TV9 Telugu
ShareChat
click to see wallet page
@tv9telugu
tv9telugu
TV9 Telugu
@tv9telugu
News Publisher
http://www.tv9telugu.com/
గతంలో ఎప్పుడూ కనీవిని ఎరుగని విధంగా ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1.5 లక్షలు దాటి, కిలో వెండి ధర రూ.3.5 లక్షలు దాటిపోయింది. ఒక ఏడాది క్రితం వీటిపై పెట్టుబడి పెట్టిన వారు నేడు ధనవంతులు అయ్యారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా రెగ్యులర్‌ పెట్టుబడిదారులతో పాటు సామాన్యులు కూడా ఇప్పుడు బంగారం, వెండిలో వివిధ మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు. #📖బిజినెస్
కొత్త కారు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా? అయితే మీకో అదిరిపోయే శుభవార్త. కొన్ని కంపెనీల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. అందుకు కారణం భారత్‌, యూరప్‌తో చేసుకునే ఒప్పందాలే. భారత్‌, యూరప్‌ మధ్య జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు ఇప్పుడు కీలక దశలో ఉన్నాయి. EU నుండి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలను 110 శాతం నుండి 40 శాతానికి తగ్గించాలని భారత్‌ యోచిస్తున్నట్లు వర్గాల సమాచారం. #📖బిజినెస్