Failed to fetch language order
రాజకీయాలు
115 Posts • 1M views
P.Venkateswara Rao
1K views 23 days ago
#రాజకీయాలు *కొత్త ఏడాదిలో కొంత నమ్మకాన్ని ఇవ్వండి❗* JANUARY 1, 2026🎯 కొత్త సంవత్సరం వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పాలకులు రాబోయే సంవత్సరంలో ప్రజలను ఉద్ధరిస్తామంటూ అనేక ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రజలంతా పండగ చేసుకుంటున్నారు. కొత్త సంవత్సరం అనేది కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే. ఇప్పుడు ప్రజలకు పాలకులు కొత్తగా కురిపించాల్సిన వరాలు కనిపించకూడదు. ఎందుకంటే క్యాలెండర్ మారుతున్న తేదీతో నిమిత్తం లేకుండా.. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటారనే నమ్మకంతో మాత్రమే ప్రజలు వారిని పాలకులుగా అధికార సింహాసనాల మీద కూర్చోబెట్టారు కాబట్టి. కొత్త ఏడాదిలో ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందిస్తాం అంటూ చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఇలాంటి హామీ ప్రజలకు నిజంగా మధురమైనదే. కానీ కొత్త ఏడాదిలోనే ఎందుకు ఇవ్వాలి? కొత్తదనం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి ఇస్తారా? సంవత్సరం కాస్త పాత పడిన తర్వాత విస్మరిస్తారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదేళ్లుగా రాజధాని ఏర్పాటు చేసుకోలేని అశక్త రాష్ట్రంగా అవతరించినప్పుడు.. చంద్రబాబుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతికందాయి. ఇలాంటి సందర్భంలో ఏదో కొత్త సంవత్సరం రోజు లాంటి అకేషన్స్ ముడి పెట్టుకుని అందమైన హామీలు ఇవ్వడం కాదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమానికే తాను కట్టుబడి ఉన్నానని నిరూపించుకోవాలి. కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పవలసిందేగాని, తన పనితీరు ఇప్పుడు కొత్తగా ఉంటుంది అని ప్రజలకు చెప్పవలసిన అవసరం లేదు. రాష్ట్రం ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితులను బట్టి చంద్రబాబు ప్రజలకు కొత్త వరాల కంటే కాసింత నమ్మకాన్ని ఇవ్వడం అవసరం. ‘తాము ఎన్నుకున్న ప్రభుత్వం తమ కోసమే పనిచేస్తోంది' అనే నమ్మకాన్ని ఆయన ప్రజలకు అందివ్వాలి. ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం, బడా బాబుల కోసం మాత్రమే కాకుండా సామాన్యుల కోసం కూడా చిత్తశుద్ధి చూపెడుతోందని ప్రజలకు అర్థం కావాలి. ఆ రకంగా పాలకుల చేతలు ఉండాలి. అంతేతప్ప రెట్టింపు సంక్షేమం రెట్టింపు అభివృద్ధి అని పడికట్టు పదాలు చెప్పి పెట్టుబడిదారులకు రాష్ట్ర వనరులను దోచిపెట్టడంలో రెట్టింపు శ్రద్ధ చూపిస్తే ప్రజలు బాధపడతారు. వారి ఆవేదన పాలకులకు ఎప్పటికీ మంచిది కాదు.
13 likes
16 shares