శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏
86 Posts • 7K views
PSV APPARAO
547 views 1 days ago
#కార్తీకమాసం విశిష్టత #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 #కార్తీక మాసం ప్రత్యేక పర్వదినాలు #కార్తీక మాసం #కార్తీకమాసం *మహిమాన్వితాలు* కార్తీకమాసం అన్ని మాసములలో, అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతున్నది. 'న కార్తీక సమో మాసః' అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్ధం. కార్తీక మాసంలో చేయదగిన పుణ్య కార్యక్రమాలలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణం, దీపారాధనం, దీప దానం, తులసిమాల ధారణం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వనభోజనం మున్నగునవి. వీటిలో విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది కార్తీక స్నానం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధా రంగా చేయబడుతుంది. "చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రములో సంచరించే మాసం కార్తీక మాసం". అంబా, దులా, నితంతా, అభ్ర యంతీ, మేఘయంతీ, వర్షయంతీ, చూపూణికా అనే పేర్లతో పిలవబడే షట్కృత్తికలు కార్తీక మాస మునకు అధిపతులుగా చెప్పబడ్డారు. కృత్తికా నక్షత్రము కృత్తికలకు అధిష్టానము, అగ్ని స్వరూపము. అశ్విన్యాది 27 నక్షత్రములు దేవతలకు ఇంద్రియ ములుగా చెప్పబడ్డాయి. 'నక్షత్రం దేవమింద్రియం' అని శృతి. వాటిలో అతి ముఖ్యమైన తేజస్సును దేవతలకు అందించే నక్షత్రం కృత్తికా. అట్టి కృత్తికా నక్ష త్రముతో కూడిన పౌర్ణిమాస్య కలిగిన ఈ మాసము కార్తీక మాసముగా, విశేష పుణ్యఫలదముగా చెప్ప బడ్డది చాంద్రమాన రీత్యా ఎనిమిదవ మాసమైన కార్తీకమునకు ఒక విశేష స్థానము కలదు. శరదృ తువు ఉత్తరభాగములో వచ్చే కార్తీక మాసము నెల రోజులు పర్వదినాలుగానే భావిస్తారు. ప్రత్యేకించి కార్తీక శుక్ల ఏకాదశి నుండి పౌర్ణమి వరకు పంచ పర్వాలుగా భావించ బడ తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి ప్రత్యే కత ననుసరించి, ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు మాస ములు చాతుర్మాస్య వ్రతముగా చెప్పబడుచున్నవి. మహావిష్ణువు ఆషాడశుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉండునని, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థానము చెందును కావున దీనిని ఉత్థాన ఏకాదశి అనికూడా పిలుస్తారు. పీఠాధిపతులు, యతీశ్వ రులు, మునులు ఈ వ్రతమును ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆహార నియమాలతో చేయడం జరుగుతున్నది. కార్తీక శుద్ద ఏకాదశి లేదా "ఉత్థాన ఏకాదశీ" లేదా "ప్రభోదనైకాదశి" అంటారు. ప్రబోధనై కాదశి నాడు విష్ణుమూర్తి క్షీరాబ్ది నుండి బయలు దేరి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు, లేదా మదన ద్వాదశి, యోగిని ద్వాదశి నాడు విష్ణువు...లక్ష్మి, బ్రహ్మ మున్నగు వారితో కలిసి బృందావనంలో ప్రవేశి స్తాడు. దీనిని క్షీరసాగరాన్ని మధించిన/చిలికిన దినంగా వ్యవహరిస్తారు. అమదేర్ జ్యోతిషీ గ్రంథ ప్రకారం చాతుర్మాస్య వ్రత సమాపనదినం. విష్ణు మూర్తికి ప్రీతిపాత్రమైనది కార్తీక శుద్ధ త్రయోదశి. విష్ణువు శంకరుడిని పూజించిన దినం వైకుంఠ చతుర్దశి. ఇది జాగరణ వ్రతం, ప్రతిమావ్రతం, లింగ వ్రతం, ప్రబోధ వ్రతాలకు ఉద్దీపితమైనది. కార్తీక పౌర్ణమి శివునికి ప్రీతిపాత్రం. ముక్కంటి త్రిపురాసుడిని హతమార్చిన దినం. పార్వతి దేవి పాప పరిహా రార్థం శివారాధన చేసిన దినం. బౌద్ధులకు చాతు ర్మాస్య వ్రతారంభదినం. ఇలా ఐదు దినాలను పంచ పర్వాలుగా ఆచరిం చడం సనాతన సాంప్రదాయాచారం. దేవాలయా లలో మూల విరాట్టుల అభిషేకాలు, ప్రత్యేక అర్చ నలు, పూజలు చేస్తారు. భక్తులు ఆలయాల మధ్య గల ఉసిరిక వృక్షం చుట్టూ సాంప్రదాయ ప్రదక్షి ణలు ఆచరించి, ఉసిరికలను దానం చేసుకుని, కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజలొనరిస్తారు. మంగళ స్నానాలాచరించి, దొప్పలలో వెలిగించిన కార్తీక దీపాలను వదిలి పెడతారు. #namashivaya777
