ధనుర్మాసం ప్రారంభం *పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం*ధనుర్మాస వైశిష్ట్యం/ధనుర్మాసం వ్రత విధానం
20 Posts • 9K views
PSV APPARAO
1K views 1 months ago
#ధనుర్మాసం నెలగంట సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాసం పూజలు #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం #ధనుర్మాసం ప్రారంభం *పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం*ధనుర్మాస వైశిష్ట్యం/ధనుర్మాసం వ్రత విధానం #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) కార్యనిర్వహణాధికారి కార్యాలయం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాసం మహోత్సవాలు తేదీ 10,డిసెంబర్ 2025, బుధవారం. డిసెంబర్ 16 నుండి జనవరి 19 వరకు ప్రత్యేక ఉత్సవాలు, దర్శన వేళల్లో మార్పులు ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానంలో రాబోయే ధనుర్మాసం సందర్భంగా పలు ప్రత్యేక ఉత్సవాలు, కైంకర్యాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఈ కారణంగా భక్తుల దర్శన వేళల్లో మరియు ఆర్జిత సేవల్లో తాత్కాలిక మార్పులు చోటుచేసుకుంటాయి. ధనుర్మాసం ప్రారంభం 16.12.2025 మధ్యాహ్నం గం. 01:01 నిమిషాలకు శ్రీ స్వామివారి సన్నిధిలో "నెలగంట పెట్టుట" (ధనుర్మాసం ప్రారంభం) జరుగును. (16.12.2025): ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఆ రోజు ఉదయం సుమారు గం. 11:30 నిమిషాల నుండి మధ్యాహ్నం గం. 02:30 నిమిషాల వరకు స్వామివారి దర్శన నిలుపుదల చేయబడును. తేది. 20.12.2025 నుండి తేది. 29.12.2025 వరకు. ఈ పది రోజుల పాటు దేవాలయంలో శ్రీ స్వామివారి పగల్ పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, ధారోత్సవములు మరియు కనుమ పండుగ సందర్భంగా ప్రతి రోజు ఉదయం శ్రీ స్వామి వారి తిరువీధి ఉత్సవములు, విశేష సేవలు జరుగును. ఈ ప్రత్యేక ఉత్సవాల కారణంగా, పైన పేర్కొన్న తేదీలలో (20.12.2025 నుండి 29.12.2025 వరకు) నిత్యము జరుగు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు అన్నియు రద్దు చేయబడును. తేది. 30.12.2025 నుండి తేది. 09.01.2026 వరకు రాపత్తు ఉత్సవములు జరుగును. ఈ సందర్భంలో ప్రతి రోజు సాయంత్రం గం. 05:00 లకు శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవములు వైభవంగా జరుగును. రాపత్తు ఉత్సవాల కారణంగా, ఈ తేదీలలో (30.12.2025 నుండి 09.01.2026 వరకు) రాత్రి గం. 07:00 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీ స్వామివారి దర్శనములు లభించును.రాత్రి దర్శన వేళల్లో మార్పులు గమనించ గలరు. కుడారై ఉత్సవం తేది: 11.01.2026 ఆ రోజు గం. 09:00 నుండి గం. 10:30 వరకు శ్రీ స్వామి వారి దర్శనాలు నిలిపివేయబడును. సుప్రభాతం & ఉదయం ఆరాధన టిక్కెట్ల రద్దు తేదీలు: 16.12.2025 నుండి 19.01.2026 వరకు ధనుర్మాసం దృష్ట్యా ఈ కాలంలో: సుప్రభాతం సేవ ఉదయం ఆరాధన టిక్కెట్లు రద్దు చేయబడుచున్నవి. గోదా కళ్యాణం — భోగి పండుగ తేది: 14.01.2026 గోదా కళ్యాణం — భోగి పండుగఈ రోజు ప్రత్యేకంగా "గోదా కళ్యాణం" సాయంత్రం 05:00 నుండి 06:30 వరకు వైభవంగా జరగును. సాధారణంగా ఉదయం జరుగు నిత్యకళ్యాణం ఈ రోజు గోదా కళ్యాణంతో కలిపి సాయంత్రం జరుగును. భక్తులు విరివిగా పాల్గొనవలసిందిగా దేవస్థానం కోరుచున్నది. సహస్రనామార్చన టిక్కెట్ల రద్దు తేదీలు: 30.12.2025 నుండి 19.01.2026 వరకు ఈ తేది లలో సహస్రనామార్చన సేవ టిక్కెట్లు రద్దు చేయబడును. భక్తులకు వినతి పైన తెలిపిన తేదీలు, సమయాలు, దర్శన మార్పులు, రద్దు చేయబడిన ఆర్జిత సేవలను దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ దర్శన, సేవ కార్యక్రమాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవలసిందిగా దేవస్థానం విజ్ఞప్తి చేస్తున్నది మీడియా మాధ్యమాలు— దినపత్రికలు, టీవీ చానళ్ల ద్వారా పై సమాచారాన్ని భక్తులకు విస్తృతంగా తెలియజేయవలసిందిగా కోరడమైనది. సుజాత ఎన్ డిప్యూటీ కమిషనర్ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం
14 likes
18 shares
PSV APPARAO
764 views 1 months ago
