@mahbubnagarpolice
@mahbubnagarpolice

Mahbubnagar Police

Mahbubnagar District Police

మహబూబ్ నగర్ పోలీస్...💐 దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన జవాన్ల త్యాగాలను సమాజంలోని ప్రతిఒక్కరూ స్మరించుకుని, శద్ధాంజలి ఘటించడం కనీస ధర్మమని జిల్లా ఎస్.పి. రెమా రాజేశ్వరి IPS గారు అన్నారు. కాశ్మీరులో నిన్నటిరోజున టెర్రరిస్టులు జరిపిన దొంగ దాడిలో 45 మంది CRPF జవాను సోదరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ఎస్.పి. గారు మాట్లాడుతూ, టెర్రరిస్టుల చర్య వారి చేతగానితనాన్ని, రాక్షసత్వాన్ని చాటుతున్నదని అన్నారు. ఇటీవలకాలంలో మన జవాన్ల చేతిలో చావుదెబ్బలు తిన్న టెర్రరిస్టులు తమ ఉనికిని చాటుకొనటానికి, దొంగచాటుగా దాడి చేశారని, ఇటువంటి పిరికి చర్యలు మన పోలీసు బలగాలు, సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచి దేశం రక్షణకై కసిగా పని చేసేందుకు పురిగొల్పుతాయని ఎస్.పి. గారు పేర్కొన్నారు. ఈసందర్భంగా అమరులైన ప్రతి జవాను కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఈ ఘటనలో అమరులైన సోదర CRPF జవాన్ల ఆత్మశాంతికై మనఃస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మాతృదేశ రక్షణలో మనమంతా ఒక్కటేనని చాటాలని ఎస్.పి. గారు పిలుపునిచ్చారు. పోలీసు ఎంపిక ప్రక్రియ జరుగుతున్న స్టేడియం గ్రౌండ్ లోనే, పోలీసు అధికారులు, దేహదారుఢ్య పరీక్షలలో పాల్గొనడానికి వచ్చిన మహిళా అభ్యర్థులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో అదనపు ఎస్.పి. శ్రీ ఎన్. వేంకటేశ్వర్లు, డి.ఎస్.పి. శ్రీ జి.గిరిబాబు, అధికారులు మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు. పి.ఆర్.ఓ. ఎస్.పి. కార్యాలయం.
#

📰 వార్తలు

📰 వార్తలు - ShareChat
99.1k views
4 days ago
*మహబూబ్ నగర్ పోలీసు...💐* *పత్రికా ప్రకటన* జిల్లాలో జరుగుతున్న పోలీసు కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ సజావుగా సాగుతున్నదని, యువత పోటీతత్వంతో ఉద్యోగం సాధించాలనే సానుకూల దృక్పథంతో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని జిల్లా ఎస్.పి. శ్రీమతి రెమా రాజేశ్వరి IPS గారు తెలిపారు. రాష్ట్ర రిక్రూట్మెంట్ బోర్డు ఉత్తర్వుల మేరకు, కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ తన పర్యవేక్షణలో జరుగుతున్నదని, ప్రతి ఈవెంట్ దగ్గర ఉన్నతాధికారి నేతృత్వంలో సి.సి. కెమెరా, డిజిటల్ యంత్రం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్.పి. గారు వివరించారు. ఈసందర్భంగా కొందరు అభ్యర్థులు అనారోగ్యం సాకుతో, డబ్బులతో సృష్టించుకున్న తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ల ద్వారా దేహదారుఢ్య పరీక్షల తేదీని మార్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం తమ దృష్టికి వచ్చిందని, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు తెచ్ఛేవారిపై అనర్హత వేటు తప్పదని జిల్లా ఎస్.పి. గారు హెచ్చరించారు. ఈవిషయంలో వైద్యాధికారులు కూడా  తగిన పరీక్షలు నిర్వహించి, సివిల్ సర్జన్, మెడికల్ సూపరింటెండెంట్, ఆర్.ఎం.ఓ. గార్ల దృష్టిలో ఉంచి మాత్రమే ఇట్టి సర్టిఫికెట్లు జారీ చేయాలని ఎస్.పి. గారు సూచించారు. మెడికల్ సర్టిఫికెట్ల గురించి పోలీసు ప్రత్యేక విభాగం వారు ఆరా తీస్తారని, అవసరమైతే వైద్య బృందానికి పంపించడం జరుగుతుందని, మోసపూరిత చర్యలు చేసినట్లుగా రుజువైతే, తద్వారా అనర్హులుగా ప్రకటించడంతో పాటూ కేసులు నమోదు చేస్తామని వివరించారు. అభ్యర్థులు ప్రాక్టీసు చేసుకొనటానికి కావలసినంత సమయం లభించిందని, తప్పుడు మార్గాల వలన తీవ్రంగా నష్టపోక తప్పదని, వైద్యాధికారులు కూడా ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్.పి. రెమా రాజేశ్వరి గారు తెలిపారు. పి.ఆర్.ఓ. ఎస్.పి. కార్యాలయం
#

