guru purnima
12 Posts • 43K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
807 views 6 months ago
భారత దేశములో ఆషాడ పూర్ణిమనుండి నాలుగు మాసాలు చాతుర్మాసం పాటిస్తారు . పూర్వకాలములో శిష్యులు , గురువులు కూడా ఈ నాలుగుమాసములు వర్షాకాలము అయినందున , వ్యాధులు ప్రబలే కాలము అయినందున ... ఎలాంటి పర్యటనలు , దేశ సంచారము చేయకుండా ఒకేచోటే తాత్కాలికము గా నివాసము ఏర్పరచుకునేవారు . అప్పుడు శిష్యులు గురువు దగ్గర విజ్ఞాన సముపార్జన చేసేవారు . ఈ జ్ఞానసముపార్జన లో మొదటిరోజు ని గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు . ఈ సంప్రదాయమే కాలక్రమేణా" గురుపూర్ణిమ " గా మారినది అని చరిత్ర చెబుతోంది . ఆదిగురువు వేదవ్యాసులవారు . వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు . గురువులను , ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరిస్తారు ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే. " *గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః* "అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు. "ఇక్కడ గురువు అంటే అజ్ఞానమనే గాఢాంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగులను ప్రసాదించేవాడని అర్థం. ఈ ప్రపంచానికి మొదటి గురువు ప్రకృతి. ప్రకృతినుండే మానవుడు చాలా నేర్చుకున్నాడు. వ్యాస మహర్షి ని మొదట గురువు అంటారు. వ్యాస మహర్షి వ్రాసిన భాగవతం ఉత్తమ పాఠం. మనకి బుద్ధి నేర్పిన ప్రతి వారు మన గురువులే. గౌతమబుద్ద, ఆదిశంకరుడు,పరమాచర్య,కబీర్ ,నానక్ ,సాయిబాబా లాంటివారిని కూడా ఉత్తమగురువులుగా భావిస్తారు. నేటి కాలం లో మనకు విద్య నేర్పిన వారు, వారితో పాటు మంచి బుద్ధి నేర్పుతున్న చాగంటి వారు, గరికపాటి వారు, సామవేదం వారు ఇలా చాలా మంది మన గురు తుల్యులు అందరికి 🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 గురుపౌర్ణమి శుభాకాంక్షలు!! #గురు పౌర్ణమి శుభాకాంక్షలు 1 #Happy Guru Purnima 🙏🏻 #guru purnima 🙏 #guru purnima #తెలుసుకుందాం
11 likes
9 shares