#ధనుర్మాసం ప్రారంభం *పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం*ధనుర్మాస వైశిష్ట్యం/ధనుర్మాసం వ్రత విధానం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *సౌరమానం పర్వం ధనుర్మాసం* సౌరమానం అనగా సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ మాసంగా వ్యవహరిస్తారు. మేషరాశిలో ప్రవేశిస్తే మేషమాసమని, వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభ మాసమని, ధనుర్రాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసంగా ప్రతీతి. ధనుర్మాసం తరువాత సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు ఉత్తరాయణ పుణ్యకాలం, కర్కాటక రాశిలో ప్రవేశించినపుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు దక్షిణాయణం రాత్రి, ఉత్తరాయణం పగలు. మకరమాసం కంటే ముందు వచ్చు ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం వంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజాదికాలు అధిక ఫలాన్నిస్తాయి. సౌరమానం, చాంద్రమానం అనేవి మనం పాటించే కాలమానాలు. చాంద్రమానంలో చంద్రుని సంచారాన్ని అనుసరించి మాసాల పేర్లు నిర్ణయించబడ్డాయి. చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసంగా వ్యవహరిస్తారు. చిత్త నక్షత్రంలో ఉంటే చైత్ర మాసమని, విశాఖలో ఉంటే వైశాఖ మాసం, మృగశిరలో ఉంటే మార్గశీర్షమని అంటారు. సౌరమానం అనగా సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ మాసంగా వ్యవహరిస్తారు. మేషరాశిలో ప్రవేశిస్తే మేష మాసమని, వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభ మాసమని, ధనుర్రాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసంగా ప్రతీతి. ధనుర్మాసం తరువాత సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు ఉత్తరాయణ పుణ్యకాలం, కర్కాటక రాశిలో ప్రవేశించినపుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతంది. దేవతలకు దక్షిణాయణం రాత్రి, ఉత్తరాయణం పగలు. మకర మాసం కంటే ముందు వచ్చు ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూ ర్తం వంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజాదికాలు అధిక ఫలాన్నిస్తాయి. వాటికి కావాల్సిన పూర్వ రంగం ధనుర్మాస వ్రతం. పరి శుద్ధమైన మనస్సు, పరమాత్మ యందు భక్తి, పరోపకార వాంఛ, లోకకల్యాణం ఇవన్నీ కాంక్షిస్తూ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. దీనిలో మరొక రహస్యం ఏమనగా వేదం ప్రణవం ధనువు ద్వారా ధనుర్మాస విశిష్టతను తెలియజేసింది. ధనువు అంటే ఓంకారం. ధనువులో మూడు వంపులు ఉంటాయి. వాటిని కలిపే ఒక తాడు ఉంటుంది. ప్రణవంలో మూడు వర్ణాలు ఉంటాయి. అకార, ఉకార, మకారాలు. ఆ మూడింటిని కలిపేది జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, పరిజ్ఞానం. ధనువులో ఒక చివర జీవాత్మ, మరొక చివర పరమాత్మ ఆరెండిటిని కలిపే తాడు ప్రకృతి లేక అమ్మ (లక్ష్మి దేవి). ఇలా జీవాత్మ పర మాత్మను చేరు సాధనాన్ని తెలిపే మాసం ధనుర్మాసం. ఈ సమయంలో చాంద్రమానం ప్రకారం మార్గశిరం. పరమా త్మను చేరుటకు ఉత్తమమైన దారిని చూపునది మార్గశిరం. తరువాత వచ్చే మాసం పుష్యం. పుష్యం అంటే ఆనందం. పరమాత్మను చేరే దారిని తెలుసుకున్న వారు పుష్య పూర్ణులు కాగలరు. ఈ నిగూఢ తత్వాన్ని తెలిపే మాసం ధనుర్మాసం, *తిరుప్పావై సారము* సంసార దుఃఖములను అనుభవించుచున్న జీవులపై దయతో శ్రీమన్నారాయుణుడు అమ్మవారికి (లక్ష్మి) జీవులు ముక్తిని పొందు సులభోపాయములను మూడింటిని ఉపదేశిం చారు. అవి శ్రీహరి నామసంకీర్తనం, శరణాగతి. పుష్పార్చన. ఈ మార్గాలను బోధించి జీవులను తరింప చేయదలచిన అమ్మవారు శ్రీ విష్ణు చిత్తులకు తులసీ వనంలో లభించింది. శ్రీవిష్ణు చిత్తులు ఈమెకు గోదా అని నామకరణం చేశారు. యుక్త వయస్సు రాగానే గోదాదేవి శ్రీవటపత్ర శాయిని భర్తగా పొందదలచి, అలా పొందేందుకు పూర్వం గోపికలు వ్రతాన్ని ఆచరించారని విని తానావ్రతమును అనుకరించి ఒక వ్రతము చేయదలచి 30 పాశురముల రూపంలో వ్రతాన్ని రచించింది. దాని పేరే 'తిరుప్పావై'. ఈ తిరుప్పావై మూడు భాగములుగా పేర్కొనెదరు. మొదటి 5 పాశురములు ఉపోద్ఘాతము. తరువాతి పాశుర ములలో నందగోపుని భవన పాలకుని, ద్వారపాలకుని, మేల్కొలిపి లోనికి వెళ్ళి నందుని, యశోదను, శ్రీకృష్ణభగ వానుని బలరాముని మేల్కొలుపుట, తరువాత నీలాదేవిని మేల్కొలుపుట, తరువాత శ్రీకృష్ణుని నీలాదేవిని ఇరువురిని మేల్కొలుపుట, శ్రీకృష్ణ భగవానుని సభాస్థలిలో వేంచేసి సింహాసనాసీనుని కమ్మని ప్రార్దించుట, స్వామి వేంచేయగానే మంగళాశాసనము చేయుట, తరువాత తాము వచ్చిన పనిని నివేదించి తమకు సర్వకాల సర్వావస్థల యందు కైంకర్య మును చేయు భాగ్యమును ప్రసాదించమని ప్రార్దించటం. ఇది తిరుప్పావై సారము. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
6 likes
6 shares