Failed to fetch language order
Failed to fetch language order
be healthy and happy
5 Posts • 575 views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
744 views 2 months ago
♥♥♥ ఎక్కువ కాలంపాటు ఆరోగ్యంగా జీవించాలంటే పాటించాల్సిన 10 సులభమైన ఆయుర్వేద చిట్కాలు..! ♥♥♥ నిత్యం ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది కార్య‌క్ర‌మాలు బెడ్ కాఫీతోనో, బెడ్ టీతోనో మొద‌ల‌వుతుంటాయి. కొంద‌రు నిద్ర లేవ‌గానే కాల‌కృత్యాలు తీర్చుకుని ఇత‌ర ప‌నులు ముగించుకుని ఆఫీసుల‌కు హ‌డావిడిగా బ‌య‌ల్దేరుతుంటారు. ఇక రోజంతా ఒత్తిళ్లు, ఆందోళ‌న‌ల న‌డుమ గ‌డిపి సాయంత్రం ఇంటికి వ‌చ్చి కాసింత తిని అర్థ‌రాత్రి వ‌ర‌కు మెళ‌కువ‌తో ఉండి టైం పాస్ చేస్తారు. త‌రువాత ఎప్పుడో నిద్రిస్తారు. నిజానికి చాలా మంది దిన చ‌ర్య దాదాపుగా ఇలాగే ఉంటుంది. అయితే ఆయుర్వేద ప్ర‌కారం కింద తెలిపిన విధంగా దిన‌చ‌ర్య‌ను మార్చుకుంటే దాంతో ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించ‌వ‌చ్చు. మ‌రి నిత్యం పాటించాల్సిన దిన‌చ‌ర్య ఏమిటంటే.. 1. ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ, కాఫీలకు బదులుగా ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిని తాగాలి. 2. శరీర బరువు ఎలా ఉందో చెక్‌ చేసుకోవాలి. 3. బరువుకు తగిన విధంగా ఆ రోజు తినాల్సిన ఆహారాలను ఎంచుకోవాలి. 4. రోజూ ఒకే సమయానికి భోజనం చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒకే సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. 5. తీసుకునే భోజనంలో ద్రవ, ఘనాహారాలు ఉండాలి. జీర్ణాశయంలో పావు వంతు ఖాళీ ఉంచాలి. జీర్ణం సరిగ్గా అవుతుంది. 6. భోజనానికి, భోజనానికి మధ్య కనీసం 4 నుంచి 5 గంటల వ్యవధి ఉండాలి. రోజులో ఒక్కసారి అయినా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలసి భోజనం చేయాలి. 7. భోజనం చేసేటప్పుడు నీరు అస్సలు తాగరాదు. తప్పదనుకుంటే చాలా స్వల్పంగా నీటిని తాగాలి. భోజనానికి ముందు, భోజనం చేసేటప్పుడు, చేశాక ఎట్టి పరిస్థితిలోనూ చల్లని నీరు, పానీయాలను తాగరాదు. 8. వారంలో ఒక్కసారి నూనెతో శరీరాన్ని మసాజ్ చేయాలి. 9. శరీరం ఉన్న స్థితిని బట్టి నిత్యం వ్యాయామం చేయాలి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు వారంలో కనీసం 3 రోజులు వ్యాయామం చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి. 10. రోజూ, వారం వారం చేయాల్సిన కార్యక్రమాలను తప్పనిసరిగా పూర్తి చేయండి. ఆరోగ్యం, వ్యాయామం, భోజనం విషయాల్లో పెట్టుకునే నియమాలను పాటించండి. #తెలుసుకుందాం #be healthy😊 #be happy be healthy #be healthy and happy
14 likes
12 shares