P.Venkateswara Rao
617 views • 5 months ago
#హరి హర వీర మల్లు 💥💥
*'హరిహర వీరమల్లు' క్లోజింగ్ కలెక్షన్స్! 'ఆచార్య'కి ఎక్కువ, 'గేమ్ ఛేంజర్'కి తక్కువ... OTT డేట్ కూడా ఫిక్స్..❗*
01.08.2025💃
దాదాపు ఐదేళ్లు వాయిదా పడుతూ రావడం వల్ల 'హరిహర వీరమల్లు' మూవీ పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చింది. జూన్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వాయిదా పడిన ఈ మూవీ, ఎట్టకేలకు జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
తాను నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో పవన్ కళ్యాణ్, 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఈ కారణంగా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది 'హరిహర వీరమల్లు' మూవీ. అయితే జూన్ 23న పడిన ప్రీమియర్స్ నుంచి నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ కారణంగా వసూళ్లు పడిపోతూ వచ్చాయి..
థియేటర్ల నుంచి ఈ వారం రోజుల్లో రూ.67 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది 'హరిహర వీరమల్లు'. రూ.109 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'హరిహర వీరమల్లు' మూవీ, 2025 ఏడాదిలో టాలీవుడ్‌కి రెండో అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సంక్రాంతికి విడుదలైన మరో మెగా హీరో రామ్ చరణ్ మూవీ 'గేమ్ ఛేంజర్', రూ.120 కోట్లకు పైగా నష్టాలను మిగల్చగా.. 'హరిహర వీరమల్లు' మూవీకి రూ.61 కోట్ల నష్టం వచ్చింది..
ఓవరాల్‌గా మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' మూవీ, థియేట్రికల్ రన్‌లో రూ.56 కోట్లు వసూలు చేయగా, 'హరిహర వీరమల్లు' ఆ షేర్‌ని అధిగమించింది. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షేర్‌ని వసూలు చేయలేకపోయింది పవన్ కళ్యాణ్ మూవీ.. నైజాం, ఓవర్‌సీస్‌తో పాటు సీడెడ్‌లో 'హరిహర వీరమల్లు' భారీ నష్టాలను మిగల్చగా ఆంధ్రాలో పరిస్థితి కాస్త బెటర్‌గా ఉంది..
క్రిష్ దర్శకత్వంలో మొదలైన 'హరిహర వీరమల్లు' మూవీని, నిర్మాత ఏ.ఎం. రత్నం కొడుకు జ్యోతి కృష్ణ పూర్తి చేశాడు. ఫస్టాఫ్‌కి మంచి రివ్యూలు, రేటింగ్స్ రాగా సెకండాఫ్‌లో కథ పక్కదారి పట్టినట్టుగా అభిప్రాయాలు వినిపించాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.35 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన 'హరిహర వీరమల్లు' మూవీ, రెండోరోజు కనీసం రూ.6 కోట్లు వసూలు చేయలేకపోయింది. ఒక్క రోజులో 77 శాతం వసూళ్లు పడిపోయాయి. శని, ఆదివారాల్లో కాస్త కలెక్షన్లు పెరిగినా వీకెండ్ ముగిసిన తర్వాత 'హరిహర వీరమల్లు' మూవీ వసూళ్లు పూర్తిగా పడిపోయాయి..
'హరిహర వీరమల్లు' మూవీని పాన్ ఇండియా లెవెల్‌లో ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. అయితే ఏ భాషలోనూ బ్రేక్ ఈవెన్‌కి 50 శాతం టార్గెట్ కూడా చేరుకోలేకపోయింది 'హరిహర వీరమల్లు'. హిందీ వర్షన్‌లో 'హరిహర వీరమల్లు' మూవీ, వారం రోజుల్లో రూ.29 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది. కన్నడలో రూ.5 లక్షలు, తమిళ్‌లో రూ.18 లక్షలు, మలయాళంలో రూ.15 లక్షలు వసూలు చేసింది 'హరిహర వీరమల్లు'...
'హరిహర వీరమల్లు' మూవీ, ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన 'హరిహర వీరమల్లు' మూవీలో బాబీ డియోల్, సునీల్, రఘు బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీని, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం నాడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేయబోతున్నట్టు సమాచారం..
8 likes
11 shares