📰 వార్తలు

📰 వార్తలు - ShareChat
142.1k views
6 days ago
#

📰 వార్తలు

మహబూబ్ నగర్ పోలీస్...💐 పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో ఎస్.పి. రెమా రాజేశ్వరి గారు బ్యానర్లు ఏర్పాటు చేశారు. పోలీసు ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, దళారీలు, పైరవీకారుల మాటలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని తెలుపుతూ, అటువంటివారి సమాచారాన్ని తెలుపవలసిందిగా పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు ఇచ్చారు. అమాయకులు మోసపోకుండా దళారీల ఆట కట్టించటానికిగానూ నిఘా, టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఎస్.పి. గారు తెలియజేశారు. పి.ఆర్.ఓ. ఎస్.పి. కార్యాలయం
129.9k views
8 days ago
మహబూబ్ నగర్ పోలీస్...💐 *పత్రికా ప్రకటన* పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా, రేపటి నుండి దేహ దారుఢ్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రంలోని స్థానిక స్టేడియం గ్రౌండ్ లో ప్రారంభం కానున్న ఈ పరీక్షలు జిల్లా ఎస్.పి. రెమా రాజేశ్వరి గారి పర్యవేక్షణలో జరుగనున్నాయి.  ఈసారి జరిగే దేహ దారుఢ్య పరీక్షలకు అత్యంత పకడ్బందీగా, ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్వహించనున్నామని ఎస్.పి. గారు తెలిపారు. అభ్యర్థులను బయోమెట్రిక్ పద్ధతి ద్వారా గుర్తించడం, పరీక్షలలోని ఎత్తు, ఛాతీ, బరువు కొలతలు మరియు పరుగుతో పాటుగా ఇతర పరీక్షలు కూడా డిజిటల్ విధానం ద్వారా నిర్వహించడం వలన ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని అధికారి వెల్లడించారు. ప్రతి అభ్యర్థికి వ్యక్తిగతంగా బయోమెట్రిక్ నెంబర్ అనుసంధానం చేయబడి, వివిధ పోటీ పరీక్షలలో వారి వ్యక్తిగత ప్రతిభను కంప్యూటర్ ద్వారా నమోదు చేయబడునని ఎస్.పి. గారు వివరించారు. ఈ పద్ధతి వలన ప్రతి విభాగపు కొలత పూర్తిగా కంప్యూటర్ ద్వారానే లెక్క చేయబడునని, అవకతవకలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత సామర్థ్యం పైన నమ్మకముంచుకుని పరీక్షలకు హాజరు కావాలని, ఈ పరీక్షలలో ఎటువంటి పైరవీలకు తావు లేదని ఎస్.పి. గారు పేర్కొన్నారు. దళారీల మాటలు నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని, అటువంటివారి వివరాలు తెలిస్తే, నేరుగా తనకు సమాచారం ఇవ్వాలని ఎస్.పి. గారు తెలిపారు. తమ పోలీసు ప్రత్యేక నిఘా బృందాలు దళారీల గురించి ప్రత్యేకంగా సమాచారం సేకరిస్తున్నాయని, అమాయకులైన అభ్యర్థులను మోసపుచ్చేవారు కటకటాలు లెక్కించసక తప్పదని ఎస్.పి. గారు హెచ్చరించారు.  దేహ దారుఢ్య పరీక్షలలో పాల్గొనే అభ్యర్థులు ఎంతో కష్టపడి సిద్ధమయ్యారని, తమ నమ్మకం, కృషి తమకు విజయాన్ని అందిస్తుందన్న విషయం గుర్తించాలని అన్నారు. పోలీసు ఎంపిక పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసినదేనని, అత్యాశతో, అమాయకతతో మోసపోవద్దని ఈసందర్భంగా ఎస్.పి. గారు సూచించారు. దేహదారుఢ్య పరీక్షలలో పాల్గొంటున్న అభ్యర్థులకు ఎస్.పి. రెమా రాజేశ్వరి గారు శుభాభినందనలు తెలుపుతూ, ఎటువంటి సందేహాలు ఉన్ననూ మీ పోలీసు అధికారులను సంప్రదించాలని ఎస్.పి. గారు తెలిపారు. పి.ఆర్.ఓ. ఎస్.పి. కార్యాలయం తేదీ 10.02.2019
#

