచి కోసం ఒక పుస్తకం కొనుగోలు చేసిన సందర్భం ఉన్నదా..! మార్కుల కోసం పరీక్షలో ఉత్తీర్ణత కోసం ఉద్యోగ సంబంధ అవకాశాల కోసం మాత్రమే పుస్తకాలు చదవాల? మనం చదివిన పుస్తకాల్లో మర్చిపోలేని కొన్ని పేరాలు వాక్యాలు ఏమన్నా ఉన్నాయా...! పలాన పుస్తకం చదవలేకపోయాము అన్న భావన ఎప్పుడన్నా కలిగిందా మనం చదివిన పుస్తకాల్లో పూర్తిగా ప్రతి ఘట్టం గుర్తుండే పుస్తకాలు ఏమన్నా ఉంటాయా
#మే డే శుభా కాంక్షలు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే. ఈ ప్రపంచంలోని భౌతిక సంపద అంతా సృష్టించేది కార్మికుని శ్రమ. పారిశ్రామిక విప్లవం ఉత్పత్తి విధానాన్ని సమూలంగా మార్చివేసింది కర్మాగార ఉత్పత్తి విధానం. భారీ పెట్టుబడులతో పెట్టుబడిదారీవిధానం వచ్చింది. ఈ క్రమంలో అనారోగ్యకరంగా ఉన్న కర్మాగార పరిస్తితులు, అల్ప వేతనాలు, ప్రమాదాలు, అధిక పనిగంటలు విశ్రాంతి లేకపోవడం మొదలైన ఏన్నో కష్టాలు కార్మికులు ఎదుర్కొన్నారు. తమ హక్కుల కోసం మెరుగైన పరిస్థితుల కోసం కార్మికులు ఉద్యమించారు. కార్మికులు కర్షకులు తమ ఉద్యమ స్పూర్తికి గుర్తు గా ప్రతి సంవత్సరం మే నెల ఒకటిన ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకుంటారు
#నాన్న *నాన్నకు కన్నీళ్లు ఉన్నాయి* ..👨‍👧‍👦 🙏నాన్నలందరికి అంకితం🙏 నాన్న మనకోసం ఏం చేశాడో.. ఏం కోల్పోయాడో మనకు తెలియదు..! జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ.. వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి. తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో కోల్పోతాడు తండ్రి. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు..! ఎందుకంటే..నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు. అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రి పూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.. "ఎప్పుడూ పనేనా..? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా.." అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. పెళ్ళై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు. మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. వృద్ధాప్యం ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న డాక్టర్‌ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే..ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు. తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు. మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ. ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందల సార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా..? నాన్న కూడా ఏడుస్తాడు. కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు. పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా..? నేను ఎవరి కోసం బతికాను..?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. ‘నా కోసం నేను ఏదీ దాచుకోలేదే..’ అనుకుంటాడు. నిజానికి ‘నేను’ అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. *ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను ఏడిపిస్తాడు.* నాన్న గుండెల పై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి. కొడుకు ఎంత మంచివాడు.. ప్రయోజకుడైతే తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు. అతడికి ఎంత సక్సెస్‌ వస్తే.. అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు. (పాజిటివ్ గా ఆలోచించండి) ఇది నిజం. మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు. *అసలు మీ నాన్న పుట్టిన రోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే* మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు.. మీ కోసం రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు..’ *అమ్మానాన్నలు బ్రతికున్నంత వరకు బాగా చూసుకోండి* 🙏 *ప్రతీ ఒక్కరి నాన్నకు నా సెల్యూట్* 🙏
#ఐశ్వర్యం అంటే ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం.. *ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*. జీవితం కూడా అంతే... *ఏంజాయ్ చేసి నా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*. • *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు. • తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు. • పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు. • ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది. ఫైనల్ గా చెప్పదేంటంటే... *టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*. • ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*? • లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!. • *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?! • ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*. • ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*. • ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*. • అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*. • భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*. • పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*. • వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*. • పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*. • మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*. • పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*. • ప్రకృతి అందం *ఐశ్వర్యం*. • పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*. • అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*. • బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*. • బిడ్డలకొచ్చే చదువు *ఐశ్వర్యం*. • భగవంతుడిచ్చిన ఆరోగ్యం *ఐశ్వర్యం*. • చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*. • పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*. • *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు. • కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*. • మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం* 👌💐💐 🙂🙏🏻😎 🙏