శివారాధన
4 Posts • 1K views
PSV APPARAO
2K views
#శివ - ఎందుకు శివుడు సర్వోన్నత దేవుడు? why shiva is the supreme god ? #ఓం శివోహం... సర్వం శివమయం #శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏 #శివారాధన #మహా లింగార్చన 🕉️🔱🙏 శివుని 8 పేర్లు - అష్టపుష్ప మానస పూజ మహాగ్రంథాలు - శ్రీ శివ మహాపురాణము అట్టి శ్రీ సదాశివమూర్తికున్న ఎనిమిది పేర్లనూ అర్ధసహితంగా వివరిస్తున్నాను... 1. శివాయనమః = అన్నటికీ శుభము కలిగించువాడా! నీకు ఇదే నా నమస్కారం! 2. మహేశ్వరాయనమః = సంధాన - తిరోధాన కర్తవైన నీకు నమస్కరించుచున్నాను. 3. రుద్రాయనమః = సర్వ ఆపదలను నివారించువాడవైన నీకు అంజలి. 4. విష్ణవేనమః = సర్వే సర్వత్రా వ్యాపించియున్న వాడవైన నీకు నా కైమోడ్పులివియే! 5. పితామహాయనమః = అన్నిటికీ మూలకారకుడైనవాడా! నీకు ఇదే నా నమస్కారం! 6. సంసార భిషజేనమః = సమస్త ప్రాపంచిక రుగ్మతలనూ దూరం చేసే వైద్యుడైన వాడా! అంజలి. 7. సర్వజ్ఞాయనమః = అన్నీ తెల్సినట్టి మహా విద్వన్మూర్తీ! నమస్కృతులు. నా నమస్సుమాంజలి! 8. పరమాత్మాయనమః = అన్నిటికీ అతీతుడైనట్టి భగవంతుడా! ఇదే నా నమస్సుంజాలి! పైన చెప్పిన మొదటి ఐదు నామాలూ ఇహసాధనకు - ఆ పిదప మూడు నామాలూ పరసాధనకు తారక మంత్రాలవంటివి. ఇక...మానస పూజారాధకులకు అష్టపుష్పపూజ అనేది ఉన్నది. అష్టపుష్ప మానస పూజ: శ్లో. అహింసా ప్రథమం పుష్పం - పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత || శాంతి పుష్పం, తపః పుష్పం - ధ్యాన పుష్పం తథైవచ సత్య మష్టవిధం పుష్పం - శివ ప్రీతికరం భవేత్‌ || (శివా! ఈ పుష్పాష్టకంతో నీవు సంతృప్తుడవయ్యెదవు గాక! అహింస, ఇంద్రియచాపల్యరాహిత్యం, అన్ని ప్రాణుల పట్ల దయ, కష్ట నష్టాలను భరించగలిగే ఓర్పు, అన్నిటినీ సమానంగా చూసే నిర్మల శాంత గుణం, నిరంతర తపం, నిత్య ధ్యానం, నిజం చెప్పే గుణం...వీటితో నిన్ను మానసికారాధన చేయుదును.) అనగా - ఈ గుణాలు ఎవరిలో వుంటాయో వారు వేరే పూజలేవీ చేయనక్కర్లేదు. తమ గుణాలద్వారానే, శివపూజ వారు చేస్తున్నట్లేనని భావం! ద్యాన రీతులు : సర్వకాల సర్వావస్థలయందునూ శివ ధ్యానం చేస్తూండాలి. శివమూర్తులు ధ్యానపరంగా మూడు విధాలు - 1. ఘోరమూర్తి 2. మిశ్రమూర్తి 3. ప్రశాంతమూర్తి ఘోరమూర్తి ఆరాధన = తక్షణ ఫలప్రదం మిశ్రమూర్తి ఆరాధన = కొద్దికాలంలో ఫలవంతం ప్రశాంతమూర్తి ఆరాధన = అంత్యమున మోక్షప్రాప్తి. ఇక.. ధ్యానం 2 రకాలు. అవే సవిషయ నిర్విషయ పూర్వకాలు. సవిషయం = సాకారోపాసన నిర్విషయం = నిరాకారోపాసన రెండూ సక్రమ యోగ మార్గాలే.
