#సంకష్టహర గణపతి వ్రతం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం
వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం
🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #సంకటహర చతుర్థి వ్రత విధానం, ఓం విఘ్నేశ్వరాయ నమః 🙏🙏🙏
*సంకష్ట హర చతుర్థీ వ్రతము*
*వైశాఖమాస కథ*
_డైలీ విష్ వీక్షకులకు ప్రత్యేకంగా విశేష పూజా విధానం మరియు కథలతో ప్రత్యేకంగా..._
పార్వతీదేవి మహాగణపతితో " అయ్యా గణపతి ! వైశాఖమాసమున సంకష్టహరచతుర్థీ వ్రతమును ఆచరించు విధానాదులను వివరింపుము” అని కోరగా, గణపతి ఇట్టు చెప్పదొడంగెను.
అమ్మా ! సర్వమంగళ ! వైశాఖమాసమున నన్ను ” వికటుడు” అను పేరున పూజించవలెను. ఆ మాసమున నన్ను భక్తితో పూజించి, స్మరించువారికి సర్వకార్యములు సిద్దించును. ఇందులకు అద్భుతమైన ఒక కథను దెల్పుదును వినుము.
పూర్వము కృతయుగమున మకరధ్వజుడను రాజు గలడు. అతని రాజ్యమున ప్రజలు సుఖజీవనులై యుండిరి. అతడు మమాదాత, ధర్మాత్ముడు, అయినను అతనికి సంతానము లేదు. యజ్ఞావల్క్య మహర్షి అనుగ్రహమున కొంతకాలమునకు అతనికి ఒక కుమారుడుకల్గెను. రాజు రాజ్యభారమంతయు మంత్రికి అప్పగించి, తన కుమారునికి రాజ్యపాలనా విధానములు నేర్పుటలో నిమగ్నుడైయుండెను. ఆ మంత్రికి గుణవతి, శీలవతి, ధార్మికచిత్తయగు ఒక కోడలు గలదు. ఈమె ప్రతి చైత్రమాస కృష్ణ చతుర్థీనాడు గణపతిని భక్తిృద్దిలతో పూజించుచుండెను. ఇదిచూచి, ఈమె అత్తగారు కోడలిని " నీవు ఎందులకై ఈ వ్రతమును చేయుచున్నా” వని మాటిమాటికి ప్రశ్నింపసాగెను. అత్త ఎంతగా మందలించినను కోడలు ఈ వ్రతమును అట్లే సక్రముగ చేయుచుండెను. ఇందులకు కోపించిన అత్త “ నీవు ఈ వ్రతమును మానకున్నచో నిన్ను ఇంటినుండి తరిమివేయుదును” అని ఖండితముగా పల్కెను. అంతట కోడులు “ అత్తగారు! ఉత్తమ ఫలాపేక్షలతో సకలకష్ట నివారణార్థమై ఈ సంకష్టహరచతుర్థీ వ్రతమును చేయుచున్నాను.” అని బదులు చెప్పెను.
ఈ మాటలతో మరింత కోపించినదై అత్త కుమారుని పిల్చి, కుమారా! ఎంతచెప్పినను నీ భార్య ఈ గణపతి వ్రతమును మానకున్నది. కష్ట నివారకుడగు ఆ గణపతి ఎక్కడున్నాడు ? అనుచు అతని మనస్సును కలుషితమొనర్చెను. తల్లి మాటలే నిజమని నమ్మి, అతడు భార్యను అనేక విధముల హింసింపసాగెను. తల్లి మాటలే నిజమని నమ్మి, అతడు భార్యను అనేక విధముల హింసింపసాగెను. అంతట ఆ కోడలు స్వామీ ! గణేశా ! నాపై దయలేదా ? ఇంత జరుగుచున్ననను, ఏల ఊరుకున్నావు ? నా ప్రార్థన మన్నించి, మా అత్తగారికి నీయందు భక్తిగల్గునట్లు చేయుము అని విన్నవించెను. గణపతి ఆమె ప్రార్థనను ఆలకించి రాజు చూచుచుండగానే రాకుమారుని మాయంచేసి, మంత్రియింట దాచియుంచెను. కుమారుని గానక రాజు మంత్రిని పిలిచి, కుమారుని ఆచూకీ తెలుసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. భటులు వెదకి వెదకి వేసారి వచ్చి బాలుని జాడ తెలియదని విన్నవించిరి. కుమారుని దుస్తులు ఆభరణములు అన్నియున్నవి. కాని కుమారుడు మాత్రము కన్పించనందున రాజు కోపించి మంత్రిని సంశయించి మంత్రీ! నిజము చెప్పుము. మా కుమారుని ఏమిచేసితివి? ఎచ్చటదాచితివి? చెప్పవేని, నిన్ను నీ వంశమును సమూలముగా నాశనము గావింతును అని మందలించెను. మంత్రికి ఇదంతయు ఆగమ్యగోచరముకాగా ఇంటికి వచ్చి జరిగినదంతయు వివరించెను.
మామాగారి మాటలు విన్నకోడలు మామా ! ఏల భయపడెదవు ? సంకష్టహర చతుర్థీవ్రతము ఆచరించినచో రాకుమారుడు తప్పక లభించును. నామాట నమ్ముడు అని విన్నవించెను. అంతట మంత్రి రాజుకు చెప్ప, ఒప్పించి అతనిచే ఈ గణపతి వ్రతమును చేయించెను. గణపతి సంతోషించి, రాకుమారుని దెచ్చి యిచ్చెను. ఎల్లరును ఆనందించిరి. రాజు మంత్రితో మంత్రి ! నీ కోడలిహిత బోధవలన, దయవలన నా కొడుకు నాకు లభించినాడు. ఇట్టి నీ కోడలు మిక్కిలి ధన్యురాలు, ఉత్తమురాలు ! ఈమె వలన మీరు ధన్యులు అని ప్రశంసించి కృతజ్ఞతలు తెల్పెను. ఈ సన్నివేశమున చూచి, రాజు పల్కిన పల్కులను విని, అత్త ఆశ్యర్యపడి, బుద్ధి తెచ్చుకొని, నాటి నుండి కోడలిని ఆప్యాయముగ చూడసాగెను. మరియు కోడలు గావించు శ్రీసంకష్టహర చతుర్థీవ్రతము తానును సహకరించు చుండెను. గణపతి దేవుని కృపవలన ఎట్టి మనస్పర్థలు లేక మంత్రి కుటుంబము సుఖశాంతులతో వర్థిల్లెను.
శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో రాజా ! నీవును ఈ వ్రతమును గావించి ధన్యుడవు కమ్ము అని ఆదేశించెను. అని
ఇట్లు శ్రీ కృష్ణయుధిష్ఠిర సంవాదాత్మకమగు శ్రీ సంకష్టహర చతుర్థీ వ్రతమున వైశాఖ మాసవ్రత కథ సమాప్తము.
మంగళం శ్రీ గణేశాయ, సంకష్టహర మూర్తయే
మంగళానాం నివాసాయ భక్తాభీష్టప్రదాయినే..
శ్రీ విఘ్నేశ్వర ఫలప్రసాద సిద్ది రస్తు
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*