ఎల్లో మీడియా.. 🤠
153 Posts • 26K views
P.Venkateswara Rao
583 views 29 days ago
#ఎల్లో మీడియా.. 🤠 *వావ్… తెలుగు టీవీ చానెళ్లలో ఇప్పుడు ఏబీఎన్ ఫస్ట్ ప్లేస్ అట…❗* October 28, 2025🔥 మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడికి ఓ ముసలివాడిగా కనిపించిన కృష్ణుడు తత్వబోధ చేస్తుంటాడు… ‘‘చిన మాయను పెద మాయ, పెద మాయను పెను మాయ, అటు మాయ ఇటు మాయ’’ అంటూ… ఈ వారం బార్క్ రేటింగులు, మరీ ప్రత్యేకించి వార్తా చానెళ్ల రేటింగులు, అందులోనూ హైదరాబాద్ సిటీ రేటింగులు చూస్తుంటే పైన తత్వమే చెవుల్లో వినిపిస్తోంది లీలగా… అలా ఉన్నాయి ఆ రేటింగుల తీరు… ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తి, సాంబలను వాళ్లంటే పడని రాజకీయ శక్తులు, క్యాంపులు పదే పదే యెల్లో చానెళ్లు, విపరీత పోకడల చానెళ్లు అని ఆడిపోసుకుంటూ ఉంటయ్… అదసలు జర్నలిజమేనా అంటుంటాయి గానీ… వాళ్లు ఆ చానెళ్లను ఎంత పైకి లేపుతున్నారో తెలుసా…? హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు ఏబీఎన్… థర్డ్ ప్లేస్ టీవీ5… నిజమండీ బాబూ… ఈ టేబుల్ చూడండి, తాజా రేటింగులే ఇవి… రెండు తెలుగు రాష్ట్రాల సగటు రేటింగుల్లో నాలుగో ప్లేసులో ఉన్న ఏబీఎన్ హైదరాబాదులో ఫస్ట్ ప్లేసు ఏమిటి…? మాయ…! కేసీయార్ వాయిస్ టీ న్యూస్ మరీ అన్ని చానెళ్లలోకెల్లా దిగువన 14వ ప్లేసులో ఉండిపోయి, చివరకు ఎవరూ దేకని ఈటీవీ తెలంగాణకన్నా కునారిల్లడం ఏమిటి..? మాయ..! ఓవరాల్ రేటింగుల్లో కనిపించే ప్రైమ్ 9, మహా న్యూస్, ఐన్యూస్ హైదరాబాద్ టాప్-10 లో అసలు కనిపించకపోవడం ఏమిటి..? మాయ..! అంతా మాయ..! అసలు ఈ రేటింగు కొలిచే మీటర్లు, ఆ ఇళ్ల వీక్షణాల కొనుగోళ్లు దేశవ్యాప్తంగా ఓ పెద్ద దందా… వినోద చానెళ్లూ అదే తంతు… పెద్ద పెద్ద చానెళ్లను దాటేసి స్టార్ మా చానెల్ దేశంలోనే టాప్ ప్లేసులో ఉంటుంది… మాయ..! అదే చానెల్ తీరా హైదరాబాదుకు వచ్చేసరికి జీతెలుగుకన్నా దిగువన రెండో ప్లేసులో ఉంటుంది… మాయ..! ఈ దిక్కుమాలిన సిస్టం బదులు మరో శాస్త్రీయ విధానం తీసుకొస్తామని ప్రసార మంత్రిత్వ శాఖ చెబుతూనే ఉంటుంది, కానీ తీసుకురాదు… మాయ..! వేల కోట్ల టీవీ యాడ్స్ అందరినీ ప్రభావితం చేస్తాయి మరి..! అదే మాయ అంటే..! రేటింగ్ మేనేజ్‌మెంట్ అనేది ఓ వ్యాపార కళ, నిర్వహణ కళ… అందులో రాణించేవాడికే టీవీ ఇండస్ట్రీలో పెద్దపీట… మరి దాన్నెందుకు నమ్మడం అంటే..? పత్రికలకు సంబంధించి ఏబీసీలాగే టీవీల రేటింగులకు ఇదే ప్రామాణికంగా తీసుకోబడుతున్న అశాస్త్రీయ, అధికారిక విధానం కాబట్టి… కేంద్ర సర్కారుకు ఈ విషయంలో పెద్ద సోయి లేదు, ఆసక్తీ లేదు కాబట్టి… స్టార్ గ్రూపు మేనేజ్‌మెంట్ మెరిట్ ఎదుట పెద్ద పెద్ద ఇతర జాతీయ గ్రూపులూ వెలవెలబోతున్నాయి కాబట్టి… ఏమో, చెప్పలేం, టీవీ5 నాయుడు మరింత కాన్సంట్రేట్ చేస్తే… వచ్చేవారమో, ఆ మరుసటి వారమో టీవీ5 ఫస్ట్ ప్లేసులోకి రావచ్చునేమో..!!
