అక్రమ మద్యం రవాణా
9 Posts • 8K views
రాష్ట్రవ్యాప్తంగా ఏరులై పారుతున్న కల్తీ మద్యం - చోద్యం చూస్తున్న ఎక్స్సైజ్ శాఖ వారు! లేదా ప్రజలకు ప్రాణసంకటంగా మారిన కల్తీ మద్యం! ఈ మద్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా కల్తీ మద్యం ఏరులై పారుతూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న విషయం మనందరికీ విధితమే.కేవలం స్పిరిట్,రసాయనాలతో తయారుచేసి, పాపులర్ బ్రాండ్ లను తలపించేలా బాటిళ్లపై నకిలీ లేబుల్స్ అతికించి మరీ యదేచ్చగా సరఫరా చేస్తూ కల్తీ మద్యం తయారీదారులు ఈ మందు ప్రియులను బురీడి కొట్టిస్తూ తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లేటట్లు చేసుకుంటున్నారు అనే మాట అక్షర సత్యం.అయితే ఇది కల్తీ మద్యం అని తెలియని అమాయక ప్రజలు వీటిని సేవించి తమ ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కల్తీ మద్యం సేవనం మూలాన వీటిని తీసుకున్న ప్రజలకు అవయవ వైకల్యం ప్రాప్తించడం, వారికి వినికిడి సమస్యలు తలేత్తడం,దృష్టి లోపం ఏర్పడటం,వారి మూత్రపిండాలు దారుణంగా దెబ్బతిని,చివరకు వారి కాలేయాలు సైతం వైపల్యానికి గురిఅయ్యి,వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడే దయనీయ పరిస్థితులు సైతం వారికి సంప్రాప్తించడం ఎంతైనా ఈ సమాజానికి సంబంధించి అత్యంత ఆందోళన రేకేత్తించే విషయం.అయితే ఇంత జరుగుతున్న ఎందుకనో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్సైజ్ శాఖ అధికారులు ఈ కల్తీమద్యం తయారీకి అడ్డుకట్ట వేయడంలో మాత్రం ఘోర వైపల్యం చెందుతూనే వున్నారు.అయితే ప్రతిపక్ష పార్టీ నాయకుడు,మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు,జననేత వైఎస్ జగనన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అయా జిల్లాలకు సంబందించిన నియోజకవర్గ పరిధిలోని ప్రదాన నగరాలలోని ఎక్స్సైజ్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున వైస్సార్సీపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు, శ్రేణులు తరలివచ్చి కల్తీ మద్యం నియంత్రణకు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్స్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తమ నిరసనను అత్యంత బలంగా తెలియజేశారు కూడా.అంతేకాదు ఈ కల్తీ మద్యం కేసు యొక్క నిగ్గు తెల్చేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు తక్షణమే ఈ కేసును సి.బి.ఐ వారికి అప్పగించాలని కూడా వైస్సార్సీపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు చాలా గట్టిగా డిమాండ్ చేశారు,వారంతా తమ వాణిని చాలా బలంగా వినిపించారు కూడా. ఏదిఏమైనా ఈ కల్తీ మధ్యంలో మీథాయిల్,సీసం, ఇతర విష రసాయనాలు కలవడం మూలాన వీటిని సేవించిన మద్యం ప్రియులు తీవ్ర ఆనారోగ్యాల బారినపడి ఇటు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, అటు వారి కుటుంబాలను సైతం వారు ఈ మద్యం వ్యసనం మూలాన అదోగతిపాలు చేయడంతో పాటు వారిని రోడ్డు మీద పడేలా చేస్తున్నారు అనేమాట అక్షర సత్యం.ఇక మన రాష్ట్ర ప్రభుత్వం వారైతే ' ఆదాయమే ఏకైక పరమావదిగా భావిస్తూ ప్రజలు ఏమైపోతే మాకేంటి ' అనే నిర్లక్ష్యధోరణితొ వ్యవహరించడం మూలాన మందు ప్రియుల జీవితాలు రోజు రోజుకు నరకప్రాయంగా మారిపోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.ఏమైనా మన ప్రజలు ఇప్పటికయినా విచక్షణ జ్ఞానంతో వ్యవహరించి ' ఈ కల్తీ మద్యం వద్దు,తమకు తమ ప్రాణాలే ముద్దు' అనే నీతి నానుడికి పెద్దపీట వేసి,అంతిమంగా తమ కుటుంబాల బాగోగులు,శ్రేయస్సే తమకు ప్రధానమని తక్షణమే భావించి వారి ఆరోగ్యాలను సర్వనాశనం చేసే,గుల్ల గావించే ఈ మద్యం అనే పాడు,చెడు అలవాటుకు వీలయినంత త్వరగా గుడ్ బై చెప్పగలిగితే వారంతా ఎలాంటి ఇబ్బందుల పాలు కాకుండా వారు,వారిని నమ్ముకున్న వారి కుటుంబాలు సైతం అత్యంత సుఖ,సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించగలుగుతారు అనడంలో ఎలాంటి సందేహం ఇసుమంతైనను లేదు.కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి మందు ప్రియులు మీకు మీ ఆరోగ్యం, మీ కుటుంబ బాగుదల ముఖ్యమా లేక మీతో పాటు మీ వినాశకాన్ని అన్ని విధాలా కోరుకునే ఈ మద్యం అనే దురలవాటు ముఖ్యమా? ఇక నిర్ణయం తీసుకోవడం మీ వంతు,అంటే మీరు మద్యం అనే చెడు అలవాటుకు రాం రాం చెప్పి,మంగళం పాడి మంచి మార్గంలో వెళ్లడమా లేక మద్యానికి బానిస అయ్యి మీ అమూల్యమైన జీవితాలను చెడు మార్గంలో పయనింపచేసుకోవడమా?అన్నింటికి మించి తుది నిర్ణయం మాత్రం ముమ్మాటికీ మీదే. - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! - #అక్రమ మద్యం రవాణా
8 likes
8 shares