భగవద్గీత# గీతా సారాంశం #జై శ్రీ కృష్ణ
66 Posts • 24K views
గీతా జయంతి శుభాకాంక్షలు🌿🎉🙏💐🌹 ________________________________________ డిసెంబర్ 01 గీతా జయంతి సందర్భంగా... మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతి ఆచరిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసింది ఈ ఏకాదశి రోజునే కాబట్టి ఇది గీతాజయంతిగా ప్రసిద్ధి చెందింది. గీత జయంతి నాడు భగవద్గీతను పూజించి గీతాపారాయణము చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. కాగా ఈ గీత జయంతిని కార్తీక బహుళ అమావాస్య రోజున జరపాలని పాఠాంతరం కూడా ఉంది. భగవద్గీత మత గ్రంథం కాదు. ఇది మనిషికి స్వసరూప జ్ఞానాన్ని అందిస్తుంది. భగవంతుని స్వరూపాన్ని విశ్లేషించి చెబుతుంది. వివిధ స్థాయిలో ఉన్న వ్యక్తులకి వివిధ రీతిల్లో సాధనల్ని చెబుతుంది. అనేకమైన ఆధునిక విమర్శలకి కూడా సమాధానాలు దీనిలోనే లభిస్తాయి. గీత ప్రధానంగా మనకు కర్మయోగాన్ని ప్రవచించింది. ప్రకృతి, స్వీయ స్వభావం, ఈశ్వరుడు అనే ముగ్గురు యజమానులకు వశుడై మానవుడు పరాధీనుడవుతున్నడు. ఆ ముగ్గురి నియంతృతవ్యం నుంచి బయటపడడానికి అంతఃకారణంలో సన్యాసాన్ని, బాహ్యంగా కర్మయోగాన్ని అవలంబించాలని గీత మనకు చెప్పింది. అంతరంగా సంఘటనల నుంచి వెలుగు మార్గం చూపింది. __________________________________________ HARI BABU.G __________________________________________ #🌻🌻🌹#గీతా సారాంశం#🌹🌻🌻# #భగవద్గీత# గీతా సారాంశం #జై శ్రీ కృష్ణ #భగవద్గీత #గీతా జయంతి #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
18 likes
26 shares