8 likes
3 shares
P.Venkateswara Rao
600 views 1 months ago
#ఏపీ అప్ డేట్స్..📖 #వైజాగ్ లో గూగుల్ #నూతన మద్యం పాలసీ⁉️ #ఎల్లో మీడియా.. 🤠 #పొలిటికల్ పంచ్..👊 *వైజాగ్ కు గూగుల్ వైసీపీ ఘనతే.. ఆధారాలు చూపిన జగన్❗* OCTOBER 23, 2025🎯 నకిలీ మద్యం తయారీ, విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం, వలంటీర్లకు చేసిన మోసం……… ఇలా అనేక అంశాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమి సర్కార్ను ఏకిపారేశారు. ఇవాళ మీడియా సమావేశంలో సుదీర్ఘంగా అనేక అంశాలపై వివరంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతమైందని జగన్ ఆరోపించారు. ఇలాంటి మాఫియా ప్రపంచంలో మరెక్కడా లేదని జగన్ చెప్పుకొచ్చారు. ఏకంగా ఏపీలో నకిలీ మద్యం తయారీ పరిశ్రమల్నే నెలకొల్పారని జగన్ తప్పు పట్టారు. ఇంత వరకూ ఎన్ని దుకాణాల్లో తనిఖీలు చేపట్టారో చెప్పే ధైర్యం సీఎం చంద్రబాబుకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రమంతా మద్యం దుకాణాలు, బెల్షాపులన్నీ టీడీపీ నాయకులవే కావడం వల్ల ఎలాంటి తనిఖీలు చేపట్టలేదని జగన్ ఆరోపించారు. వాటాల్లో తేడా రావడం వల్లే నకిలీ మద్యం తయారీ దందా బయటపడిందని జగన్ విమర్శించారు. నకిలీ మద్యం తయారీ కేసులో తంబళ్లపల్లె నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన జయచంద్రారెడ్డి కీలక నిందితుడన్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్నట్టు జయచంద్రారెడ్డి పేర్కొన్నారని జగన్ గుర్తు చేశారు. అప్పుడు ఆఫ్రికా లింకులు చంద్రబాబుకి, ఆయన టిష్యూ పేపర్లకు కనిపించలేదా? అని జగన్ నిలదీశారు. ఇంత వరకూ జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. తంబళ్లపల్లెలో నకిలీ మద్యం తయారీ పరిశ్రమ బయట పడగానే, తమ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితం అంటూ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. నకిలీ మద్యం తయారీ చేసింది, చేయిస్తోంది చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి మరొకరిపై తప్పును నెడుతున్నారని ఆయన మండిపడ్డారు. అసలు సెల్ఫోన్ పోయిందని చెప్పిన నకిలీ మద్యం ప్రధాన నిందితుడు జనార్దన్రావు ………వీడియోలో ఎలా మాట్లాడారు? ఆయన ఫోన్ చాటింగ్ ఎలా బయటికొచ్చింది? వీడియోల్ని ఎలా బయటికి పంపగలిగారు? అని కీలక ప్రశ్నల్ని జగన్ సంధించారు. జనార్దన్ లొంగిపోయే విషయాన్ని ప్రభుత్వ అనుకూల మీడియా ముందే చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్కు అలవాటే అని జగన్ తూర్పారపట్టారు. అక్రమ మద్యం కేసులో అనవసరంగా తమ పార్టీ నాయకుల్ని వేధిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేశ్కు నకిలీ లిక్కర్తో సంబంధం లేకపోవడం వల్లే సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారని జగన్ గుర్తు చేశారు. కానీ చంద్రబాబుకు సిట్ ముద్దు, సీబీఐ వద్దు అని దెప్పి పొడిచారు. విజయవాడ సీపీ రాజశేఖర్ సిట్ అధికారిగా సీఎం చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు. తమ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపించిందని జగన్ గుర్తు చేశారు. లాభాపేక్ష తమ ప్రభుత్వానికి లేదన్నారు. అందుకే బెల్టాపులను రద్దు చేశామని జగన్ అన్నారు. లిక్కర్ స్కామ్ పేరిట తప్పుడు కేసులో లేని ఎవిడెన్స్ను సృష్టించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో రూ.11 కోట్లు దొరికితే, దాన్ని లిక్కర్ కేసులో నిందితులకు అంటగట్టే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు ఏ మాత్రం సిగ్గు, లజ్జ లేవని ఘాటు విమర్శ చేశారు. తనను చూసి గూగుల్ వైజాగ్కి వచ్చినట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని జగన్ విమర్శించారు. వైజాగ్ కు గూగుల్ రావడం వెనుక తన ప్రభుత్వ కృషిని ఆయన వివరించారు. 2020లో కరోనా టైమ్లోనే అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందన్నారు. 