పవిత్ర ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం
7 Posts • 527 views
"#ఈ_ఏడాది_సంక్రాంతికి_రథసప్తమికి_మధ్య_కేవలం_11_రోజులే_సమయం_ఉంది.ఈ తక్కువ సమయంలోనే 13 వాయనాలు ఎలా పూర్తి చేయాలి? #సమయం_తక్కువగా_ఉన్నప్పుడు (సంక్రాంతి - రథసప్తమి మధ్య 11 రోజులే ఉంటే) ఏం చేయాలి? "ఈ ఏడాది సంక్రాంతికి, రథసప్తమికి మధ్య కేవలం 11 (సంక్రాంతి నుండి రధ సప్తమి కి ) రోజులే సమయం ఉంది. ఈ తక్కువ సమయంలోనే 13 వాయనాలు ఎలా పూర్తి చేయాలి? ఏ రోజులు శ్రేష్ఠం? పూర్తి వివరాలు ఈ పోస్ట్ లో తెలుసుకుందాము ..." 2026 క్యాలెండర్ ప్రకారం జనవరి 14న సంక్రాంతి మరియు జనవరి 25న రథసప్తమి వచ్చాయి. అంటే ఈ రెండింటి మధ్య కేవలం 11 రోజులు మాత్రమే సమయం ఉంది. సాధారణంగా సంక్రాంతి నోములు పట్టే వారు "రథసప్తమి లోపు వాయనాలు ఇచ్చేయాలి" అనే నియమం పాటిస్తారు. సమయం తక్కువగా ఉన్నప్పుడు కంగారు పడకుండా ఏమి చెయ్యాలో ఈ post ద్వారా తెలుసుకుందాము... 🤔 సమయం తక్కువగా ఉన్నప్పుడు (సంక్రాంతి - రథసప్తమి మధ్య 11 రోజులే ఉంటే) ఏం చేయాలి? ముందే నిర్ణయించుకోవడం (Planning) చేసుకోవాలి ఎందుకంటే..ఈసారి సమయం తక్కువగా ఉంది కాబట్టి, మీరు ఏ నోము పట్టాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన వస్తువులను (13 సంఖ్యలో) సంక్రాంతి కంటే ముందే సిద్ధం చేసి పెట్టుకోండి. 🌺 వాయనాలు ఎప్పుడు ఇవ్వాలి?:- ఈ 11 రోజుల్లో వచ్చే మంగళవారం (జనవరి 20) లేదా శుక్రవారం (జనవరి 16 & 23) వాయనాలు ఇవ్వడానికి అత్యంత శుభప్రదమైన రోజులు. ఒకే రోజు 13 మంది ముత్తైదువులను పిలవడం వీలుకాకపోతే, ఈ 11 రోజుల్లో రోజుకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున ఇచ్చి రథసప్తమి లోపు పూర్తి చేయవచ్చు. 👰‍♀️ కొత్తగా పెళ్లైన వారి కోసం (For Newlyweds):- కొత్తగా పెళ్లైన వారు నోములు పట్టేటప్పుడు సమయం తక్కువగా ఉందని కంగారు పడనవసరం లేదు. సంక్రాంతి రోజే నోము పట్టి (సంకల్పం చెప్పుకుని), ఆ రోజే కనీసం ఒకరికి వాయనం ఇచ్చి.. మిగిలినవి రథసప్తమి లోపు పూర్తి చేసినా చెల్లుతుంది. ✨ అత్యవసర పరిస్థితిలో:- ఒకవేళ రథసప్తమి లోపు 13 మందికి ఇవ్వడం అస్సలు కుదరకపోతే.. భైమీ ఏకాదశి (లేదా జయ ఏకాదశి) (జనవరి 29) వరకు కూడా సమయం తీసుకోవచ్చని కొందరు పండితులు చెబుతుంటారు. కానీ రథసప్తమి లోపు పూర్తి చేయడం ఉత్తమం. 🍃 "13 మందికి వాయనం ఎందుకు ఇవ్వాలి?" మన పురాణాల ప్రకారం 13 సంఖ్యకు సంక్రాంతి నోముల్లో ఒక విశిష్టత ఉంది. ✨ ద్వాదశ మాసాలు + మైల మాసం:- ఏడాదికి 12 నెలలు. కానీ ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి వచ్చే 'అధిక మాసం' (మల మాసం) తో కలిపి మొత్తం 13 నెలలుగా పరిగణించి, ఏడాది పొడవునా ఆ దైవ కృప ఉండాలని 13 మందికి వాయనం ఇస్తారు. ✨ 13 మంది ముత్తైదువులను పూజించడం అంటే 13 రకాల లక్ష్మీ కళలను ఇంట్లోకి ఆహ్వానించడం అని అర్థం. 