📰 వార్తలు

📰 వార్తలు - ShareChat
102.2k views
9 days ago
*మహబూబ్ నగర్ పోలీసు...💐* *రహదారి భద్రతా వారోత్సవాలు-2019* రోడ్డు ప్రయాణంలో వ్యక్తిగత భద్రతపై మన సమాజంలో మరింతగా చైతన్యం రావలసిన అవసరం ఉన్నదని, మన కుటుంబ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించాలని జిల్లా అదనపు ఎస్.పి. శ్రీ ఎన్.వేంకటేశ్వర్లు గారు అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా, పోలీసు-రవాణా శాఖల ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన హెల్మెట్ అవగాహనా ర్యాలీని పోలీసు హెడ్ క్వార్టర్స్ నుండి ప్రారంభించిన తదుపరి అధికారి మాట్లాడుతూ, వాహనాలు నడిపేవారు మానవీయ కోణంలో ఆలోచించాలని, మనం చేసే ఒక ప్రమాదం మనలను గాయపరిచినా, ఎదుటివారి ప్రాణం తీసినా, ఆ కుటుంబాల తీరని శోకాన్ని, కలిగే నష్టాన్ని గురించి ఆలోచించాలని అన్నారు. చట్టాలతో నేరగాళ్లకు శిక్షలు విధించడం సాధ్యం అవుతుందని, సున్నితమైన మనసుతో ఆలోచించి నడుచుకుంటే, చట్టాలు, శిక్షలు అవసరమే లేదని ఈసందర్భంగా అదనపు ఎస్.పి. గారు వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకై పోలీసు శాఖ పక్షాన, మన ఎస్.పి. రెమా రాజేశ్వరి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, *రహదారి నా నేస్తం* పేరుతో అవగాహన సదస్సులు, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ మానవతాకోణాన్ని ఆవిష్కరిస్తున్నారని, ఈ సందర్భంగా మన ప్రజలంతా కలిసి వస్తే ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించుకుంటామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ చాలాన్ పద్ధతి ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తున్నామని, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్, రోడ్లపై అడ్డగోలు పార్కింగ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్స్ జంపింగ్ ఇలా ప్రతి విషయాన్ని ఫోటోలు తీసి నేరుగా ఇంటికి జరిమానా వివరాలు పంపించే ప్రక్రియ ప్రారంభం అయిందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ, వివిధ వాహనాల డ్రైవర్లకు నిరంతరం నిబంధనల గురించి వివరించడం, దురుసుగా వ్యవహరించే వాహనదారులకు జరిమానా విధించడం చేస్తున్నామని, అవసరమైతే లైసెన్సులు కూడ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ అమర్నాథ్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు రాజేష్, దిలీప్, శ్రీనివాస చారి, అధికారులు మరియు సిబ్బంది పాల్గొని హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. 💐పి.ఆర్.ఓ. ఎస్.పి. కార్యాలయం
#

📰 వార్తలు

📰 వార్తలు - ShareChat
98.9k views
10 days ago
మహబూబ్ నగర్ పోలీస్...💐 పోలీసు శాఖలో సిబ్బంది చేసే కృషి మూలాన సంస్థకు కీర్తి, సమాజానికి శాంతి అందుతున్నాయని జిల్లా ఎస్.పి. శ్రీమతి రెమా రాజేశ్వరి IPS గారు అన్నారు. దశాబ్దాలుగా చేసే పోలీసు విధి నిర్వహణలో సిబ్బంది ఎదుర్కునే ఒత్తిళ్లు, వారు చేసే త్యాగాలు తామెప్పటికీ జ్ఞాపకంలో ఉంచుకుంటామని ఎస్.పి. గారు పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, సామాజిక సేవలో భాగస్వామ్యం అవడం వలన ఎంతో ఆత్మసంతృప్తి లభిస్తుందని ఈసందర్భంగా అధికారి తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్.పి. గారితో కలిసి, పదవీవిరమణ పొందిన అధికారులు రామచంద్రా రెడ్డి si, ప్రభాకర్ రెడ్డి asi, రాజు hc లను ఎస్.పి. గారు ఘనంగా సత్కరించారు. 💐🙏🏻💐 పి.ఆర్.ఓ.
#

📰 వార్తలు

📰 వార్తలు - ShareChat
123.2k views
11 days ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because