ముత్యపు పందిరి వాహనం పై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప స్వామి🙏
2 Posts • 190 views
PSV APPARAO
478 views 7 days ago
#తిరుమల శ్రీ వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు 🕉️ శ్రీవారి వాహన సేవలు🔯 భక్తీ ముక్తిదాయకం 🙏 #ముత్యపు పందిరి వాహనం పై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప స్వామి🙏 #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS 👆 *ముత్యపు పందిరి వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప* తిరుమల, 2025 సెప్టెంబరు 26: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్ర‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో  దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు. *ముత్యపుపందిరి వాహనం* శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళి కృష్ణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
11 likes
14 shares
PSV APPARAO
646 views 7 days ago
#అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవాలు #ముత్యపు పందిరి వాహనం పై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప స్వామి🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 👆 *ముత్యపు పందిరి వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప* తిరుమల, 2025 సెప్టెంబరు 26: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్ర‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో  దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు. *ముత్యపుపందిరి వాహనం* శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళి కృష్ణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
8 likes
12 shares
DieticianAnkitaYadav
1K views 6 hours ago
खाणं बंद नाही, पण वजन कमी होणारच! २ महिन्यांत १० किलो वजन घटवा… क्लास जुलैपासून सुरू! "हो" लिहा आणि सीट बुक करा.https://api.whatsapp.com/send?phone=916306939892&text=Hi%20wellness%20coach%29 ##weightlosstea #weightlosschallenge #weightlossjourney #onlinemarketing #weightlosstips 🎋🎋🎋🌾🌾
12 likes
11 shares