మన పూర్వీకులు గుడి కట్టడం వెనకున్న రహస్యాలు.........!!
ప్రపంచంలోని (కాస్మిక్ ఎనర్జీ ) విశ్వశక్తి గోపురం పైనున్న కలశం ద్వారా రాగి యంత్రం పైనుంచి గర్భగుడిలోని విగ్రహానికి వస్తుంది కాబట్టి ఇ గర్భగుడిని మూడు వైపులా మూసి ఒక ద్వారం ఉంచుతారు. ఆ ద్వారం ద్వారా దర్శనానికి వెళ్లే మనలాంటి వాళ్లకి ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
అలా రాకపోయినా దేవుడికి ఇచ్చే హారతి మనం కళ్ళకి అద్దుకోవడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో ప్రవేశిస్తుంద దానివల్ల మనకు అన్ని పాజిటివ్ గానే జరుగుతాయి.
హారతి ఇచ్చినప్పుడు మోగించే గంట ఓం అనే శబ్దం మన మెదడులో వ్యాపించి మన ఆలోచనల్ని (దేవుడి విగ్రహాన్ని చూడటం )ఒకే దృష్టిలో ఉంచి మనలోని ఏడు చక్రాలను యాక్టివేషన్ గా ఉంచుతాయి.
మనలో ఉండే పంచేంద్రియాలు పంచభూతాలు గాయాక్టివేట్ అవుతుంది దానివల్ల మనకు ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి.
గుడిలో ఇచ్చే తీర్థం ఆ తీర్థం లో ఉండే పచ్చ కర్పూరం తులసి లవంగం కలిపిన నీరు మనకు తీర్థంగా ఇస్తారు దానిని సేవించడం వలన మనకు వచ్చిన పాజిటివ్ ఎనర్జీని 24గంటలు ఉంచుతుంది. ఇదే పద్ధతిని హీలర్లు ఉపయోగిస్తారు.
గుడి చుట్టూ ప్రదక్షణ చేయడంవల్ల మ్యాగ్నెటిక్ పవర్ మనకు లభిస్తుంది అలాగే కింద ఉన్న చిన్న చిన్న రాళ్లు మన పాదం లో గుచ్చుకోవడం వల్ల (అక్కు పంచర్ )అక్కు ప్రెషర్ పాయింట్లు యాక్టివేషన్ అయి మనకు ఎటువంటి రోగాలు జబ్బులు రాకుండా ఉంటాయి.
మన పూర్వీకులు చెప్పిన విధంగా గుడికి వెళ్లి దేవుని దర్శించడం ప్రదక్షణ చేయడం వంటివి చేసి అందరూ లబ్ది పొందాలని కోరుకుంటూ.
#సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతన హిందూ ధర్మం #తెలుసుకుందాం #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples