శ్రీ జగన్నాథుని రథయాత్ర 🛕గుండిచా మార్జనమ🙏
6 Posts • 690 views
PSV APPARAO
679 views 3 months ago
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #పూరి జగన్నాథ రథ యాత్ర 2025 🛕🙏 #పూరి జగన్నాథ్ స్వామి వైభవం 🛕పూరి జగన్నాథ్ ఆలయంలో జరుగు ఉత్సవాలు / PURI UTSAVALU 🕉️🙏🙏🙏 #శ్రీ జగన్నాథుని రథయాత్ర 🛕గుండిచా మార్జనమ🙏 *పురుషోత్తమ క్షేత్రం* మన దేశంలోని పూరీ, బదిరీనాథ్, ద్వారక, రామేశ్వరంలలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చార్ ధాంగా పిలుస్తారు. వాటికి చాం హోదా కల్పించిన మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. వీటిలో పూరీలోని జగన్నాధస్వామి ఆలయం అనేక విశిష్టతలతో విరాజిల్లుతోంది. ఒడిశా రాష్ట్రం లోని జిల్లా కేంద్రమైన పూరీలో వెలసిన ఈ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారయినా సందర్శిస్తే జన్మసార్థకమవుతుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రఖ్యాత క్షేత్రాన్ని 'సర్వం జగన్నాథం' అని అభివర్ణిస్తుంటారు. చెన్నై- హౌరా మార్గంలో ఖుర్దారోడ్ అనే రైల్వే కూడలి ఉంది. అక్కడి నుంచి 44 కి.మీ. దూరంలో సాగర తీరాన పూరీ పట్టణం ఉంది. ఈ ఆలయం అత్యంత పురాతనమైంది. గతంలో పూరీని పురుషోత్తమ క్షేత్రం, శ్రీక్షేత్రం అనే పేర్లతో పిలిచేవారు. ఈ ఆలయ విమాన గోపురం 192 అడుగుల ఎత్తున ఉంటుంది. సుమారు 4 లక్షల చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి, చుట్టూ ఎత్తయిన ప్రాకారం కలిగి ఉంది. ఆలయ గోపురంపైగల సుదర్శన చక్రం, జండా భక్తులను ఆకర్షిస్తుంటాయి. ఎటువైపునుంచి చూసినా ఒకే విధంగా ఉంటాయి. ఆలయ గోపుంపై పక్షులు ఎగరవు. విమానాలు సరేసరీ, ప్రకృతి నియమా లకు విరుద్ధంగా బంగాళఖాతంలో ఎగిరే కెర టాలు కనుల విందు చేస్తుంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో 120 మేరకు ఆలయాలు, ఉపాల యాలున్నాయి. ప్రధానాలయంలో జగన్నాథుడు (శ్రీకృష్ణుడు), బలరాముడు, వారి సోదరి సుభద్ర దివ్య మంగళ విగ్రహాలు దర్శనమిస్తాయి. *రథయాత్ర:* ఆషాడ శుద్ధ విదియ రోజున పూరీక్షేత్రం రథ యాత్ర దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది భక్తజన సందోహంతో ప్రతిధ్వనిస్తుంది. ప్రపం చంలో ఏ హిందూ దేవాలయంలోనైనా సరే ఊరే గింపునకు మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు నకు ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల జరుగుతుంది. అయితే ఈ సంప్రదాయాన్నింటికీ మినహాయింపు పూరీ జగన్నాథాలయం. ఏటా కొత్త రథాలను శోభాయాత్రకు వినియోగించడం పూరీ ప్రత్యేకత. జగన్నాథడు, బలరాముడు, వారి సోదరి సుభద్ర విగ్రహాలను ఏటా ఓసారి మందిరం నుంచి బయటకు తీసుకొనివచ్చి కొత్తర థాలపై అధిష్టింప జేస్తారు. జగన్నాథుని రథాన్ని 'నందిఘోష', బలరాముని రథాన్ని 'తాళధ్వజం', సుభద్ర రథాన్ని 'పద్మ ద్వజం' అని పిలుస్తారు. రథయాత్రను పూరీ సంస్థానాధీశ కుటుంబానికి చెందిన వారు ప్రారంభిస్తారు. ఆ పిమ్మట “జై జగ న్నాథ్" అనే నినాదాలు మిన్నుముట్టగా తాళ్ళతో రథానికి కట్టి లాగుతారు. భక్తుల తొక్కిసలాటలో ఒకవేళ అనుకోని సంఘటనలు జరిగినా, రథం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. జగన్నాథుని ఆలయం నుంచి 2.5 కి. మీ. దూరంలో ఉండే గుండిచారాణి గుడికి చేరుకొనేసరికి పన్నెండు గంటల సమయం పడుతుంది.. గుండిబా ఆల యానికి చేరిన తరువాత ఆ రాత్రి బయటే రథా లను ఉంచి మర్నాడు ఉదయం మంగళవాయి ద్యాలు మార్మోగగా ఆలయంలోకి తీసుకుని వెళ్తారు. నవరాత్రులు