25 likes
18 shares
PSV APPARAO
2K views
#ప్రదోషం - శివ పూజ ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని ప్రతీతి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏 #శివారాధన #శివ పూజ ఎప్పుడు చేయాలి 🕉️*ప్రదోష వ్రతం*🕉️ ప్రదోష వ్రతం సందర్భంగా... ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం. ప్రతి రోజూ సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల (రెండు గంటల 24 నిమిషాల) సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. ప్రదోష కాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని మహా ప్రదోషం అంటారు. మహా ప్రదోషం రోజున శివ భక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. రెండు త్రయోదశి తిథులలో (శుక్ల పక్షము మరియు కృష్ణ పక్షము) ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణ పక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు. ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళి లో చెప్పబడింది. ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు. ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు. ప్రదోష సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు. నందీశ్వరుడు నాలుగు వేదాలు, 64 కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ, వినయంతో వుండి, శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు. అందువల్ల నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం లభిస్తాయి. 🕉️త్రయోదశి మహా ప్రదోషం🕉️ ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషం అని, సోమవారం రోజు వస్తే దానిని సోమ ప్రదోషమనీ, మంగళవారం రోజు వస్తే దానిని భౌమ ప్రదోషమని, బుధవారం రోజు వస్తే దానిని బుధ ప్రదోషమని, గురువారం రోజు వస్తే దానిని గురు ప్రదోషమని, శుక్రవారం రోజు వస్తే దానిని శుక్ర ప్రదోషమని, శనివారం రోజు వస్తే దానిని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు. వీటిలో శుక్ల పక్షంలో వచ్చే సోమ ప్రదోషం, కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు. 🕉️ ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి? 🕉️ ప్రదోషం రోజు ఉదయమే స్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించాలి. శరీరంపై విభూతిని, రుద్రాక్షమాలను కూడా ధరించటం మంచిది. ఆ రోజులో వీలైనప్పుడల్లా పంచాక్షరి మంత్రాన్ని (ఓ నమ:శివాయ) జపం చేయాలి. ప్రదోషం రోజున నిశ్శబ్దంగా ఆరాధించటాన్ని శివుడు ఇష్టపడతాడని చెబుతారు. కఠిన ఉపవాసం చేయలేనివారు పండ్లు, పాలు లాంటివి తీసుకోవచ్చు. ఉడికించిన పదార్థాలను తీసుకోకూడదు. సాయంకాలం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షోడశోపచార పూజ జరపాలి. ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతి దీపారాధన, ఆవుపాలతో అభిషేకం అభిషేకం చేయటం, బిల్వ పత్రాలు మరియు శంఖుపూలతో అర్చించటం శ్రేయస్కరం. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రదోష కథను వినటంగానీ చదవటం గానీ చేయాలి. ఇంటిలో పూజ ముగించిన అనంతరం శివాలయాన్ని దర్శించాలి. వీలైనవారు ప్రదోష స్తోత్రం, శివ స్తోత్రములను కూడా పఠించాలి. *స్కంద పురాణంలో ప్రదోష మహత్య కథ కూడా వివరింపబడింది.* 🕉️ మహా మృత్యుంజయ మంత్రము🕉️ 🕉️ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ 🕉️శని ప్రదోషం🕉️ 🕉️దేవ దానవులు క్షీర సాగరాన్ని మధించినప్పుడు వెలువడిన హాలాహలం నుండి శివుడు ప్రపంచాన్ని రక్షించిన రోజుగా శనిప్రదోషం రోజును చెబుతారు. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమంగా పరిగణిస్తారు. 