Failed to fetch language order
వాల్మీకి జయంతి
18 Posts • 26K views
Satya Vadapalli
3K views 3 months ago
*🚩 శ్రీ వాల్మీకి జయంతి🚩* *ఆదికవి వాల్మీకి మహర్షి* మహా పుణ్య కవి , రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి కారణజన్ముడు . వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైనదని, వాల్మీకి తన జీవిత కాలంలో పాపా, పుణ్య కర్మలను ప్రక్షాళన చేశాడు , తన రామాయణ ఇతిహాసం. మానవుడు రచించిన తొలి గ్రంథము , చారిత్రక పురుషుడైన రఘురాముని గురించి ఇతని సమకాలం గురించి చెప్పడమే కాకుండా కథనం మధ్యమంగా ఆనాటి భౌగోళిక విషయాలను క్రోడీకరించాడు. సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందింది. హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. వాల్మీకి గొప్ప మహర్షి, తపఃశాలి. ఈయన రచించిన వాల్మీకి రామాయణాన్నే భారతీయులు ప్రామాణికంగా తీసుకుంటారు. రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకికి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . ఆయన తన కుటుంబాన్ని పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారుల సొత్తును దోచుకుని జీవితం గడిపేవారు. ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ….. కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ప్రశ్నిస్తారు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు. నారదుడు రామనామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తారు. ఉపదేశం తర్వాత ఆయన జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధి లోకి వెళ్ళిపోయారు చుట్టూ చీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తారు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా వాల్మీకి అనే పేరుతో పిలుస్తాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యారు. తపఃసంపన్నత తర్వాత వాల్మీకి ఆశ్రమవాసం చేయసాగారు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలకు జన్మనిచ్చినట్లూ..తెలుస్తుంది. యోగవాశిష్టము అనే యోగా, ధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు.ఈ పుస్తకము రామాయణములోని అంతర్భాగమే. రాముడు పది-పన్నెండు సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై, మానసిక ధౌర్భల్యమునకు గురి అయిన ప్పుడు వశిస్టుడి ద్వారాయోగా, ధ్యానములను శ్రీరాముడికి బోధించారు వ్రాసింది. వాల్మీకిమహర్షి, పలికింది, బోధించింది వశిస్టుడు,అందు వలన “యోగవాశిష్టము” అనే పేరు వచ్చింది. ఆదిత్య హృదయము అనెడి సూర్యస్తుతిని వ్రాసినవారు వాల్మీకి మహర్షియే. కౌసల్యా సుప్రజా రామ అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు వాల్మీకియే. మహర్షివాల్మీకి “వాల్మీకి మతము” అనే దానిని నెలకొల్పారు. భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ రామాయణ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. 24,000 శ్లోకము లతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మము ల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు- భక్తుడు – వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. అటువంటి సుందర కావ్యాన్ని చదివేముందు మనం వాల్మీక మహర్షిని స్మరించుకోవాలని పండితులు ఆయనను ఎంత అందంగా అనుభూతిస్తారో చూడండి. *కూజంతం రామ రామేతి I మధురమ్ మధురాక్షరమ్ II* *ఆరుహ్య కవితా శాఖాం I వందే వాల్మీకి కోకిలమ్ II* కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని, వాల్మీకి అనే కవికోకిల, మధురమూ మధురాక్షరమూ అయిన రామనామాన్ని పాడుతోందట! ఎంత సౌందర్య సంపూర్ణ ఆస్వాదనో! ఈ స్లోకంలో ఆదికవి వాల్మీక మహరిషి ని కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని రామాయణ పారాయణ చేసిన “కవికోకిల” గా వర్ణించారు పండితులు ఈ శ్లోకంలో కవిత్వమనే పెద్దచెట్టుకు వాడిన “ఆరూహ్య ” పదం అద్భుతం. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలుపుగోరులకు, తీసివేతలకు గురి అయింది. వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. #🙏🏻భక్తి సమాచారం😲 #మహర్షి వాల్మీకి జయంతి జై వాల్మీకి జై జై వాల్మీకి🙏🙏🙏🙏💪💪💪💪🌹🌹🌹🌹🌺🌺🌺🌺 #వాల్మీకి జయంతి #🌅శుభోదయం #👋విషెస్ స్టేటస్
52 likes
21 shares
Satya Vadapalli
1K views 3 months ago
