ఆషాడ మాసం - ఆధ్యాత్మికతకు అనువైన మాసం
9 Posts • 2K views
PSV APPARAO
926 views 6 months ago
#ఆషాఢ అమావాస్య వైశిష్ట్యం 🌑🌒 #ఆషాడ మాసం - ఆధ్యాత్మికతకు అనువైన మాసం #ఆషాఢ అమావాస్య..పితృ అనుగ్రహానికి ఈ రోజు👈 #ఆషాఢ అమావాస్య / నక్షత్ర అమావాస్య / చుక్కల అమావాస్య 🌑🌒🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత ఆషాఢ అమావాస్య దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య అయిన ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా, వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట! ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ, మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి, ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఈ ఆషాఢ అమావాస్య రోజున గౌరీపూజ నోముని నోచుకుంటారట. ఈ వ్రతానికి ప్రధానదైవం గౌరీదేవి. తమ మాంగళ్యం కళకాలం నిలచి ఉండాలని గౌరమ్మను వేడుతారు. ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. ఆషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికీ, అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఆషాఢ అమావాస్య వైశిష్ట్యం : ఆషాఢ మాసపు అమావాస్య నక్షత్ర అమావాస్య, చుక్కల అమావాస్య. ఈ అమావాస్య నాడు దేవతలను ఒక్కసారి తలచినా, పూజించినా వేయి జన్మలు విడువకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది. పితృశ్రాద్ధం, దానం, హోమం చేస్తే అక్షయ ఫలం లభిస్తుంది. పితృదేవతలు సోమపథం అనే లోకంలో నివసిస్తుంటారు. వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు. వీరికి అగ్నిష్వాత్తులు అని పేరు. వీరి మానస పుత్రి పేరు అచ్ఛోద. ఈమె నదీ రూపంలో కూడా ప్రవహించేది. ఒకప్పుడు ఈమె వెయ్యి ఏళ్ళు స్త్రీ రూపంలో, తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తన తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకోమన్నారు. వారంతా మారు రూపాలలో, దివ్యరూపాలలో ఉన్నారు. అందులో ఒకాయన "మావసుడు". అచ్ఛోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది. తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది. కాని మావసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు. మావస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరు వచ్చింది. అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం. ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్యా తిథిని ఏర్పాటు చేసి ఆరోజు పితృ తర్పణాలు ఇచ్చే వారికి అనంత సుఖాలు ఇస్తామని వరాలిచ్చారు. అచ్ఛోద మానవ స్త్రీ అయిపోయి పితృదేవతలని కరుణించమని కోరగా, వారు ఇరువది ఎనిమిదవ ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్యగంధిగా, సత్యవతిగా పరాశరుడు వల్ల కృష్ణ ద్వైపాయన మునిని పుత్రునిగా పొంది, కన్యగానే ఉంటావనీ, శంతన పత్నివౌతావనీ, ఆపై వ్యాసుని వల్ల తరిస్తావని వరమిచ్చారు. ఆమెయే సత్యవతిగా జన్మించింది.
11 likes
8 shares
PSV APPARAO
8K views 6 months ago
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #దీప పూజ మంగళప్రదం 🪔🙏 #ఆషాఢ అమావాస్య..పితృ అనుగ్రహానికి ఈ రోజు👈 #ఆషాడ మాసం - ఆధ్యాత్మికతకు అనువైన మాసం #ఆషాఢ అమావాస్య వైశిష్ట్యం 🌑🌒 *దీపపూజ మంగళప్రదం* ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీప పూజ చేయడం కూడా కనిపిస్తుంది. పవిత్ర శ్రావణ మాసాన్ని స్వాగతించడానికి ఆషాఢ మాసం చివరి రోజైన అమావాస్యనాడు దీపపూజ జరుపుకుంటారు. ఆషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞావానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా కూడా దీపపూజని చేస్తారు. దీపపూజ జ్ఞానం ప్రసాదిస్తుంది, అష్టలక్ష్ముల ఆశీర్వాదాలు పొందడానికి తోడ్పడుతుందని శాస్త్ర వచనం. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలని శుభ్రంగా అలికి, వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపుకుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. కొందరు దీపాలను నదిలో వదులుతారు. పెద్దలు చెప్పిన ఈ సంప్రదాయాన్ని ఆచరించడం మంగళప్రదం. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
