గణేశారాధన/గణపతి ఆరాధన 🙏
7 Posts • 1K views
PSV APPARAO
584 views 22 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *సంకటహరవ్రతం* *సెప్టెంబర్ 10 బుధవారం సంకష్ట హర చతుర్థీ సందర్భంగా...* సంకటము' అంటే ఇబ్బంది, బాధ, కష్టము, ఆపద మొదలైన అర్థాలను చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ తొలగించేదే "సంకటహరవ్రతం". గణపతిని ఆలంబనగా చేసుకుని ఆచరించే ఈ వ్రతానికి 'సంకష్టహర చతుర్థి' అనికూడా పేరు. దీన్నే వ్యవహారములో సంకట చవితి (సంకటహరచవితి) అని కూడా అంటారు. గణపతి విఘ్నాలను కలిగించే దేవుడని, ప్రతీ పనిలోనూ ముందుగా ఆయనను పూజిస్తే మాత్రం విఘ్నాలను కలిగించడనే భావన కొందరిలో ఉంది. కానీ ఆ భావన సరికాదు. వాస్తవానికి చెడుపనులకు విఘ్నాలను కలిగించి, మంచిపనులు నిరాటంకంగా సాగింపజేసే దైవమే గణపతి. కాగా ఈ సంకటహరవ్రతాన్ని ఆచరించడం వలన ఇబ్బందులు తొలగి అనుకున్న పనులు నెరవేరుతాయి. సంకటహరవ్రతాన్ని ప్రతీ నెలలో కూడా ఆచరించవచ్చు. నెలలో బహుళములో వచ్చే చవితి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. అంటే పౌర్ణమి తరువాత 3-4 రోజులలో ఈ సంకటహర చవితి వస్తుందన్నమాట. ఇక ప్రదోషకాలములో అంటే సూర్యాస్తమయ సమయములో ఏ రోజున చవితి ఉంటుందో. ఆ రోజుననే సంకటహర చవితిని ఆచరించాలి. సాధారణంగా రెండు రోజులలో సూర్యాస్తమయ సమయానికి చవితి ఉండటం జరుగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగినప్పుడు రెండవరోజునే సంకటహరచవితిని జరుపుకోవాలి. ఇటీవలకాలములో పంచాంగాలలోనూ, పలుక్యాలెండర్లలోనూ. ఈ వ్రత తేదీలు తెలియజేయబడుతున్నాయి. అవకాశాన్ని బట్టి 3,5,9,11,21 నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. సంకటహర వ్రతాన్ని నెలలో బహుళచవితిరోజున ప్రారంభించాలి. వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని, ఆ తరువాత తలంటుస్నానాన్ని చేయాలి. తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజకు సిద్ధం చేసుకోవాలి. ఇంటిలోని దేవునిగదిలోనో లేదా అనుకూలమైన చోట పీటవేసి, దానిపై ముగ్గును వేయాలి. పీటపై గణపతి విగ్రహాన్ని కాని, చిత్రపటాన్ని కాని నెలకొల్పుకోవాలి. తరువాత ఒక చిన్నపళ్ళెములో బియ్యాన్ని పోయాలి. అనంతరం పసుపుముద్దతో మహాగణపతిని చేసుకొని ఒక తమలపాకుపై ఆ పసుపు ముద్దగణపతిని ఉంచాలి. తరువాత ఆ తమలపాకు కొన తూర్పు వైపునకు లేదా ఉత్తరం వైపుగా ఉండేటట్లుగా పళ్ళెంలో బియ్యముపై ఉంచి నిర్విఘ్నంగా వ్రతం పూర్తయ్యేందుకు, మహాగణపతిపూజను చేయాలి. ఆ తరువాత ఎరుపు లేదా తెల్లని వస్త్రాన్ని (జాకెట్పసును) తీసుకొని దానికి నాలుగు వైపుల పసుపును పూయాలి. అనంతరం వస్త్రాన్ని స్వామిముందు వరచి, అనుకున్న కోరికను నెరవేర్చమని ప్రార్థించాలి. అటు తరువాత స్వామిని తలచుకుంటూ మూడు దోసిళ్ళ బియ్యాన్ని వస్త్రంపై వేయాలి. అదేవిధంగా రెండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ ఉంచిన తాంబూలాన్ని బియ్యంలో