దాట్ల వెంకట సుబ్బరాజు
5K views • 25 days ago
🌸 తిరుప్పావై – ధనుర్మాసం - Day 11 🌸 📜 పాశురం కట్రుక్కఱవై క్కణంగళ్ పలకఱందు, శెట్రార్ తిఱలళియ చ్చెనృ శెరుచ్చెయ్యుం, కుట్రమొన్ఱిల్లాద కోవలర్ తం పొఱ్కొడియే, పుట్రరవల్‍గుల్ పునమయిలే పోదరాయ్, శుట్రత్తు తోళిమారెల్లారుం వందు, నిన్ ముట్రం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్ పాడ, శిట్రాదే పేశాదే శెల్వ ప్పెండాట్టి, నీ ఎట్రుక్కుఱంగుం పొరుళేలోరెంబావాయ్ 🌼 భావము ఓ గోపాలకుల శిరోమణీ! పాలు పొంగిపొర్లే పశుసంపద కలిగిన గొప్ప గొల్లకులంలో జన్మించిన బంగారు తీగవంటి బాలికా! పుట్టలోని పాము పడగలాగ నిటారుగా వున్న నితంబము కలదానా! వనమయూరంలా సౌందర్యవంతురాలా! లేవమ్మా. నీ సఖులు, బంధువులు అందరూ నీ ఇంటి ముంగిట నిలబడి నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుని నానావిధ నామములతో కీర్తిస్తున్నారు. అయినా నీవు మాత్రం చలించకుండా, పలకకుండా ఈంత లోతైన నిద్రలో ఎందుకు ఉన్నావు? 🌿 జీవన సందేశం ఈ పాశురంలో ఆండాళ్ మనకు గుర్తుచేస్తున్నది ఇదే — భక్తి అనేది ఒంటరిగా నిద్రలో మునిగిపోవడం కాదు. సమూహంగా కీర్తించడం, ఒకరినొకరు లేపుకోవడం, భగవన్నామాన్ని కలిసి పలకడం — అదే నిజమైన భక్తి. మన హృదయం ఎంత సౌందర్యవంతమైనదైనా, భగవన్నామ ధ్వనికి స్పందించకపోతే అది మౌనమే. ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకుందాం — “నేను ఇంకా నిద్రలో ఉన్నానా? లేక నామస్మరణలో మేల్కొన్నానా?” 🌺 గోదాదేవి పిలుపు ఇప్పటికీ మన తలుపు తడుతోండి. #తిరుప్పావై
71 likes
1 comment • 72 shares