అశ్వియుజ పౌర్ణమి -- శ్రీ వాల్మీకి జయంతి పూజ్య గురుదేవులు బ్రహశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారు సంపూర్ణ రామాయణ ప్రవచనాంతర్భాగముగా వాల్మీకి మహర్షి గురించి చెప్పిన విశేషములు, శ్రీ వాల్మీకి జయంతి సందర్భముగా... వల్మీకము (పుట్ట) లోంచి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అన్నారు. ఋషులు గంగాతీరంలో భగవధ్యానం చేయమని ఆదేశించగా కుశస్థలి అనే ప్రదేశంలో వాయులింగేశ్వరుడు అనే శివలింగాన్ని ప్రతిష్ట చేసి విశేషంగా ఆరాధన చేయగా పరమశివుని అనుగ్రహంతో వాల్మికీ రామాయణాన్ని రచించారు. ఒకే పరబ్రహ్మము సృష్టి, స్థితి, లయలలో సృష్టి చేయునప్పుడు బ్రహ్మ గారిగా, స్థితి చేయునప్పుడు శ్రీమహావిష్ణువుగా, లయము చేయునప్పుడు పరమేశ్వరునిగా ఉంటుంది. ఒకే పరబ్రహ్మము మూడుగా ఉంటుంది కనుక అపారమైన శివారాధన చేసిన ఫలితం చేత మహేశ్వరానుగ్రహముతో వాల్మీకి మహర్షి విష్ణుకథను చెప్పే అదృష్టాన్ని పొందారు. ఆయనకు విష్ణుకథ చెప్పటానికి ఉపదేశము చేసినది బ్రహ్మ గారు. వాల్మీకి త్రిమూర్తుల అనుగ్రహాన్ని పొందారు. చేసినది మహేశ్వరారాధన, పొందినది బ్రహ్మ అనుగ్రహం, చెప్పినది శ్రీమహావిష్ణువు కథ. తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షి ఒక నూరు శ్లోకములలో సంక్షిప్త రామాయణాన్ని తపస్వియైన వాల్మీకిమహర్షి కి చెప్పి నారదుడు వెళ్ళిపోయారు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందముగా ఉన్నది. ఆ రోజు మధ్యాహ్న సమయములో తమసా నదితీరాన ఒక చెట్టు మీద సంభోగ క్రియలో ఉన్న రెండు క్రౌంచపక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణముతో ఉన్న మగ క్రౌంచపక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః| యత్ క్రౌంచ మిథునా దేకమ్ అవధీః కామమోహితమ్|| ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణముతో ఉన్న రెండు క్రౌంచపక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టిచంపినవాడా ! నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక ! అని శపించారు. ఆయన స్నానము ముగించి ఆశ్రమానికి బయలుదేరారు కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనసులో ఆ క్రౌంచపక్షులే కనిపిస్తున్నాయి. ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు. అది శ్లోకరూపము దాల్చింది. చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకిమహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. బ్రహ్మగారు అన్నారు "ఓ వాల్మీకి ! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం --- "నిషాద" అంటే బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్తలోకములు తనయందున్న నారాయణుడని ఒక అర్ధం. "మా" అంటే లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః" అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా! నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక! " అని ఒక అర్థము. ‘యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్’ కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ - మండోదరులలో రావణుడు అనే క్రౌంచపక్షిని నీ బాణముతో కొట్టి చంపిన ఓ రామా ! నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోక అర్ధం మారింది. ఈ ఒక్క శ్లోకంలో మొత్తం రామాయణం వచ్చేసింది. ‘మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ సమాః |యత్ క్రౌంచ మిథునా దేకమ్ అవధీః కామమోహితమ్ || ‘మా నిషాదః’ – లక్ష్మిని పొందినవాడా – సీతమ్మతల్లి పరిణయం – రామాయణములో బాలకాండ వచ్చేసింది.‘ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ సమాః’ – రాజ్యమునందు ప్రతిష్టింపబడవలసిన రాముడు సత్యవాక్యమునందు తండ్రిని నిలపెట్టడము కోసము రాజ్యత్యాగము చేసి అరణ్యవాసము చేసాడు. అయోధ్యకాండ, అరణ్యకాండ వచ్చేసాయి. ‘యత్ క్రౌంచ మిథునా దేకమ్’ - రెండు క్రౌంచములలో దారితప్పి కామమోహితమైన క్రౌంచపక్షుల జంటలోని క్రౌంచపక్షిని కొట్టినవాడా – అన్నయిన వాలి తమ్ముడైన సుగ్రీవుడు జీవించి ఉండగా తమ్ముని భార్య అయిన రుమతో కామసుఖాన్ని అనుభవించాడు. ధర్మము తప్పిన వాలిని సంహరించాడు కాబట్టి అరణ్యకాండ. తరవాత కిష్కింధకాండ చెప్పెయ్యడము జరిగింది. రావణసంహారము కూడా చెప్పారు కాబట్టి యుద్ధకాండ అయిపోయింది. మరి సుందర కాండ ఎలా పూర్తవుతుంది? ‘క్రౌంచౌ’ అనడము చేత – శరీరము అంతా శుష్కించిపోయినవారిని ఆ పేరుతో పిలుస్తారు. సుందరకాండలో సీతమ్మతల్లి ఉపవాసములచేత శుష్కించి తన తపస్సు చేత రావణుని నిహతుని చేసింది. అందుచేత సుందరకాండ చెప్పబడింది. ఈ విధముగా రామాయణములోని ఆరుకాండలు ఆ శ్లోకములోకి వచ్చేసాయి. బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహము చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా! నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చొని రామాయణం వ్రాద్దామని మొదలుపెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినది మాత్రమే కాక వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతములు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధము, కల్పితము కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం వ్రాయడము మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానము చేసి కూర్చోగానే బ్రహ్మ గారి వరమువల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. రామాయణం రచన ప్రారంబించారు. కనుక వాల్మీకి రామాయణము పరమ ఆర్షము, పరమ సత్యము, పరమ ప్రామాణికము. #👋విషెస్ స్టేటస్ #🌅శుభోదయం #వాల్మీకి జయంతి #మహర్షి వాల్మీకి జయంతి జై వాల్మీకి జై జై వాల్మీకి🙏🙏🙏🙏💪💪💪💪🌹🌹🌹🌹🌺🌺🌺🌺 #🙏🏻భక్తి సమాచారం😲
8 likes
13 shares