🌺 ఈ సంక్రాంతి నోముల ప్రాముఖ్యత తెలుసుకోండి! సంక్రాంతి (ముఖ్యంగా మకర సంక్రాంతి) నుండి రథసప్తమి వరకు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, పిల్లల చదువుల కోసం చేసే వ్రతాలనే 'నోములు' అంటారు. ఈ సమయంలో చేసే దానాలకు అనంతమైన ఫలితం ఉంటుంది. ఈసారి (2026) సంక్రాంతి మరియు రథసప్తమి మధ్య కేవలం 11 రోజులే ఉంది కాబట్టి, ముత్తైదువులకు వాయనాలు ఇవ్వడానికి ఈ రోజులే శ్రేష్ఠం. సంక్రాంతి సమయంలో చేసే "నోములు" కేవలం ఆచారాలు మాత్రమే కాదు, అవి స్త్రీల సౌభాగ్యాన్ని, ఇంటి సంతోషాన్ని పెంచే అద్భుతమైన మార్గాలు. ఈ పుణ్యకాలంలో చేసే దానాలకు అనంతమైన ఫలితం ఉంటుంది. "నోము అంటే కేవలం వస్తువులు ఇవ్వడం కాదు, అవతలి వారిని అమ్మవారి రూపంగా భావించి గౌరవంగా సమర్పించడం." ఈ సంక్రాంతి మీ ఇంట ఆనందాలను నింపాలని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ... 🌾🎉 🌾 మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు! 💐 🎋 Happy Sankranthi! 🌞 #ఉత్తరాయణం #పవిత్ర ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁 #✨సంక్రాంతి స్టేటస్🌾 #తెలుసుకుందాం
13 likes
13 shares
మకర సంక్రాంతి విశిష్టత: 🪁🪁🪁🪁🪁🪁🪁🪁 సాధారణంగా పండగలు అన్నీ తిథిని బట్టే వస్తాయి. కానీ తిథితో ఎలాంటి సంబంధం లేకుండా సౌరమానం ప్రకారం వచ్చే పండుగ సంక్రాంతి. అలాగే సంక్రాంతి పండుగ మరో విశిష్టత ఏమిటంటే.. సాధారణంగా మన పండగలు బాగా గమనిస్తే ఆధ్యాత్మికం, కుటుంబం, సామాజికం ఇలా మూడూ అంశాలు ఇమిడి ఉంటాయి. కానీ సంక్రాంతికి మాత్రం కుటుంబ ప్రాధాన్యతే ప్రప్రథమం. తర్వాతే మిగిలినవి. మన సంస్కృతీ సంప్రదాయాలకు కీలకమైన కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇంటిల్లి పాదినీ ఏకం చేసే పండగ సంక్రాంతి అందుకే విద్య, ఉద్యోగాల రీత్యా ఎక్కడ ఉన్నా కుటుంబ సభ్యులందరినీ ఒక చోటుకు చేరుస్తుంది ఈ సంక్రాంతి పండుగ. మకర రాశిలోకి సూర్యుని గమనం మకర సంక్రాంతి పర్వదిన ఆగమనం తెలుగు వారి సంస్కృతిని తెలిపే ప్రత్యేక పర్వదినం చెడు నుంచి మంచి వైపునకు అశాంతి నుంచి శాంతి వైపునకు అవిశ్వాసం నుంచి విశ్వాసం వైపునకు అపనమ్మకం నుంచి నమ్మకం వైపునకు స్వార్థం నుంచి నిస్వార్ధం వైపునకు అవినీతి నుంచి నీతి నిజాయితీల వైపునకు నాది అనే స్వరం నుంచి మనది అనే స్వరం వైపునకు మనిషి మనసు పరివర్తనతో పరుగిడిన నాడు ఆరంభమౌతుంది జీవన సంక్రమణం జరిగితీరుతుంది లోక కళ్యాణం అదే మకర సంక్రమణం పరమార్థం తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులూ ప్రతి ఇల్లూ కొత్త అల్లుళ్లతో బంధుమిత్రులతో కళకళలాడతూ ఉంటాయి. ఈ సంక్రాంతిలో సం అంటే మిక్కిలి క్రాంతి అంటే అభ్యుదయం అని అర్థం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కాబట్టి దీనిని సంక్రాంతిగా పెద్దలు చెబుతుంటారు. అలాగే సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం కూడా చెబుతారు. ఇక సూర్యుడు ప్రత్యక్ష దైవం. అన్ని జీవరాశులకు ఆలంబన అందించే అద్భుతమైన తేజో రాశి. ఖగోళశాస్త్రం సూర్యుడిని స్థిరతారగా గుర్తించి అన్నీ గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తాయని ఋజువు చేసిన విషయం తెలిసిందే. అయితే మనకున్నవి 12 రాశులు. సూర్యుడు నెలకొక రాశిలో సంచరించి నిర్దిష్ట సమయం కాగానే మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. అలా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమించడాన్నే