తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS
67 Posts • 31K views
PSV APPARAO
562 views
#సూర్యప్రభ వాహన సేవ #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీవారి వాహన సేవలు ... సర్వ పాపహరణం భక్తి ముక్తిదాయకం 🙏 #తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు 🙏 👆 సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం తిరుమలలో వైభవంగా రథసప్తమి తిరుమల, 2026 జనవరి 25: సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారంనాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు. సూర్యప్రభ వాహనం – (ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు) : సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల ‘ఆదిత్య హృదయం’, ‘సూర్యాష్టకం’ రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీవేంకటేశ్వర బాలమందిరానికి చెందిన విద్యార్థులు ఆలపించిన ఆదిత్యహృదయం, సూర్యాష్టకం శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. ఈ శ్లోకాలు పారాయ‌ణం చేయ‌డంపై బాలమందిరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యం, వివిధ సంస్కృత శ్లోకాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ ఎమ్మెస్ రాజు, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ ఎన్. సదాశివరావు, శ్రీ నరేష్ , శ్రీ శాంతా రామ్, శ్రీమతి జానకి దేవి, శ్రీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. కాగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడులతో కలిసి మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పర్యావేక్షించారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
9 likes
15 shares
PSV APPARAO
590 views
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రథసప్తమి 🌅 సూర్యభగవానుని జయంతి 🌄🙏 #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #రథసప్తమి సందర్భంగా తిరుమలలో చిన్నశేష వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామి వారి దర్శనం 🙏 #తిరుమల వేంకటేశుని వైభవం రథసప్తమి సందర్భంగా తిరుమలలో చిన్నశేష వాహన సేవలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం 🙏 రథసప్తమి నాడు తిరుమలలో చిన్నశేష వాహనంపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం వల్ల దైవానుగ్రహం కలుగుతుందని, సర్ప దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇది తిరుమలలో అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే దృశ్యం. "రథసప్తమి సందర్భంగా తిరుమలలో చిన్నశేష వాహన సేవలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తుందని మరియు భక్తులను సర్ప దోషాల నుండి విముక్తి చేస్తుందని నమ్ముతారు. ఇది తిరుమలలోని అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మికోత్తేజకరమైన దృశ్యం." కీలక అంశాలు: • చిన్నశేష వాహనం: ఇది ఆదిశేషువుకు ప్రతీక, కుండలిని శక్తిని మేల్కొల్పుతుందని నమ్ముతారు. • ఫలితం: సర్ప దోష నివారణ మరియు సకల అడ్డంకులు తొలగిపోవడం. • సమయం: రథసప్తమి (మాఘ శుద్ధ సప్తమి).
12 likes
11 shares
PSV APPARAO
569 views
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #శ్రీవారి పార్వేటి ఉత్సవం / వెంకన్న వేట 🎠🐎 #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం 👉 జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం తిరుమల, 2026 జనవరి 14: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 5.30 నుండి 6.30 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు. అనంత‌రం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు. ఆర్జితసేవలు రద్దు : ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
14 likes
14 shares