Failed to fetch language order
అమృత పురుషుడు ధన్వంతరి
1 Post • 115 views
PSV APPARAO
781 views 3 months ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ధన్వంతరి జయంతి #ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు #🙏శ్రీ ధన్వంతరి జయంతి🕉️ #అమృత పురుషుడు ధన్వంతరి *ఈరోజు ధన్వంతరి జయంతి* *అమృత పురుషుడు ధన్వంతరి* ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి ధన్వంతరి జయంతి. దేవతల ప్రార్ధన మేరకు శ్రీహరి వారికి అమృతము అందించాలని సంకల్పంతో క్షీరసాగర మథనం జరిపించగా క్షీరసాగరము నుంచి అమృతభాండం తీసుకుని ధన్వంతరి ఆవిర్భవించాడు. ధన్వంతరిని 'అమృత పురుషుడు' అని అంటారు. 'ధను' అంటే చికిత్సకు అందని వ్యాధి. 'అంత' అనగా నాశము. ‘రి' అనగా కలిగించువాడు. చికిత్సకు లొంగని వ్యాధులను నశింపచేయువాడు అని ధన్వంతరి శబ్దానికి అర్థం. సకల లోకాలలో చికిత్సకు అందని వ్యాధి మరణమే అయినందున దానిని తొలగించి అమృతాన్ని ఇచ్చి అంతర్థానం అయినట్లు భాగవతాది పురాణాలలో చెప్పబడింది. అలా వచ్చిన స్వామి వృక్షశాస్త్రాన్ని, ఔషధ శాస్త్రాన్ని చికిత్సా విధానాన్ని వివరించే 18 మహాగ్రంథాలను అందించారు. వాటిని ఆధారంగా చేసుకుని చ్యవన, అత్రి, బృహస్పతి, కవి, చంద్ర, వరుణ, మను, ఇక్ష్వాకు మొదలగువారు వైద్యశాస్త్ర గ్రంథాలను అందించారు. ఇలా ధన్వంతరి వైద్యశాస్త్రాన్ని ఆరోగ్య సూత్రాలను అందించారు. *ఆశాచ పరమా వ్యాధి: తతో ద్వేషః తతో మనుః ।* *తేషాం వినాశనే వైద్యం నారాయణ పరాస్మృతిః ॥* ధన్వంతరి అనే గ్రంథానుసారం అన్ని వ్యాధుల కంటే పెద్ద వ్యాధి 'ఆశ', తర్వాతది 'ద్వేషం' తద నంతరం 'కోపం'. ఈ మూడు వ్యాధులకు చికిత్స నారాయణ మంత్రం. ఇటువంటి ఆధ్యాత్మిక వ్యాధి నివారణ, ఆది భౌతిక వ్యాధి నివారణ, ఆది దైవిక వ్యాధి నివారణలకు వైద్య శాస్త్రాన్ని ప్రవర్తింపచేసిన వాడు ధన్వంతరి. #namashivaya777
21 likes
12 shares