శ్రీ కృష్ణాష్టమి పండుగ ప్రాధాన్యత
8 Posts • 3K views
PSV APPARAO
947 views 5 months ago
#శ్రీ కృష్ణాష్టమి పండుగ ప్రాధాన్యత #🙏🏼శ్రీకృష్ణుని లీలలు #🙏🏼శ్రీకృష్ణుని లీలలు #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #📿శ్రీకృష్ణుని బోధనలు📿 #📿శ్రీకృష్ణుని బోధనలు📿 #🙏జన్మాష్టమి Coming soon🍯 *కృష్ణాష్టమి* తత్వం అంటే స్వభావం అని ఒక అర్ధం ఉంది. పరమాత్మ అనేది మరో అర్థం. మానవుల్లో ఒక్కొక్కరి స్వభావం ఒక్కోవి ధంగా ఉంటుంది. అందుకే కొందరి స్వభావం కొందరికి నచ్చుతుంది. మరికొందరికి నచ్చదు. కానీ శ్రీకృష్ణతత్వం (స్వభావం) దాదాపు అంద రికీ నచ్చుతుంది. దానికి కారణం విష్ణుమూర్తి కృష్ణావతారం దాల్చి, పరమాత్మ స్వరూపాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే పరిస్థితులు కల్పించాడు. అందుకే 'అందరి మనసుల్నీ ఆక ర్షించేవాడు' (కర్షతి చిత్తం ఇతి కృష్ణః) అనేది 'కృష్ణ' శబ్దానికి నిర్వచనంగా మారింది. శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరిం చిన రోజు. కృష్ణుడి పేరుతో 'కృష్ణాష్టమి' అని, ఆయన జన్మించిన రోజు కాబట్టి 'జన్మాష్టమి' అని, బాల్యాన్ని గడిపి గోకులానికి ఆనందం కలిగించిన రోజు కాబట్టి 'గోకులాష్టమి' అనే పేర్లతో పిలుస్తారీ రోజును. ఇంకా శ్రీజయంతి అనే పేరు ఉంది. ఆయన అవతరించిన సమయం ద్వాపర, కలియుగాల సంధికాలం. జన్మ ప్రదేశం కారాగారం. ఆ ముహూర్తం మేనమామకు గండం ఉన్న సమయం. ఈ కారణాలన్నింటివల్లా కృష్ణావతారం విలక్షణమై విలసిల్లింది. అవతరిం చిన క్షణం నుంచి అనుక్షణం, అడుగడుగునా గండాలతోనే గడిచిందాయన జీవితం. అయినా ధైర్యంగా, స్థైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాడు. ఫలితంగా ప్రతి సంఘటనా మానవాళికి ఒక స్ఫూర్తిగా, బోధనాంశంగా పరిణమించాయి. పాలు తాగే వయసు నుంచే కృష్ణుడు రాక్షసుల దాడులను ఎదుర్కోవలసివ చ్చింది. అప్పటినుంచే దుష్ట శిక్షణ నిత్యకృత్యమైంది. నేపథ్యంలోనే పూతన, శకటా సురుడు లాంటి రాక్షసులను సంహరించాడు. మడుగులో ఉండి లోకులను హింసిస్తున్న కాళియుడి మదమణచాడు. గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని రక్షించాడు. ఇన్ని చేసిందీ చిన్నవాడిగా ఉన్నప్పుడే. కని పించే వయసుకు, చేసే పను లకు పొంతన కుదరదు. చూపరులకు నమ్మకం కల గదు. అందుకే పెద్దవాడా చిన్నవాడా అనే సందిగ్ధంలో పడిపోయేవారందరూ. తల్లులు తమకు ఇలాంటి బిడ్డడే కావాలని, స్నేహితులు తమకు ఇలాంటి స్నేహితులే కావాలని కోరుకుంటారు. కన్నెపిల్లలు కన్నయ్యలాంటి వాడే తనను వలపించే చెలి కాడు కావాలని కలలు కంటారు. సంసారులు తమ సంసార సాగర తరణం చేయించేవాడు శ్రీకృష్ణభగవా నుడేనని నమ్ముతారు. జీవిత చరమాంకంలో ఉన్న పండు వృద్ధులు కృష్ణ పరమాత్మే తమను ఆయనలో ఐక్యం చేసుకోవాలని కోరుకుంటారు. ఇలా ఎవరి కోరికను ప్రతిబింబించే విధంగా వారు కృష్ణాష్టమి వేడుకలు జరుపుతారు. - ఒక్కొక్క వయసు/ప్రాంతం వారు ఒక్కో రూపంలో/పద్ధతిలో కృష్ణుణ్ని ఆరాధిస్తారీ రోజున. ముఖ్యంగా బాలకృష్ణుడి రూపంలోనే ఎక్కువమంది ఆరాధిస్తారు. అసలు కృష్ణుడు అనగానే చాలామందికి