13 likes
13 shares
PSV APPARAO
962 views 2 days ago
#కార్తీక మాసం ప్రత్యేక పర్వదినాలు #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 #కార్తీక మాసం సోమవారం మహా శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు🕉️🐚🔱 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ *మోక్షాన్నిచ్చే కార్తీక సోమవారం* అధ్యాత్మికంగా కార్తీక మాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో అన్ని రోజులు ప్రత్యేకమైనవే. కార్తీక సోమవారం మరింత శ్రేష్టమైనది. ఈ మాసంలో సోమవారం రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజించి దానధర్మలు చేసేవారికి పాపాలనుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శివాలయాలను దర్శించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. ముత్తెదువలు భక్తిశ్రద్ధలతో శివుడిని కొలిస్తే సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని శాస్త్ర వచనం. సోమవారం బ్రహ్మీముహూర్తంలో స్నానమాచరించి పరిశుభ్రమైన బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలు పాటించాలి. ఇలా చేయడం వలన నిత్య సిరి సంపదలతో, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని పండితులు చెబుతారు. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషమైనా తొలగిపోతుంది. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే దారిద్య్ర్యం, సమస్యలు తొలగిపోతాయి. పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి. తరువాత శివాష్టకం చదువుతూ విభూదిని సమర్పించాలి. పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడంవల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. అందువల్ల బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడంవల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. శివపార్వతులను వేకువ జామున పూజించడం వలన ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ప్రతి రోజు పూజలు ఆచరించని వారు కనీసం సోమవారం రోజున పూజలు చేస్తే పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శివాలయంలో ఉసిరికాయపై వత్తులు ఉంచి దీపం వెలిగించడం శ్రేష్టం. కార్తిక సోమవారం నాడు పాటించే స్నానం, దానం, దీపారాధనం, అర్చనం, దైవ దర్శనం అనే పంచకృత్యాలను కార్తిక సోమవార వ్రతంగా ఆచరిస్తారు. వసిష్ఠ మహర్షి ద్వారా జనక మహారాజు కార్తిక సోమవార వ్రత వైభవాన్ని తెలుసుకుని, ఆచరించి మహాదేవుడి కృపకు పాత్రుడయ్యాడని పురాణాలు వివరిస్తున్నాయి. ఉపవాస దీక్షతో శుద్దోదకం, గోక్షీరం, పంచామృతాలతో రుద్రాభిషేకం, బిల్వదళాలతో రుద్రార్చన కార్తిక సోమవారంనాడు నిర్వహించాలని రుద్రాక్షోపనిషత్తు చెబుతోంది. ఉపవాస దీక్షను పాటించలేనివారు సమంత్రక స్నాన జపాదులు చేసినా శివుని అనుగ్రహం పొందవచ్చు. మనోవికారాలను రూపుమాపుకోవడానికి శివభక్తే అసలైన ఔషధమని శివానందలహరిలో జగద్గురువు ఆదిశంకరులు చెప్పారు. #namashivaya777
18 likes
8 shares
PSV APPARAO
640 views 1 days ago