🕉️శని ప్రదోష వ్రతం ఆచరించటం వలన కర్మ దోషాలు, జాతక దోషాల నుండి విముక్తి పొందవచ్చునని చెబుతారు. వివాహ దోషాలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ రోజున ప్రదోష కాలంలో శివారాధన చేయాలి. గత జన్మల పాపాలు కూడా తొలగి సకలసంపదలు చేకూరుతాయి. శని ప్రదోషానికి సంబంధించి ఉజ్జయిని మహాకాళేశ్వరునికి సంబంధించిన కథ ఒకటి చెప్పబడినది. 🕉️సోమ ప్రదోషం🕉️ సోమవారము శివుడికి ప్రీతికరమైనది. కాబట్టి ఆ రోజున వచ్చే సోమ ప్రదోషమును ప్రశస్తమైనదిగా భావిస్తారు. ఈ రోజున ప్రదోష వ్రతము ఆచరించటం వలన మనసులోని మలినాలన్నీ తొలగిపోతాయి . 🕉️గురు ప్రదోషం🕉️ త్రయోదశీ ప్రదోషము గురువారము వస్తే ఆ రోజును గురు త్రయోదశిగా భావిస్తారు. గురు ప్రదోష పూజ వలన విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయని చెబుతారు. జాతకములో ఉండే గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా భావిస్తారు. #namashivaya777
21 likes
17 shares
PSV APPARAO
1K views
#శివారాధన #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాస శివరాత్రి ... విశిష్టత పరమశివునికి ఇష్టమైన రోజు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏 మాస శివరాత్రి అంటే ఏమిటి........!! ప్రతి చంద్రమాసంలో (నభోమాసంలో) కృష్ణ పక్షం చతుర్దశి తిథి వచ్చే రోజును మాస శివరాత్రి అంటారు. సంవత్సరంలో ఇలా 12 శివరాత్రులు వస్తాయి. వీటిలో ఫాల్గుణ మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ పర్వదినం శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ రోజున శివుడు భక్తులకు చాలా దగ్గరగా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ​మాస శివరాత్రి ప్రాముఖ్యత మరియు చేయవలసినవి........ ​ఈ రోజున భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తే పాపాలు నశిస్తాయి, పుణ్యం, ఆరోగ్యం, ఆయుష్షు మరియు శాంతి లభిస్తాయి. మహాశివరాత్రికి ముందు ప్రతి మాస శివరాత్రిని ఆచరిస్తే, శివానుగ్రహం మరింత బలంగా లభిస్తుందని నమ్మకం. ఈ పర్వదినాన చేయవలసిన కొన్ని ముఖ్యమైన క్రియలు: ​ఉపవాసం: ఈ రోజున ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయడం ఉత్తమం. కేవలం పాలు లేదా పండ్లను మాత్రమే తీసుకోవచ్చు. ​రాత్రి జాగరణ: శివుని స్మరణతో రాత్రంతా మెలకువగా ఉండాలి. ఈ సమయంలో శివ నామస్మరణ, శివ భజన లేదా శివపురాణం పారాయణం చేయాలి. ​లింగాభిషేకం: శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు బిల్వదళాలతో అభిషేకం చేయాలి. ​జపం, ధ్యానం: "ఓం నమః శివాయ" మంత్రాన్ని నిరంతరం జపిస్తూ, శివుని జ్యోతిర్లింగ స్వరూపాన్ని ధ్యానించాలి. ​దానం: పేదలకు భోజనం లేదా వస్త్రాలను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ​ఈ రోజు మనసులోని అహంకారం, కామం, క్రోధం వంటి అరషడ్వర్గాలను విడిచిపెట్టి, అంతా శివమయం అని భావించాలి. ​12 మాస శివరాత్రుల ప్రత్యేకతలు....... ​ప్రతి మాస శివరాత్రికి దానికంటూ ఒక ప్రత్యేక ఫలితం ఉంటుంది. ఇక్కడ వివరించిన విధంగా, ఒక్కో మాసంలో వచ్చే శివరాత్రి ఒక్కో ప్రయోజనాన్ని ఇస్తుంది: ​చైత్ర మాసం: విద్యాభివృద్ధి, బుద్ధి ప్రాప్తి. ​వైశాఖ మాసం: పాప పరిహారం, దీర్ఘాయుష్షు. ​జ్యేష్ఠ మాసం: ఆరోగ్యం, ధైర్యం. ​ఆషాఢ మాసం: ఆధ్యాత్మిక ప్రగతి, ధ్యాన శక్తి. ​శ్రావణ మాసం: కుటుంబ శాంతి, సుఖ సంపదలు. ​భాద్రపద మాసం: ధనప్రాప్తి, వృత్తిలో అభివృద్ధి. ​ఆశ్వయుజ మాసం: పుత్ర ప్రాప్తి, వంశవృద్ధి. ​కార్తీక మాసం: అజ్ఞానం తొలగి జ్ఞానం లభిస్తుంది. ​మార్గశిర మాసం: కోరికలు నెరవేరుతాయి. ​పుష్య మాసం: దైవ కృప, సద్గుణాలు. ​మాఘ మాసం: మోక్ష సాధనలో సహాయం. ​ఫాల్గుణ మాసం: పూర్వ జన్మ పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. ​ఈ క్రమంలో ప్రతి నెల శివారాధన చేయడం ద్వారా, జీవితం శాంతిమయంగా మారి, చివరికి మహాశివరాత్రి రోజున మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
12 likes
13 shares