మకర సంక్రమణం అంటారు. ఆరోజున జరుపుకునే పండుగను మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ఉత్తర దిక్కు ప్రయాణాన్ని సూచిస్తుంది. ఈ ప్రయాణాన్నే ఆయనం అంటారు. ఉత్తర దిశలో ప్రయాణిస్తాడు కాబట్టి ఉత్తరాయణం అంటారు. ఈ ఉత్తరాయణం చాలా పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. పుష్య మాసంలో.. హేమంత ఋతువులో.. శీతల గాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతి పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతియేటా ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున అంటే 2026 జనవరి 14వ తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. కానీ జనవరి 15వ తేదీన పండుగ చేసుకోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈరోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణోక్తి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు కాబట్టి దీనిని రైతుల పండుగగా కూడా అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. నిజానికి ధనుర్మాసం ప్రారంభంతో నెల రోజులు సాధారణంగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులు పల్లెలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా కళకళలాడుతూ ఉంటాయి. బుడబుక్కలోళ్లు, పగటి వేషధారులు, జానపద వినోద కళాకారులు వస్తుంటారు. సంక్రాంతి పండుగకు సుమారు నెల రోజుల ముందు నుంచే రోజూ ఇళ్ల ముంగిటి రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. పండుగ వేళ ముగ్గులు వేయడానికి బియ్యపు పిండిని వినియోగిస్తారు. కల్లం నుంచి ఎడ్ల బండి మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగి రోజు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆరోజు సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు అత్తవారింటికి తప్పకుండా వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటూ ఉంటాడు. కోడి పందేలు, ఎడ్ల బళ్ల పందేలు, బండ లాగుడు పోటీలు, ముగ్గుల పోటీలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే అంశాలు. దానధర్మాలు ఎంతో శ్రేష్టం ఉత్తరాయణం పుణ్యకాలంలో వచ్చే సంక్రాంతి రోజున చేసే దానధర్మాలు శ్రేష్టమైనవని పండితులు చెబుతారు. వారి వారి స్థోమతకు తగ్గట్టు ధాన్యం, పండ్లు, విసనకర్ర, వస్త్రాలు, కాయగూరలు, గోధుమలు, నువ్వులు, చెరకు వంటివి దానం చేస్తారు. ఇవి కాకుండా సంక్రాంతి సమయంలో చేసే గోదానం వల్ల స్వర్గ ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఇక సంక్రాంతి రోజున పాలు పొంగించి సూర్యారాధన చేస్తారు. అలాగే పితృ దేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృ తర్పణాలు వదలాల్సి ఉంటుంది. కానీ మిగతా 11 సంక్రమణాలకు తర్పణాలు విడవకపోయినా మకర సంక్రమణం రోజు మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు విడుస్తారు. #ఉత్తరాయణం #పవిత్ర ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం #✨సంక్రాంతి స్టేటస్🌾 #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁
10 likes
11 shares