అశ్వారావుపేట అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలి – ఎమ్మెల్యే జారె
03.01.2026 | శనివారం
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీ లోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ సహకారం అందించాలని ముఖ్యమంత్రిని కోరారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మరింత ఫలప్రదంగా అమలవ్వాలని ఆకాంక్షించారు
#🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