జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
615 views
*అభివృద్ధి–సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ* *22.11.2025 – శనివారం* దమ్మపేట మండలం మొండివర్రె కాలనీలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు స్వయంగా పరిశీలించారు. పూర్తికి చేరుకున్న ఇండ్లను, ఇంకా పునాది దశలో ఉన్న ఇండ్లను పరిశీలించిన ఆయన— *“ఏవైనా నిర్మాణ సమస్యలు ఉన్నా త్వరితగతిన పరిష్కారం* చూపిస్తాం” అని స్పష్టం చేశారు. తర్వాత శ్రీరామపురం, లింగాలపల్లి, జమేదార్, బంజర, మందలపల్లి గ్రామాల్లో ఇటీవల రూ. *47 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గారు* ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ— *“అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా కట్టుబడి పనిచేస్తోంది. అభివృద్ధి, సంక్షేమం మా రెండు కళ్లులాంటివి. వచ్చే మూడు సంవత్సరాల్లో ప్రతి గ్రామాన్ని సమస్యలు లేని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడం నా కర్తవ్యం”* అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిశెట్టి సత్యప్రసాద్ (మండల అధ్యక్షులు), మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, మహిళా అధ్యక్షురాలు మచ్చల పార్వతి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానం ఉన్న గ్రామస్తులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