ఫాలో అవ్వండి
JanaSenaPartyTelangana
@politicals
1,141
పోస్ట్
2,715
ఫాలోవర్స్
JanaSenaPartyTelangana
515 వీక్షించారు
4 గంటల క్రితం
MLC శ్రీ నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. - @pawankalyan @nagababuofficial #Nagababu #pawankalyan #HappyBirthdayNagababu #HDBNagababu #janasenapartytelangana #janasenaparty # #🎂Birthday Party🥳 #☀️శుభ మధ్యాహ్నం #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #👫తోబుట్టువుల ప్రేమ 🥰
JanaSenaPartyTelangana
522 వీక్షించారు
7 గంటల క్రితం
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఎప్పటికప్పుడు మొంథా తుపాను ప్రభావంపై తన కార్యాలయ అధికారుల ద్వారా క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకొంటున్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్ల నుంచి పేషీ అధికారులు క్షేత్ర స్థాయి సమాచారం తీసుకొన్నారు. అర్థరాత్రి తుపాను తీరం దాటిన క్రమంలో తీవ్రమైన ఈదురు గాలులు, భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. •పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ తీగలు పడటం, అదే విధంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. •తుపాను బలహీనపడ్డా భారీ వర్షాలు ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలన్నారు. •పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని ఈ రోజు కూడా అక్కడే ఉంచి ఆహార, వసతి కల్పించాలని స్పష్టం చేశారు. # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬 #🌧వర్షాకాలం స్టేటస్🤗 #⛈రుతుపవనాలు అప్‌డేట్స్
JanaSenaPartyTelangana
541 వీక్షించారు
1 రోజుల క్రితం
వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన జిల్లాల పునర్విభజనపై నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి @PawanKalyan. జిల్లాల పునర్విభజనపై వివిధ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై సమీక్ష. ఈ సమావేశంలో ఉపసంఘం కన్వీనర్, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ పి. నారాయణ గారు, శ్రీ నిమ్మల రామానాయుడు గారు, శ్రీమతి వంగలపూడి అనిత గారు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో శ్రీ బి.సి. జనార్దనరెడ్డి గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు హాజరయ్యారు. # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟨నారా చంద్రబాబు నాయుడు #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🌧వర్షాకాలం స్టేటస్🤗
JanaSenaPartyTelangana
523 వీక్షించారు
1 రోజుల క్రితం
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి ఆహ్వానం •ఉప ముఖ్యమంత్రివర్యులకు ఆహ్వాన పత్రికను అందజేసిన మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రత్నాకర్ గారు •గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారితోపాటు వేడుకల్లో పాల్గొంటానన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు •పుట్టపర్తిలో రోడ్ల నిర్మాణానికి అదనంగా రూ. 30 కోట్లు మంజూరు •శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపిన ట్రస్ట్ బోర్డు సభ్యులు భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టి శ్రీ రత్నాకర్ గారు, ఇతర సభ్యులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. శత జయంతి ఉత్సవాల వివరాలు తెలియజేశారు. నవంబర్ 19వ తేదీన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో శత జయంతి ఉత్సవాలకు హాజరుకానున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి గారితో కలసి వేడుకలకు హాజరవుతానని సత్యసాయి ట్రస్ట్ బోర్డు సభ్యులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్టు చెప్పారు. శ్రీ సత్యసాయి మందిరానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.30 కోట్లు అదనంగా కేటాయించినట్టు చెప్పారు. శత జయంతి ఉత్సవాలలోపు మందిరానికి అనుసంధాన రహదారులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించినందుకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సత్యసాయి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ రత్నాకర్ గారు ధన్యవాదాలు తెలిపారు. # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #📰ఈరోజు అప్‌డేట్స్ #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్
JanaSenaPartyTelangana
901 వీక్షించారు
1 రోజుల క్రితం
మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి • ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి • ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి • తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి • గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించి వైద్య సేవలు అందించాలి •పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలి • పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలి •మొంథా తుపాను ప్రభావం, సహాయక చర్యలపై కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ గారు, అధికార యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు వీడియో కాన్ఫరెన్స్ #CycloneMontha #Pawankalyan #Deputycmpawankalyan #AndhraPradesh #Telangana #Janasenapartytelangana # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🆕Current అప్‌డేట్స్📢 #⛈రుతుపవనాలు అప్‌డేట్స్ #🌧వర్షాకాలం స్టేటస్🤗
See other profiles for amazing content