భగవాన్ రమణ మహర్షి
21 Posts • 27K views
Satya Vadapalli
899 views 8 days ago
“బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి”-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము. అందుకే “గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః! గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!”-గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యంకాదు. భగవాన్ రమణులు మహా పురుషులు. వారు బ్రహ్మముయొక్క స్థాయిని చేరిపోయినవారు. అంతటి అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉండేవారు. శరీరాన్ని చూపించి ఎప్పుడూ ఇది అని వేలు చూపించి తను సాక్షిగా ఉండేవారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, గురుస్వరూపుడైన రమణమహర్షి సంధ్యావందనం చేయాలనీ, యజ్ఞోపవీతం వేసుకోవాలనీ, గోచీపోసి పంచె కట్టుకోవాలనీ, వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలనీ, అలా ఆయన ప్రవర్తించకపోతే దోషం వస్తుందనీ, చెప్పడం సాధ్యం కాదు.అది అగ్నిహోత్రం వంటిది. ఆస్థాయికి చేరినటువంటి మహాపురుషులు కర్మాచరణను శాస్త్రీయంగా చేశారా? చేయలేదా? అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు. జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. అనుకరణవల్ల మహాత్ముల స్థాయిని చేరలేరు. పరమభక్తితో కర్మాచరణము చేయగా చేయగా అనుగ్రహించిన భగవంతుని కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశం ఇస్తుంది. ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమునకు హేతువు. జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ నేను ఆత్మ అని దానియందు రూఢియై అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని. శరీరంతో తాదాత్మ్యత పొందడు. అందుకే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకు కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని భావించడం పొరపాటు. గురువుయొక్క లీల, మాట పరమశక్తివంతములు. గురువు లోకోద్ధరణకొరకే నోరువిప్పుతాడు. గురువుయొక్క సహజస్థితి మౌనం. భగవాన్ రమణులకు అందుకే మౌనయోగి అని పేరు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవములో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులు. #🕉️ శ్రీ భగవాన్ రమణ మహర్షి #🙏🏻భక్తి సమాచారం😲 #🔱హిందూ దేవుళ్ళు🙏🏻 #భగవాన్ రమణ మహర్షి
14 likes
30 shares
Satya Vadapalli
1K views 8 days ago
భగవాన్ రమణ మహర్షి 146వ జయంతి : యోగులు అంతర్ముఖులై విశ్వంలోని మెళకువలను గ్రహించాలి. బహిర్ముఖులై వాటిని ప్రపంచానికి అందించాలి. ఆధునిక కాలంలో అటువంటి యోగి లక్షణాలు పరిపూర్ణంగా కలిగినవారు రమణ మహర్షి. మౌనయోగిగా ప్రసిద్ధి పొందారు. రమణ మహర్షి పూర్వనామం వెంకట్రామన్ అయ్యర్. మదురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిసెంబర్ 30న జన్మించారు. బాల్యంలో మంచి దేహదారుఢ్యంతో ఉండేవారు. ఒకసారి అనుకోని రీతిలో మరణానుభవానికి లోనయ్యారు. ఆ తరువాత చదువుమీద పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. 1895లో స్కూలుఫీజు కోసం పెద్దలిచ్చిన డబ్బుతో వెంకట్రామన్ అరుణాచలం చేరుకున్నారు. అప్పటికే అరుణాచలం పేరు ఆయనకు పంచాక్షరిగా వినిపించేది. అరుణాచలేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకుని, ‘‘స్వామీ! నీ ఆజ్ఞానుసారం వచ్చేశాను. ఇక నీ ఇష్టం’’ అంటూ ప్రణమిల్లారు. తరువాత ఆలయంలోని ఒక గుహలోకి వెళ్లిపోయారు. వెంకట్రామన్ ఎనిమిది సంవత్సరాలపాటు తపస్సమాధిలో ఉండిపోయారు. ఎలాంటి సంస్కారం లేని శరీరం శల్యావశిష్టమై పోయింది. మహాయోగి శేషేంద్రస్వామి వెంకట్రామన్ ఉనికిని, సమాధిస్థితిని గమనించారు. ఆయనను బాహ్యజగత్తుకు రావించి, ‘‘ఇకపై జగత్తు ఈ మహనీయుని నీడలో వెలుగొందుతుంది’’ అని లోకానికి పరిచయం చేశారు. అక్కడినుంచి మరోప్రస్థానం ప్రారంభమైంది. అరుణాచల గుహలోనే మౌనస్వామిగా అఖండ తపస్సు సాగించారు. అనంతరం ధ్యానయోగ తపస్సులకు మూలాలు గ్రహించిన సాధకునిగా లౌకిక ప్రపంచంలో అడుగుపెట్టారు. అగ్ని సరస్సున ప్రభవించిన వజ్రంలా, ఆకులచాటున సంపూర్ణఫలంగా రూపొందిన చందంగా రమణమహర్షి ఆర్తిజనోద్ధరణకు ప్రజల మధ్యకు వచ్చారు. భగవాన్ రమణులకు సన్నిహితంగా మెలిగిన వారిలో పరమహంస యోగానంద, శివానంద, కోహెన్, చాడ్విక్, పాల్ బ్రంటన్, సూరినాగమ్మ, కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని, నారాయణ గురు ప్రముఖులు. ఆయన 1950 ఏప్రిల్ 14న దేహత్యాగం చేశారు. నేటికీ అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం ఉంది. నిన్ను నీవు తెలుసుకో! అని రమణ మహర్షి సందేశమిచ్చారు. #భగవాన్ రమణ మహర్షి #🔱హిందూ దేవుళ్ళు🙏🏻 #🙏🏻భక్తి సమాచారం😲 #🕉️ శ్రీ భగవాన్ రమణ మహర్షి
8 likes
15 shares