2023, మే 3న, ఆ తర్వాత వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్టు జగన్ తెలిపారు. ఆనాడే సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకొచ్చి అంకురార్పణ జరిగిందన్నారు. దానికి కొనసాగింపుగానే నేడు గూగుల్ డేలా సెంటర్ వచ్చిందని జగన్ ఆధారాలతో సహా వివరించారు. అభివృద్ధి చేసిన వారికి క్రెడిట్ ఇవ్వకపోవడం చంద్రబాబు నైజం అని ఆయన విమర్శించారు. వైసీపీ హయాంలో వైజాగ్లో అదానీ సంస్థ నేతృత్వంలో డేటా సెంటర్ ఏర్పాటుకు పునాది పడిందన్నారు. తక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా నాడు అదానీతో తమ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని జగన్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఐటీ పార్క్ రిక్రియేషన్, స్కిల్ సెంటర్ పెట్టి 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. తమ హయాంలో ఇవన్నీ చేయడం వల్లే నేడు వైజాగ్కు గూగుల్ వస్తోందని జగన్ గర్వంగా చెప్పారు. ముమ్మాటికీ ఇది వైఎస్సార్సీపీ వేసిన విత్తనమే అని జగన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే వేరే వాళ్లకు క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం వుండదని, అందుకే వాస్తవాల్ని దాస్తున్నారన్నారు. అదానీ, గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అదానీ ప్రాజెక్ట్ విస్తరణే గూగుల్ డేటా సెంటర్ అని జగన్ తేల్చి చెప్పారు. ఈ భారీ ప్రాజెక్ట్ అదానీ రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారని జగన్ చెప్పారు. చంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదని విమర్శించారు. జగన్ సర్కార్కు ఆ ఘనత దక్కడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. ఉద్యోగులను చంద్రబాబు మోసగించారని జగన్ విమర్శించారు. నాలుగు డీఏలు ఇవ్వాల్సి వుండగా, ఒకటే ప్రకటించి, ఆ సొమ్ము ఇవ్వడంలో కూడా డ్రామాలాడారని జగన్ తప్పు పట్టారు. రిటైర్మెంట్ తర్వాత డీఏ ఇస్తామని చెప్పడంతో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు రోడ్డెక్కడంతో మళ్లీ వెనక్కి తగ్గారని ఆరోపించారు. కానీ తమ హయాంలో కోవిడ్ కష్టాలున్నా వెనక్కి తగ్గలేదని జగన్ అన్నారు. ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చామన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే తాము ఐఆర్ ఇచ్చామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఐఆర్ గురించి ఒక్క మాట మాట్లాడ్డం లేదన్నారు. జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి అసలు మాట్లాడ్డం లేదని జగన్ విమర్శించారు. ఎన్నికలయ్యాక మెరుగైన పీఆర్సీ ఇస్తామన్న హామీ ఏమైందని జగన్ ప్రశ్నించారు. ఉద్యోగులకు జీపీఎస్, ఓపీఎస్ లేదన్నారు. ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగుల పరిస్థితి త్రిశంకుస్వర్గాన్ని తలపిస్తోందన్నారు. కేవలం ఒకటో తేదీ జీతాన్ని... ఒకే ఒక్క నెల మాత్రమే ఇచ్చారని జగన్ విమర్శించారు. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని జగన్ తప్పు పట్టారు. చంద్రబాబు హయాంలో వైద్య రంగం, ఆరోగ్యశ్రీ నీరుగారిపోయిందన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు.. చంద్రబాబు పుణ్యాన ధర్నాలు చేస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం దూదికి కూడా దిక్కులేదన్నారు. తమ హయాంలో మెడికల్ కాలేజీలు తెస్తే...10 కాలేజీలను నిదానంగా అయినా పూర్తి చేయాల్సింది పోయి, ప్రైవేట్పరం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఉద్యమాలు చేస్తోందన్నారు. ఏపీలో ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరకడం లేదన్నారు. సబ్సిడీ విత్తనాలు లేవన్నారు. ఉల్లిరైతుల్ని గాలికి వదిలేశారన్నారు. ఇలా అన్ని రకాల రైతుల దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టు జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాలనను చంద్రబాబు గాలికి వదిలేశారని జగన్ విమర్శించారు. వాలంటీర్లను దారుణంగా మోసగించారన్నారు. పదివేల గౌరవ వేతనం ఇస్తామని నమ్మించి, చివరికి అసలుకే ఎసరు పెట్టారని జగన్ తప్పు పట్టారు. పొలిటికల్ గవర్నెన్స్ వల్లే రాష్ట్రం అతలాకుతలం అవుతోందని జగన్ తీవ్ర విమర్శ చేశారు.
7 likes
5 shares