అక్కడ ఉంచిన పిమ్మట దశ మినాడు మారురథయాత్ర (తిరుగు ప్రయాణం) మొదలవుతుంది. దీని "బహుదా యాత్ర" అని పిలుస్తారు. ఆ పిమ్మట విగ్రహాలను మళ్లీ గర్భగు డిలోని రత్న సింహాసనంపై అధిరోహింపజేస్తారు. ఆ విగ్రహాలు విలక్షణం: పూరీ జగన్నాథుని రూపం విలక్షణంగా కన్పిస్తుంది. విగ్రహాలు కొండ్యతో నిర్మించినవే. విగ్రహాలు పెద్దపెద్ద కళ్ళలో ఉంటాయి. కాళ్ళు, చేతులు, చెవులు, పెద వులు లేకుండా ఉంటాయి. నడుం కింది భాగం. ఉండదు. అనకూడదుగాని దివ్యాంగుల తర హాలో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి సంబం ధించిన స్థలపురాణం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. *స్థలపురాణం* ఇంద్రద్యుమ్నడనే మహరాజుకు విష్ణుమూర్తి కలలో కన్పించి చాంకీ నదీ తీరానికి 3 దారువులు (పెద్ద కర్రలు) కొట్టుకువస్తాయని, వాటిని విగ్రహా లుగా రూపొందించాలని సెలవిచ్చాడు. నదీ తీరంలో లభించిన దారువులతో విగ్రహాలుగా తీర్చిదిద్దేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే దేవ శిల్పి విశ్వకర్మ ఓ రోజున రాజువద్దకు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తాడు. తాను విగ్రహా లను రూపొందిస్తానని చెబుతాడు. అయితే ఇందుకు ఓ షరతు విధిస్తాడు. శాస్త్ర సంప్రదా యాల మేరకు ఈ దారువులను 21 రోజులు తదేక దృష్టితో పనిచేస్తేగాని విగ్రహాలు తయారుకావని, అంచేతన నిష్టకు భంగపరచకూడదని పేర్కొ న్నారు. పైగా తలుపులు వేసుకొని పనిచేయాల్సి ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు అంగీకరించాడు. నీలాద్రి సమీపంలో తాను నిర్మించిన ఓ మంది రంలో ఆ వృద్ధ శిల్పికి ఆశ్రయం కల్పించాడు. అలా 17 రోజులు గడిచాయి. 18వ రోజున ఇంద్ర ద్యుమ్నుని కుటుంబ సభ్యులు వృద్ధ శిల్పికి అన్న, పానీయాలను అందించాలని కోరారు. వారి మాట కాదనలేక భోజన, ఫల, పానీయాలతో ఆలయా నికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టించి లోపలకు వెళ్లి చూడగా శిల్పి కనబడలేదు. అంగహీనమైన, అసంపూర్ణమైన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారని స్పష్టమవు తోంది. ఇప్పటికీ జగన్నాథుడు అదే రూపంలో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. మరో విశేషమే మిటంటే ఆషాఢం అధిక మాసంగా వచ్చిన ఏడాది పాత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహా లను రూపొందించి ప్రతిష్ఠింప జేస్తారు. దీన్ని "నవకళేబర వత్సవమని” పిలుస్తారు. మూడేళ్ళకొ కసారి ఇలా జరుగుతుంది. ఇక ఇంద్రద్యుమ్నుని వారసుడైన యయాతికేసరి స్వామిగారికి గుడి కట్టించినట్టు తాళపత్ర గ్రంథాలవల్ల తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని క్రీ.శ. 1140 ప్రాంతంలో చాడగంగ దేవుడు, అతని కుమా రుడు అనంగ మహాదేవుడు పరిపూర్ణ స్థాయిలో, అద్భుత కళానైపుణ్యంతో నిర్మింపజేసారు. కాగా గుడించా మందిరం గూర్చి ఓ మాట చెప్పాలి. ఇంద్రద్యుమ్నుని భార్య గుడించా. జగన్నాథ, బల భద్ర, సుభద్రల విశ్రాంతి కోసం ప్రధానాలయానికి సమీపంలో ఓ మందిరం నిర్మించింది. అదే గుడించా మందిరం. రథయాత్రలో భాగంగా అక్కడకు తీసుకువెళ్ళే మూడు విగ్రహాలను ఈ గుడిలోని రత్నపీఠంపై కూర్చొండపెట్టి గుడించా దేవి పేరిట ఆతిథ్యమిస్తారు. ఓ విధంగా చెప్పా లంటే గుడించా మందిరం జగన్నాథుని విడిది. గృహం అన్నమాట. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
12 likes
16 shares
PSV APPARAO
1K views 3 months ago