36 likes
57 shares
PSV APPARAO
671 views 7 months ago
#ఆషాఢ మాసం ప్రారంభం 🛕అనంత ఫలాలనిచ్చే ఆషాఢం 🔱🕉️🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఆషాడ మాసం - ఆధ్యాత్మికతకు అనువైన మాసం #ఆషాఢ మాసం ప్రత్యేకత *అమ్మపూజకు అనువు ఆషాఢం* జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది. చైత్ర పౌర్ణిమ రోజున చంద్ర సంచారము చిత్తానక్ష త్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్ర మాసమని, విశాఖ నక్షత్రమందు సంచరించుట వలన వైశాఖ మాసమని, ఇలా పన్నెండు మాసాల పౌర్ణిమలలో చంద్రుని సందారం ఆధారంగా పేర్లను నిర్ణయించారు. చంద్రుడు పౌర్ణిమ రోజున "పూర్వాషాఢ నక్షత్రములో సందరించే మాసం "ఆషాఢ మాసం". దీనిని శూన్యమాసమంటారు. అషాఢం నుండే దక్షిణాయనం, వర్డరు తువు ప్రారంభం అవుతాయి. సూర్యుడు కర్మా టర రాశిలోనికి ప్రవేశించడంతో ప్రారంభమయ్యే దక్షిణాయనం తిరిగి మకర రాశిగ తుడు కావడం వరకు ఆరు మాసాలు ఉంటుంది. సూర్యుడు భూమధ్యరేఖకు దక్షి ణంగా సందరిస్తాడు. దక్షిణాయనం పితృ కర్మ లకు ప్రీతికరం, ఉత్తరాయణం కన్నా దక్షిణా యనంలోనే పండుగలు, పబ్బాలు అధికం, ఆషాఢంలో ప్రధానంగా శుక్ల పక్ష విదియ నాడు 'జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథ యాత్రలు నిర్వహిస్తారు. "అషాఢ శుద్ధ పంచమ్యాం వచ్చెనె వృద్ధ గౌతమి అధవా తప్పిదారేణ ద్వాదశ్యామది తప్పదు" అని లోకోక్తి ఉంది. గోదావరి తీర వాసుల్లో పంచమి తప్పితే ద్వాదశికి గోదారి వరద రాగ లదని భావన. స్కంద పంచమి నాడు సుబ్ర హ్మణ్య స్వామిని ఆరాధించే దినంగా, కుమార షష్టిగా, భాను సప్తమిగా పర్వదినాలను అదరి స్తారు. దశమినాడు మహాలక్ష్మిని ఆరాదిస్తారు. ప్రధానంగా శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. 'మహా ఏకాదశిగా, ప్రథమైకాదశిగా, శయన ఏకాదశి'గా పిలువబడే ఈ దినం నాడు చాతుర్మాస దీక్షలు ప్రారంభిస్తారు. ఉత్తరాయణంలో పండుగలు, పబ్బాలు అధికం. అయితే దక్షిణాయనంలో ఆరోగ్య పరిరక్షణార్ధం నియమాలు ఎక్కువగా పాటిం చాల్సిన సమయంలో పూర్వీకులైన పెద్దలు వ్రతాలు, ఉత్సవాలు ఎక్కువ పెట్టారు. వాటికి బోణీ వంటిది తొలి ఏకాదశి. త్రైమూర్త్య స్వరూ పుడైన గురువులను పూజించే దినం 'గురు పూర్ణిమ' లేదా 'వ్యాస పూర్ణిమ', తెలంగాణలో ఆషాడంలో బోనాల పండువ జరుపుకోవడం అనాది నుండి వస్తున్నది. "భోజనానికి వికృతియైన బోనాన్ని' అమ్మ వారికి నివేదించడం గ్రామీణ ఆచారం. ప్రకృతి మార్పు వల్ల ఆరోగ్యానికి హాని చేకూర్చే వ్యాధుల నుండి కాపాడే అన్నం, బెల్లం, పెరుగు, పసుపునీళ్ళు, వేపాకులు బోనంలో చేరుస్తారు. రైతులు వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యే కాలమిది. విత్తడానికి అనువైన కాలమైనందున వైవాహిక జీవితం ద్యాస. నుండి మళ్ళించేందుకు అత్తవారింటికి అల్లుడు వెళ్ళ కూడదనే నియమం పెట్టారు.. అందుకే కొత్తగా వివాహాలైన నవ వధు వులు తల్లిగారిళ్ళలో నెల రోజులు ఉండే సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. స్నానం, దానం, జప, పారాయణాది సత్కర్మల ఆచరణకు యోగ్యమైన మాసం. గృహ నిర్మాణ అరంథాలకు శుభసూచక మైన మాసంగా చెప్పబడింది. ఆషాడంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే దృత్య రత్న పశు ప్రాప్తి కలుగునని మత్స్య పురాణం వివరిస్తు. న్నది. అషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు. పెట్టుకోవడం, ములగ కూర తినడం, అనప పప్పు వాడకాలు ఆచారాలుగా ఉన్నాయి. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
11 likes
14 shares