🙏 ఓం గం #గణపతయే నమః 🙏
సర్వ విఘ్న హారం దేవం సర్వ విఘ్న వివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం 🙏
బిక్కవోలు గణపతి ఆలయం 🙏
భక్తులు తమ కోరికలను నేరుగా భగవంతునికి చెప్పుకునే వీలున్న క్షేత్రం #బిక్కవోలు గణపతి ఆలయం 🙏
చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన #బిక్కవోలు లో అనేక దేవాలయాలు దేవాలయాలు ఉన్నాయి వాటిలో గోలింగేశ్వర స్వామి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ప్రాచీనమైనవి ఇంకా శ్రీ లక్ష్మీ గణపతి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చెబుతారు 🙏
ఈ స్వామి ఏకశిలా మూర్తి తొండం కుడి వైపు తిరిగి ఉంటుంది ఇలా ఉన్న గణపతి శ్రీఘ్రంగా కోర్కెలను నెరవేరుస్తాడని చెబుతారు అంతేకాకుండా #బిక్కవోలు గణపతి పెద్ద పెద్ద చెవులతోఆకర్షణీయంగా కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు సుమారు ఏడు అడుగుల ఎత్తు కలిగి ఉంటాడు 🙏
మహారాజ ఠీవి ఉట్టిపడేలా #బిక్కవోలు గణపతి కొద్దిగా వెనక్కి వంగి ఆశీనుడై నట్లు ఉంటాడు ఈ గణపతి ఏటేటా పెరుగుతూ ఉంటాడు అని చెబుతారు గతంలో స్వామివారికి చేయించిన వెండి తొడుగు ప్రస్తుతం చాలకుండా పోతుండటం స్వామివారు పెరుగుతున్నారని అందుకు నిదర్శనంగా చెబుతారు ఈ ఆలయంలో లోపలికి భక్తులను అనుమతిస్తారు భక్తులు తమ కోరికలను స్వయంగా స్వామికి విన్నవించుకోవచ్చు🙏
ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలనుస్వామికి విన్నవించుకోవడం కి ఒక కథ చెబుతారు ఒక షావుకారు కలలోకి వచ్చిన వినాయకుడు స్వయంగా "కోరికలైనా కష్టాలైనా నా చెవిలో చెప్పు తప్పక తీరుస్తాను" అని చెప్పారట ఆ ప్రకారమే ఆయన మరుసటి రోజు స్వామికి తన కోరికలు చెప్పాడని అతని సంకల్పం నెరవేరింది అని చెబుతారు అప్పటి నుంచి ఈ సంప్రదాయం భక్తులు కొనసాగిస్తున్నారు స్వయంభువుగా వెలసిన ఈ గణపతిని అనువైన ప్రదేశానికి తీసుకొచ్చి తూర్పు చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు🙏
చవితి ముందు రోజు ఏటా స్వామి వారి నిజరూప దర్శనం కల్పిస్తారు 🙏
#బిక్కవోలు #గణపతి అనుగ్రహం మన అందరిమీద ఉండాలని కోరుకుంటూ ఓం గం #గణపతయే నమః 🙏🙏
#తెలుసుకుందాం #🕉️ గణపతి బప్పా మోరియా #🙏🌺 ఓం గం గణపతియే నమః ✍️🌺🙏🌹 #ఓం శ్రీ మహాగణాధిపతయే నమః #ఓం శ్రీ గణేశాయ నమః