#పూరి జగన్నాథ్ స్వామి వైభవం 🛕పూరి జగన్నాథ్ ఆలయంలో జరుగు ఉత్సవాలు / PURI UTSAVALU 🕉️🙏🙏🙏 #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #పూరి జగన్నాథ రథ యాత్ర 2025 🛕🙏 #శ్రీ జగన్నాథుని రథయాత్ర 🛕గుండిచా మార్జనమ🙏 #పూరీ జగన్నాధ్ స్వామి ఇప్పటికీ అంతుచిక్కని ఆలయ విశేషాలు 🔔 *జై జగన్నాథ్* 🔔 *జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు* 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రోజులు జగన్నాథుడు కొలువై ఉండే మందిరం పేరేమి?( గుండిచా ) 4) జగన్నాథుడు పయనించే రథం పేరేమి? (నంది ఘోష ) 5) జగన్నాధుని రథం ఎత్తు ఎంత?( 23 గజాలు) 6) జగన్నాధుని రథచక్రాలు ఎన్ని?(18) 7) బలబద్రుని రథం పేరేమిటి?( తాళద్వజం ) 8) బలబద్రుని రథం ఎత్తు ఎంత?(22 గజాలు ) 9) బలబద్ధుని రవి చక్రాలు ఎన్ని?(16) 10) సుభద్రాదేవిని తీసుకొని వచ్చే రథం పేరేంటి?( దర్పదలన ) 11) సుభద్రా దేవి రథం ఎత్తు ఎంత?(21 గజాలు) 12) సుభద్ర దేవి రథం చక్రాలు ఎన్ని?(14) 13) జగన్నాథ రథ తయారీ ప్రక్రియ పేరేమిటి?( రధ ప్రతిష్ట) 14) రథయాత్ర మార్గాన్నిఏమని పిలుస్తారు?( బడదండ ) 15) రథాలపై రెపరెపలాడే జెండాలను ఏమంటారు?( పావన బాణా ) 16) జగన్నాథ రథ తయారీలో పాల్గొనే వడ్రంగులు ఎంతమంది?(60 మంది) 17) జగన్నాథ రథం పై వేసే అలంకరణ వస్త్రాన్ని ఏమంటారు?( చాంద్వా ) 18) అలంకరణ వస్త్రాన్ని కుట్టే దర్జీలు ఎంతమంది?(14 మంది) 19) జగన్నాధ రథ అలంకరణ కోసం ఉపయోగించే వస్త్రం ఎన్ని మీటర్లు?(1200) 20) రథయాత్రకు సేవ చేయడానికి శిక్షణ పొందే వారిని ఏమంటారు?( దైవపతులు) 22) రథయాత్రకు ముందు మార్గాన్ని శుభ్రం చేసే ప్రక్రియను ఏమంటారు?( చెరాపహారా ) 23) రధాన్ని లాగడాన్ని ఏమంటారు?( రాధా తానా) 24) జగన్నాధుని ప్రథమ సేవకుడు ఎవరు?( పూరి రాజు ) 25) జగన్నాథ ప్రసాదాన్ని తయారు చేసేది ఏ కులము వ్యక్తి?( మంగలి) 26) ప్రసాద తయారీలో వినియోగించే పాత్ర ఏ లోహం? ( మట్టి) 27)జగన్నాధుని విగ్రహం ఏ లోహంతో తయారవుతుంది?( దారు/ చెక్క ) 28) జగన్నాథ రథయాత్ర కొనసాగే దూరం ఎంత?( రెండున్నర కిలోమీటర్లు ) https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
65 likes
20 shares
PSV APPARAO
845 views 3 months ago
#పూరీ జగన్నాధ్ స్వామి ఇప్పటికీ అంతుచిక్కని ఆలయ విశేషాలు #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #పూరి జగన్నాథ రథ యాత్ర 2025 🛕🙏 #పూరి జగన్నాథ్ స్వామి వైభవం 🛕పూరి జగన్నాథ్ ఆలయంలో జరుగు ఉత్సవాలు / PURI UTSAVALU 🕉️🙏🙏🙏 #శ్రీ జగన్నాథుని రథయాత్ర 🛕గుండిచా మార్జనమ🙏 *పూరీ జగన్నాథ ఆలయం గురించి ఎవరికీ అంతుచిక్కని మిస్టరీలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకొందామా..* గణగణ మోగే గంటలు, బ్రహ్మాండమైన 65 అడుగుల ఎతైన పిరమిడ్ నిర్మాణం, అద్భుతంగా చెక్కిన ఆలయంలోని చిత్రకళలు పూరీ జగన్నాథ్ ఆలయ ప్రత్యేకతలు. కృష్ణుడి జీవితాన్ని వివరంగా కళ్లకు కట్టినట్టు చూపించే స్తంభాలు, గోడలు ఆలయానికి మరింత శోభ తీసుకొస్తాయి. జగన్నాథ ఆలయాన్ని ప్రతి ఏడాది లక్షల భక్తులు సందర్శిస్తారు. ఆలయంలో చాలా ప్రసిద్ధమైనది, ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలో ఈ పూరీ జగన్నాథ ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 1078లో పూరీలో నిర్మించారు అయితే ఈ ఆలయం కూడా అన్ని ఆలయాల మాదిరిగానే గోపురం, దేవుడు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నప్పటికీ.. అన్నింటికంటే చాలా ప్రత్యేకమైనది, విభిన్నమైనది. జగన్నాథుడు అంటే లోకాన్ని ఏలే