#కార్తీక మాసం ప్రత్యేకతలు -శివకేశవుల లీలలు #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 #కార్తీకమాసం విశిష్టత #🙏ఓం నమః శివాయ🙏ૐ #కార్తీక మాసం సోమవారం మహా శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు🕉️🐚🔱 *మహిమాన్వితాలు* కార్తీకమాసం అన్ని మాసములలో, అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతున్నది. 'న కార్తీక సమో మాసః' అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్ధం. కార్తీక మాసంలో చేయదగిన పుణ్య కార్యక్రమాలలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణం, దీపారాధనం, దీప దానం, తులసిమాల ధారణం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వనభోజనం మున్నగునవి. వీటిలో విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది కార్తీక స్నానం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధా రంగా చేయబడుతుంది. "చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రములో సంచరించే మాసం కార్తీక మాసం". అంబా, దులా, నితంతా, అభ్ర యంతీ, మేఘయంతీ, వర్షయంతీ, చూపూణికా అనే పేర్లతో పిలవబడే షట్కృత్తికలు కార్తీక మాస మునకు అధిపతులుగా చెప్పబడ్డారు. కృత్తికా నక్షత్రము కృత్తికలకు అధిష్టానము, అగ్ని స్వరూపము. అశ్విన్యాది 27 నక్షత్రములు దేవతలకు ఇంద్రియ ములుగా చెప్పబడ్డాయి. 'నక్షత్రం దేవమింద్రియం' అని శృతి. వాటిలో అతి ముఖ్యమైన తేజస్సును దేవతలకు అందించే నక్షత్రం కృత్తికా. అట్టి కృత్తికా నక్ష త్రముతో కూడిన పౌర్ణిమాస్య కలిగిన ఈ మాసము కార్తీక మాసముగా, విశేష పుణ్యఫలదముగా చెప్ప బడ్డది చాంద్రమాన రీత్యా ఎనిమిదవ మాసమైన కార్తీకమునకు ఒక విశేష స్థానము కలదు. శరదృ తువు ఉత్తరభాగములో వచ్చే కార్తీక మాసము నెల రోజులు పర్వదినాలుగానే భావిస్తారు. ప్రత్యేకించి కార్తీక శుక్ల ఏకాదశి నుండి పౌర్ణమి వరకు పంచ పర్వాలుగా భావించ బడ తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి ప్రత్యే కత ననుసరించి, ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు మాస ములు చాతుర్మాస్య వ్రతముగా చెప్పబడుచున్నవి. మహావిష్ణువు ఆషాడశుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉండునని, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థానము చెందును కావున దీనిని ఉత్థాన ఏకాదశి అనికూడా పిలుస్తారు. పీఠాధిపతులు, యతీశ్వ రులు, మునులు ఈ వ్రతమును ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆహార నియమాలతో చేయడం జరుగుతున్నది. కార్తీక శుద్ద ఏకాదశి లేదా "ఉత్థాన ఏకాదశీ" లేదా "ప్రభోదనైకాదశి" అంటారు. ప్రబోధనై కాదశి నాడు విష్ణుమూర్తి క్షీరాబ్ది నుండి బయలు దేరి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు, లేదా మదన ద్వాదశి, యోగిని ద్వాదశి నాడు విష్ణువు...లక్ష్మి, బ్రహ్మ మున్నగు వారితో కలిసి బృందావనంలో ప్రవేశి స్తాడు. దీనిని క్షీరసాగరాన్ని మధించిన/చిలికిన దినంగా వ్యవహరిస్తారు. అమదేర్ జ్యోతిషీ గ్రంథ ప్రకారం చాతుర్మాస్య వ్రత సమాపనదినం. విష్ణు మూర్తికి ప్రీతిపాత్రమైనది కార్తీక శుద్ధ త్రయోదశి. విష్ణువు శంకరుడిని పూజించిన దినం వైకుంఠ చతుర్దశి. ఇది జాగరణ వ్రతం, ప్రతిమావ్రతం, లింగ వ్రతం, ప్రబోధ వ్రతాలకు ఉద్దీపితమైనది. కార్తీక పౌర్ణమి శివునికి ప్రీతిపాత్రం. ముక్కంటి త్రిపురాసుడిని హతమార్చిన దినం. పార్వతి దేవి పాప పరిహా రార్థం శివారాధన చేసిన దినం. బౌద్ధులకు చాతు ర్మాస్య వ్రతారంభదినం. ఇలా ఐదు దినాలను పంచ పర్వాలుగా ఆచరిం చడం సనాతన సాంప్రదాయాచారం. దేవాలయా లలో మూల విరాట్టుల అభిషేకాలు, ప్రత్యేక అర్చ నలు, పూజలు చేస్తారు. భక్తులు ఆలయాల మధ్య గల ఉసిరిక వృక్షం చుట్టూ సాంప్రదాయ ప్రదక్షి ణలు ఆచరించి, ఉసిరికలను దానం చేసుకుని, కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజలొనరిస్తారు. మంగళ స్నానాలాచరించి, దొప్పలలో వెలిగించిన కార్తీక దీపాలను వదిలి పెడతారు. #namashivaya777
