
Nara Lokesh
@naralokesh_official
General Secretary, Telugu Desam Party | MLA, Mangalagiri | Minister in Andhra Pradesh Cabinet | Stanford MBA
అందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.
#Vijayadashami2025 #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి దంపతులు తమ భూమిని లీజు పేరుతో కొందరు ఆక్రమించుకున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసిన సమాచారం నా దృష్టికి వచ్చింది. తమ కుమారుడి దగ్గర 25 సెంట్లు లీజుకి తీసుకొని మొత్తం భూమి ఆక్రమించుకున్నారని అమ్మిరెడ్డి దంపతులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేసి, వాస్తవాలు తెలుసుకొని వృద్ధులకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాను. సొంత బంధువైన వైసీపీ ఎమ్మెల్సీ అప్పి రెడ్డి వృద్ధ దంపతుల పట్ల వ్యవహరించిన తీరు అమానవీయం. ఈ భూకబ్జా వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వదిలే ప్రసక్తి లేదు. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
ఈ ఏడాది ఆగస్టు 4న కాకినాడకు చెందిన జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్ళారు. నావిగేషన్ సమస్య వల్ల శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్ళి అక్కడ కోస్ట్ గార్డు చేతిలో బందీలుగా మారారు. కాకినాడకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. భారత విదేశాంగ శాఖ, శ్రీలంక ఎంబసీతో మాట్లాడి జాలర్లను జాఫ్నా జైలు నుంచి విడుదల చేయించాం. 52 రోజుల తర్వాత మత్స్యకారులు క్షేమంగా ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉంది. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
అందరం కలిసి ప్రభుత్వ బడిని కాపాడుకుందాం.
#andhrapradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Heartening to see this little 2nd grade child from our rural school confidently doing English word-building. Her curiosity and confidence in learning say it all. Thanks to stronger foundational learning, English activities, and teacher support in rural classrooms, such progress is becoming the norm across AP schools. Wishing her many milestones ahead. May she keep dreaming big and achieving more.
#andhrapradesh
#publicschool #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Deeply moved by the heart-rending story of little Yashwant (7) and Lakshmi (6) from Kadapa who lost both parents to illness and are now cared for by their aged grandfather. No child should be left helpless in such a tragedy.
I urge the Kadapa District Collector to immediately extend relief and ensure all eligible support through govt schemes reaches these children. Their future must be secured with compassion and urgency. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
ప్రజా ప్రభుత్వం పవర్ ఏంటో మరోసారి రుజువైంది! ఎన్నికల ముందు ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన లో పిపిఏ రద్దు దగ్గర నుండి ట్రూ అప్ ఛార్జీల వరకూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజల్ని పీడించారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వలన సుమారుగా ప్రజల పై వెయ్యి కోట్ల భారం తగ్గనుంది.
#PowerPayBackInAP
#idhimanchiprabhutvam
#andhrapradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Heartiest congratulations to Sheetal Devi on proving that nothing is stronger than an unbreakable spirit. Her journey, from being told archery was impossible to becoming India’s first woman Para World Archery Champion at 18, is a triumph of courage, grit, and belief. May her story remind every young dreamer that no goal is too distant and no barrier too great when one refuses to give up. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
వేల మంది ఆశలు, కలలు మెగా డీఎస్సీ ద్వారా నెరవేర్చాం.. ఇదీ మా నిబద్ధత. డీఎస్సీ విజేతల కళ్ళలో ఆనందమే మా కూటమి ప్రభుత్వానికి ఆశీర్వాదం.
#apwelcomesnewteachers
#idhimanchiprabhutvam #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
నిరక్షరాస్యులకు తక్కువ సమయంలో సులభంగా తెలుగును నేర్పించేందుకు ‘ఎన్ఆర్’ అనే కొత్త పద్ధతి రూపొందించిన నెల్లూరు నరసింహారావు గారి కృషి అభినందనీయం. బోధన, అభ్యసనకు ప్రత్యేకంగా తెలుకు వాచకాన్ని తీసుకువచ్చి నిరక్షరాస్యులకు కేవలం 30 గంటల్లోనే చదవడం, రాయడం నేర్పించవచ్చని నిరూపించారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరులో అమలుచేసిన ‘ఎన్ఆర్’ విధానం విజయవంతం అయినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించేందుకు ఇదో ముందడుగు కానుంది.
#schools
#telugu
#language
#andhrapradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్