దైవం కొలవైన ఈ ఆలయంలో ప్రతీదీ చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. ఈ జగన్నాథ ఆలయం గురించి మీకు తెలియని, నమ్మకం కుదరని ఎన్నో నిజాలు ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఫ్లాగ్ : ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన ఫ్లాగ్ చాలా ఆశ్చర్యకంగా ఉంటుంది. సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు ఉంటే అటువైపు వీస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం గాలిదిశకు వ్యతిరేకంగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. సుదర్శన చక్రం : పూరీలో అత్యంత ప్రసిద్ధి చెందిన జగన్నాథ ఆలయం చాలా ఎతైనది. మీరు పూరీలో ఎక్కడ నిలబడి గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీవైపు తిరిగినట్టు కనిపించడం ఇక్కడి ప్రత్యేకత. అలలు : సాధారణంగా తీర ప్రాంతాల్లో పగటిపూట గాలి సముద్రంవైపు నుంచి భూమివైపుకి ఉంటుంది. సాయంత్రం పూట గాలి నేలవైపు నుంచి సముద్రంవైపుకి వీస్తుంది. కానీ పూరీలో అంతా విభిన్నం. దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.   పక్షులు : జగన్నాథ టెంపుల్ పైన పక్షులు అస్సలు ఎగరవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు.   గోపురం నీడ : పూరీ జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం గోపురం నీడ ఏ మాత్రం కనిపించదు. అది పగలైనా, సాయంత్రమైనా.. రోజులో ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఇది దేవుడి కోరికనో లేదా నిర్మాణంలోని గొప్పదమో మరి.   ప్రసాదం : పూరీ జగన్నాథ ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని ఎవరూ వేస్ట్ చేయరు.   అలల శబ్ధం : సింహ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ.. ఒక్క అడుగు గుడిలోపలికి పెట్టగానే సముద్రం నుంచి వచ్చే శబ్ధం ఏమాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగుపెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది. అయితే సాయంత్రంపూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు.   కారణం.. ఇద్దరు దేవుళ్ల సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరడం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెబుతారు. అంతేకానీ దీనివెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు.   రథయాత్ర : పూరీ జగన్నాథ రథయాత్రకు రెండు రథాలు లాగుతారు. శ్రీమందిరం, గుండీచా ఆలయానికి మధ్యలో నది ప్రవహిస్తుంది. మొదటి రథం దేవుళ్లను రథం వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటాలి. అక్కడి నుంచి మరో రథం దేవుళ్లను గుండీచా ఆలయానికి తీసుకెళ్తుంది.   రథాలు : పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముల విగ్రహాలను ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలుంటాయి.   బంగారు చీపురు : రథయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి, తాళ్లను లాగడంతో రథయాత్ర ప్రారంభమవుతుంది.   విగ్రహాలు : ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. గుండీచా ఆలయం : ప్రతి ఏడాది రథయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీచా ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే.. రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇది ఆలయంలో ఒక మిస్టరీ. సాయంత్రం ఆరుగంటల తర్వాత ఆలయ తలుపులు మూసేస్తారు.   ప్రసాదంలోని మిస్టరీ : ఈ పూరీ జగన్నాథ ఆలయంలో దేవుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆలయం సంప్రదాయం ప్రకారం ఈ వంటకాలను ఆలయ వంటశాలలోని మట్టికుండల్లో తయారు చేస్తారు. మరో విశేషమేంటో తెలుసా.. దేవుడికి సమర్పించక ముందు ఈ ప్రసాదాల నుంచి ఎలాంటి వాసన ఉండదు, రుచి ఉండదు. కానీ దేవుడికి సమర్పించిన వెంటనే ప్రసాదం నుంచి ఘుమఘుమలతో పాటు రుచి కూడా వస్తుంది. #namashivaya777