ఆయన బాల్య రూపమే గుర్తొస్తుంది. అదీకాక ఈ పండుగ శ్రీకృష్ణుడి జన్మ సంబంధమైంది కాబట్టి అందుకు అనుగు ణంగా బాల్యోపచారాల రూపంలోనే (ఊయల లూపడం, ఇళ్ళముంగిట కృష్ణ పాదముద్రలు చిత్రించడం) ఆరాధిస్తారు. ఉట్టికొట్టి వసంతాలు చల్లుకోవడం మరో రక మైన ఆరాధన. చెలిమికి, సహజీవనానికి సంకే తమైన ఈ పద్ధతిని యువకులు అనుసరిస్తారు. గృహస్థులు భక్తిప్రపత్తులతో పూజిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని పూజించి పిండివంటలు నివేదన చేస్తారు. అనంతరం బంధు మిత్రులతో విందు భోజనం చేస్తారు. సాధారణంగా ఉదయం ఉపవాసం చేసేవారు సాయంత్రం 'ఫల/అల్పా'హారం తినాలని నియమం. కానీ కృష్ణాష్టమి నాడు గృహస్థులు ఆచరించే ఉపవాసంలో విందు భోజనం ప్రత్యేకం. దేవాలయాల్లో కృష్ణ విగ్రహానికి పూజలు చేస్తారు. ఈ పూజల్లో వెన్న, పాలు, పాలతో తయారుచేసిన మధుర పదార్థాలను నివేదన ద్రవ్యాలుగా వినియోగిస్తారు. కృష్ణలీలల్ని గానం చేయడం, తల్లులు తమ బిడ్డలను బాలకృష్ణు డిలా అలంకరించడం, కృష్ణుడి జీవిత ఘట్టాలను ప్రదర్శించడం, సందడి, సంతోషం, ఉత్సాహాలతో గడపడంతో ఈ పర్వం పూర్తవుతుంది. 🚩 #డైలీ_విష్ 🚩 ఆధ్యాత్మికం ఆనందం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఈ పేజీని ఫాలో అవ్వండి అలాగే ఈ పేజీని లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు మరియు మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. https://www.facebook.com/Dailywishtelugu?mibextid=ZbWKwL
12 likes
20 shares
PSV APPARAO
921 views 5 months ago
#శ్రీ కృష్ణాష్టమి పండుగ ప్రాధాన్యత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #బాల ముకుందాష్టకం / బాల ముకుందాష్టకం 🙏 #కృష్ణాష్టమి #శ్రీకృష్ణ ముకుంద మాధవ మురళి మనోహర *బాల ముకుందాష్టకం* కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ । వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 1 ॥ సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ । సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 2 ॥ ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మమ్ । సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 3 ॥ లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిమ్ । బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 4 ॥ శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయామ్ । భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 5 ॥ కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగేనటనప్రియంతమ్ । తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 6 ॥ ఉలూఖలే బద్ధముదారశౌర్యం ఉత్తుంగయుగ్మార్జున భంగలీలమ్ । ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 7 ॥ ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షమ్ । సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 8 ॥ *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
8 likes
6 shares