7 likes
11 shares
PSV APPARAO
599 views 2 days ago
#మోక్షాన్నిచ్చే కార్తీక సోమవారం 🪔🔱🕉️🙏 #కార్తీక మాసం సోమవారం మహా శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు🕉️🐚🔱 #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 #కార్తీక మాసం ప్రత్యేక పర్వదినాలు #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ *మోక్షాన్నిచ్చే కార్తీక సోమవారం* అధ్యాత్మికంగా కార్తీక మాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో అన్ని రోజులు ప్రత్యేకమైనవే. కార్తీక సోమవారం మరింత శ్రేష్టమైనది. ఈ మాసంలో సోమవారం రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజించి దానధర్మలు చేసేవారికి పాపాలనుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శివాలయాలను దర్శించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. ముత్తెదువలు భక్తిశ్రద్ధలతో శివుడిని కొలిస్తే సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని శాస్త్ర వచనం. సోమవారం బ్రహ్మీముహూర్తంలో స్నానమాచరించి పరిశుభ్రమైన బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలు పాటించాలి. ఇలా చేయడం వలన నిత్య సిరి సంపదలతో, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని పండితులు చెబుతారు. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషమైనా తొలగిపోతుంది. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే దారిద్య్ర్యం, సమస్యలు తొలగిపోతాయి. పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి. తరువాత శివాష్టకం చదువుతూ విభూదిని సమర్పించాలి. పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడంవల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. అందువల్ల బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడంవల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. శివపార్వతులను వేకువ జామున పూజించడం వలన ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ప్రతి రోజు పూజలు ఆచరించని వారు కనీసం సోమవారం రోజున పూజలు చేస్తే పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శివాలయంలో ఉసిరికాయపై వత్తులు ఉంచి దీపం వెలిగించడం శ్రేష్టం. కార్తిక సోమవారం నాడు పాటించే స్నానం, దానం, దీపారాధనం, అర్చనం, దైవ దర్శనం అనే పంచకృత్యాలను కార్తిక సోమవార వ్రతంగా ఆచరిస్తారు. వసిష్ఠ మహర్షి ద్వారా జనక మహారాజు కార్తిక సోమవార వ్రత వైభవాన్ని తెలుసుకుని, ఆచరించి మహాదేవుడి కృపకు పాత్రుడయ్యాడని పురాణాలు వివరిస్తున్నాయి. ఉపవాస దీక్షతో శుద్దోదకం, గోక్షీరం, పంచామృతాలతో రుద్రాభిషేకం, బిల్వదళాలతో రుద్రార్చన కార్తిక సోమవారంనాడు నిర్వహించాలని రుద్రాక్షోపనిషత్తు చెబుతోంది. ఉపవాస దీక్షను పాటించలేనివారు సమంత్రక స్నాన జపాదులు చేసినా శివుని అనుగ్రహం పొందవచ్చు. మనోవికారాలను రూపుమాపుకోవడానికి శివభక్తే అసలైన ఔషధమని శివానందలహరిలో జగద్గురువు ఆదిశంకరులు చెప్పారు. #namashivaya777
4 likes
12 shares