ఉంచాలి. తిరిగి మరొక్కసారి మనసులో కోరికను నెరవేర్చమని స్వామిని వేడుకుంటూ, దాన్ని మూటగా కట్టాలి. అనంతరం యధావిధిగా గణపతిని పూజించాలి. పూజలో గణపతికి ఇష్టమైన గరికను సమర్పించడం మంచిది. తరువాత అవకాశం మేరకు ఏదైనా దగ్గరలో ఉండే గణపతి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించి, 3,5,11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఆలయానికి నెళ్లడానికి అవకాశం లేనప్పుడు ఇంట్లోనే గణపతి స్తోత్రాలను పఠించవచ్చు. సూర్యాస్తమయం తరువాత తిరిగి స్నానం చేసి గణపతి ముందు దీపారాధనను చేసి, లఘువుగా స్వామిని పూజించాలి. అనుకున్న సమయం పూర్తయ్యేంతవరకు పూజలో ఉంచిన గణపతిని కదల్చకూడదు. వ్రతం చేసిన రోజున సూర్యాస్తమయం అయ్యేంతవరకు (సాయంకాలపూజ. పూర్తయ్యేంత వరకు) ఉప్పు కలిపిన పదార్థాల్ని, ఉడికిన పదార్థాలను తినకూడదు. పాలు, పండ్లు లాంటివి తీసుకోవచ్చు. సాయంకాలం పూజ పూర్తయిన తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్రదర్శనం చేసి, చంద్రునికి కూడా ధూప, దీప నివేదనను అర్పించి మామూలు భోజనాన్ని చేయవచ్చు. ఈ విధంగా అనుకున్నన్ని నెలలు (3,5,11 లేదా 21 చవితులు) వ్రతాన్ని ఆచరించాలి. నియమం పూర్తయిన తరువాత ముడుపు కట్టిన బియ్యాన్ని తీపిగా పొంగలి చేసి గణపతికి నివేదించి, వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ వ్రతం వలస అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయని ప్రతీతి. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
13 likes
12 shares
PSV APPARAO
1K views 1 months ago
#విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #వినాయక వైభవం 🕉️🔱🕉️ వినాయకుని విశిష్టత 🙏 #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #వినాయక చవితి ఉత్సవాలు #🕉️గణేష్ ఉత్సవాలు ప్రారంభం🙏 ఉమ్మడి విశాఖ జిల్లాలో పెడుతున్న పెద్ద విగ్రహాలు.. మన చోడవరం - ఆదిగణపతి విగ్రహం పూర్తి మట్టి విగ్రహం గా మనం తెలియచెయ్యవచ్చును. 🙏🙏🙏
17 likes
15 shares
PSV APPARAO
710 views 1 months ago
#🎶గణేశ భజన–మంత్రాలు–ఆరతి🪔 #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #వినాయక వైభవం 🕉️🔱🕉️ వినాయకుని విశిష్టత 🙏 #🕉️వినాయక మంత్రాలు *ఓం లంబోదరాయ నమః* గణేశ రూపాలు ఎన్నో ఉన్నాయి. గణేశ మంత్రాలు కూడా అసంఖ్యాకమే. ఒక్కోనామానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ప్రతి మంత్రానికీ విశిష్ట పరమార్థం, ప్రయోజనం ఉంటాయి. ఏ సమయంలో ఎప్పుడైనా ఎవరైనా జపించుకోగలిగే గణపతి మంత్రాలు మూడింటిని చూద్దాం. _మంత్రం :_ *ఓం లంబోదరాయ నమః* _వివరణ :_ సృష్టికంతకూ మూలమైన వానికి నమస్కారం అని మంత్రార్థం. లంబోదరుడంటే సాధారణమైన అర్థంలో బానబొజ్జ కలవాడని చెబుతాం. కానీ బ్రహ్మవైవర్త పురాణంలోని గణపతి ఖండం లంబ శబ్దానికి బ్రహ్మాండ భాండములనే వివరణ ఇచ్చింది. లంబోదరుడంటే సృష్టిలోని బ్రహ్మాండాలన్నీ ఉదరంలోనే