8 likes
15 shares
PSV APPARAO
873 views 3 months ago
#పూరీ జగన్నాధ్ మహా నైవేద్యం విశిష్టత #పూరి జగన్నాథ్ స్వామి వైభవం 🛕పూరి జగన్నాథ్ ఆలయంలో జరుగు ఉత్సవాలు / PURI UTSAVALU 🕉️🙏🙏🙏 #పూరి జగన్నాథ రథ యాత్ర 2025 🛕🙏 #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #శ్రీ జగన్నాథుని రథయాత్ర 🛕గుండిచా మార్జనమ🙏 🔔 *జై జగన్నాథ్* 🔔 *🚩పూరీ జగన్నాథుని 56 ప్రసాదాలు🚩* 1. అన్నం 2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు) 3. దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు) 4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు) 5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 6. నేతి అన్నం 7. కిచిడీ 8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు) 9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు) 10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి) 12. లడ్డు 13. మగజా లడ్డు (గోధుమపిండి లడ్డు) 14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు) 15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి) 16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు) 17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు) 19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు) 21. సువార్‌ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యి) 29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు) 30. దొహిబొరా (పెరుగు గారెలు) 31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యి) 33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం) 35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు) 36. కోవా 37 రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలు) 38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదార) 39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలు) 40. బపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదార) 41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యి) 42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి) 43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్‌ డల్లి (మినప్పప్పు వంటకం) 47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం) 48. మవుర్‌ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం) 49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగొ (తోటకూర వంటకం) 51. పొటొలొ రొసా (పొటల్స్‌/పర్వల్‌ కూర) 52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర) 53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం) 54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు) 55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో చేసే వంటకం) జై జగన్నాథ🙏🙏 https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
16 likes
6 shares