జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
805 views
*మహిళల గౌరవం – అభివృద్ధి లక్ష్యంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం : ఎమ్మెల్యే జారె* *22.11.2025 – శనివారం* దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వ *ఇందిర మహిళా శక్తి కార్యక్రమం* లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. దమ్మపేట MPDO కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు స్వయంగా చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, “మహిళల ఆర్థిక స్థితి బలోపేతం కావాలి, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి అనేదే కాంగ్రెస్ ప్రభుత్వ అసలు ఉద్దేశ్యం. మహిళల గౌరవాన్ని ప్రతిబింబించే భావంతోనే ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాం” అని పేర్కొన్నారు. అదే రోజున అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా *కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గారు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి మహిళలకు చీరలను* అందజేశారు. గ్రామీణ మహిళల ఆర్థిక పురోగతికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలను ఆయన విపులంగా వివరించారు. #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు