#హ్యాపీ ఫ్రెండ్షిప్ డే #హ్యాపీ ఫ్రెండ్షిప్ డే
#happy friendship day 2025 #happy friendship day 2025
#📸స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలు👩❤️👩
#📸స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలు👩❤️👩
#jai sri krishna #jai sri krishna #🕉🕉🕉🕉గోవింద జై జై గోపాల జై జై🙏🙏🙏🙏🙏
#స్నేహం_కోసం......!!
స్నేహం అనగానే మనకు గుర్తుకు వచ్చేది.....
#శ్రీకృష్ణడు,#కుచేలుడు యెుక్క స్నేహం. ఈ రోజు స్నేహితుల రోజు కాబట్టి ...మళ్ళీ మనం ఒకసారి వారిని గుర్తుకు తెచ్చుకొందాం.
భాల్యమిత్రుడైన కుచేలుడు తెచ్చిన అటుకులను చూసి మురిసిపోయాడు కృష్ణుడు. గబగబా ఓ రెండు గుప్పెళ్ళుతినివేసి మిగిలినవి తన భార్యలకు ఇచ్చాడుఆ రోజంతా తమ చిన్ననాటి ఆట పాటలను గుర్తుచేసుకుంటూ గడిపారు.
మర్నాడు ఉదయం కుచేలుడు తన గ్రామం బయలు దేరాడు . ద్వారం దాకా వచ్చి సాగనంపాడు, శ్రీకృష్ణుడు.
కొంతదూరము వెళ్ళాక కుచేలుడీ ..లోకంలోకి వచ్చాడు. అసలు తను కృష్ణుడిదగ్గరకు ఏ పనిమీద వచ్చాడో అప్పుడు జ్ఞాపకంవచ్చింది . అయ్యయ్యో ! ఏదైనా సాయంఅడుగుదామనుకుని మర్చేపోయాను .. ప్చ్ ...పోనీలే ఎవరి కెంత ప్రాప్తమో అంతే ప్రాప్తం !
కృష్ణుడిని కలుసుకోవడం ఒకరోజంతా ఆయనతో
గడపడం అదే పదివేల జన్మల పుణ్యఫలం..... !అనుకుంటూ తన గ్రామం చేరాడు .
ఆ ఊళ్ళో అతని యిల్లు కనబడలేదు .
అతని యిల్లు ఉండవల్సిన చోట చక్కటి భవనము , పూలతోట ,నౌకర్లూ కనబడ్డారు .దారి తప్పానా ?
అనుకుంటూండగా యిద్దరు సేవకులు వచ్చి అతనిని యింటిలోనికి ఆహ్వానించారు . పట్టుబట్టలూ పసిడి నగలూ ధరించిన ముత్తయిదువ బంగారు చెంబుతో నీళ్ళు తెచ్చి ఆయన పాదాలు కడిగింది . పైటతో తడి అద్దింది .ఆశ్చరంలో మునిగిన కుచేలుడు ఆమెను గుర్తుపట్టాడు .
ఆమె అతని భార్యే సుశీల." ఇదంతా ఏమిటి " ఆశ్చర్యంగా ఉంది " అని అడిగాడు కుచేలుడు . మీ మిత్రుడైన శ్రీకృష్ణులవారి అనుగ్రహం స్వామి "
అందామే !కుచేలుడి హృదయం పులకరించి పోయింది, పిడికెడు అటుకులకు ఉక్కిరి బిక్కిరయ్యేంత ఐశ్వర్యము నిచ్చావా తండ్రీ !
సాయం అడగలేదని బాధపడ్డానేగాని అడగకుండనే సహకరించే అమృతమూర్తివని గుర్తించలేకపోయాను "
అంటూ మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాడు
కుచేలుడు.
ఎన్నో దాన ధర్మాలు చేసి పరమాత్ముని మనసులో ధ్యానిస్తూ జీవితం గడిపి చివరకు శ్రీమన్నారాయణుని సన్నిధికి చేరాడు కుచేలుడు .
అందుకే భగవంతుని మనం ఏమీ కోరనవసరం లేదు.
ఏ సమయానికి ఏమి ఇవ్వాలోఆయనకు తెలుసు.
మన అవసరాలు తెలుసుకొని మనకు అండదండలు అందిచేవాడే మన నిజమైన #స్నేహితుడు....!!
🙏 స్నేహితుల రోజు శుభాకాంక్షలు🙏