దాచుకున్నవాడని అర్థం. సిద్దిలక్ష్మీదేవిని అంకముపై కూర్చుండబెట్టుకుని లంబోదరుడు దర్శనమిస్తాడు. _నేపథ్యం :_ లంబోదర శబ్దాన్ని గురించి ముద్దలపురాణం చక్కగా వివరించింది. భాగవతంలో కూడా బ్రహ్మవర్చసః కామస్తు యదేతా బ్రహ్మణస్పతిం అంటే బ్రహ్మవర్చస్సు, విద్యకావాలనుకునేవారు లంబోదరుణ్ణి పూజించాలని చెప్పారు. లంబోదర లకుమి కథా అనేకీర్తన లంబోదరుడు లక్ష్మీకరుడు అని చెబుతుంది. _చేయవలసిన క్రమం :_ రోజూ 108 సార్లు _నైవేద్యం :_ వడపప్పు, ఉండ్రాళ్లు, పెసరపప్పు, పానకం వంటివి ఏవైనా. _ప్రయోజనం:_ విద్య, యశస్సు, సంపద కలుగుతాయి. స్త్రీలకు వివాహప్రాప్తి, సౌందర్యప్రాప్తి. _-_ _మంత్రం :_ *ఓం ఫాలచంద్రాయ నమః* _వివరణ:_ అరచంద్రునివంటి నుదురు కలిగిన స్వామికి నమస్కారం అని మంత్రారం. _నేపథ్యం:_ స్వామి శిరస్సు మీద ఉండే చంద్రుడు వేరు. ఆకాశంలో మనకు కనిపించే చంద్రుడు వేరు. నుదురు చంద్రవంకలావుంటే శ్రేష్టమైన జాతకుడవుతాడని సాముద్రిక శాస్త్రం చెపుతుంది. ఇటువంటి స్వామి అందరికీ ఆరాధ్యుడు. రసూల్ ఖాన్ అనేకవి శిశుశశి ఈక్ అయిన ఫాలచంద్ర గణపతికి తాను బందీనైపోయానని చెప్పుకున్నాడు. _చేయవలసిన క్రమం:_ యధాశక్తి _నైవేద్యం :_ పళ్లు, పాలు, వడపప్పు వంటివి. _ప్రయోజనాలు :_ చంద్రుడు మనస్సుకు కారకుడు. ఫాలచంద్ర గణపతిని అర్చిస్తే మానసిక సమస్యలు తొలగిపోతాయి. జ్ఞానము కలుగుతుంది. బుద్ది తీక్ష మవుతుంది. గణపతి సద్విద్య, సద్భుద్ది కలిగిస్తాడు. _-_ _మంత్రం :_ *ఓం గజవకాయ నమః* _వివరణ :_ ఏనుగు ముఖం కలిగిన స్వామికి వందనం అని మంత్రార్థం. గజ అన్నప్పుడు గ అంటే జ్ఞానం. జ్జ అంటే ఆచరణ. అంటే ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని కలిగించే దేవర గజవక్షుడు. ఈ స్వామి ఎనిమిది ముఖాలతో ఎర్రని శరీరం కలిగివుంటాడు. _నేపధ్యం:_ నారదపురాణంలో చెప్పిన మహామంత్రాలలో ఇదికూడా ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శ్లోకంలో ప్రసన్నవదనం అంటే సింహ. గజముఖాలు కలిగిన్ స్వామి అనే అర్ధాన్ని పెద్దలు చెబుతారు. ఏనుగు ముఖం గంభీరమైంది. దాని మనస్సులో ఏముందో ఎవరికీ తెలియదు. శిక్షించినా, రక్షించినా అపూర్వమైన రీతిలో చేయడం గజవదనుని ప్రత్యేకత _చేయవలసిన క్రమం :_ రోజుకు 27 సార్లు తగకుండా చేయాలి. _నేవేద్యం:_ బెల్లంముక్క చాలు. _ప్రయోజనాలు :_ గజవదనుడైన గణపతిని పూజిస్తే మనలోని ఎనిమిది అవలక్షణాలు తొలగుతాయి. ఉత్సాహం ఫలితం ఆలస్యం చెయ్యిడం, లోభం, దీనత్వం, నిద్ర, సోమరితనం, అరకొరగా పనిచేయడం, స్తబ్దత, మతిమరుపు ఒకప్పుడు ఈ ఎనిమిది అవలక్షణాలూ ఒకప్పుడు దేవతా సైన్యాలకు కలిగితే వాటిని తొలగించడానికే పరమాత్మ గజవదనంతో వచ్చాడు. జ్ఞానం బలం, చురుకైన బుద్ధి సిద్ధిస్తాయి. పోటీపరీక్షలకు చదువుకునే పిల్లలు ఈ మంత్రం జపించాలి. *డైలీ విష్ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు* *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
12 likes
14 shares