నాగుల(గరుడ) పంచవిు శుభాకాంక్షలు
13 Posts • 3K views
PSV APPARAO
465 views 6 months ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత శ్రావణ పంచమి / నాగ పంచమి / గరుడ పంచమి / నాగుల పంచమి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #నాగ పంచమి #నాగుల(గరుడ) పంచవిు శుభాకాంక్షలు శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును "నాగ పంచమి" లేదా "గరుడ పంచమి" అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. ''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. పరమేశ్వరుడు ఒకరోజు పార్వతీ దేవి తో "ఓ పార్వతీ దేవి!!శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలి" అని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి.నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి. ఓం నమో భగవతే గరుడ దేవాయఓం నమో భగవతే నాగరాజాయ #గరుడ పంచమి
7 likes
9 shares
m ravi Kumar achari
1K views 6 months ago
20 likes
26 shares