శ్రావణమాసం
127 Posts • 179K views
PSV APPARAO
646 views 1 months ago
#శ్రావణ పొలాల అమావాస్య వ్రతం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రావణమాసం విశిష్టత #పోలాల అమావాస్య శుభాకాంక్షలు #శ్రావణమాసం *పోలాల అమావాస్య వ్రతం....* *వ్రతములు కేవలం స్రీలకు మాత్రమే నిర్దేశించబడినవి. ఎందుకంటే..,స్త్రీలకు, బ్రాహ్మణేతర స్త్రీలకు వేదాధ్యయన అధికార యోగ్యతను మన ప్రాచీన ఋషులు ఇవ్వలేదు. అందుకు చాలా కారణాలున్నాయి. అవి ప్రస్తుతం మనకు అప్రస్తుతం. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. మంగళగౌరీదేవి వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్య సంపద కోసం నిర్ధేశించబడినదైతే. ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.* *వ్రత కథ:* *పూర్వం పిల్లలమఱ్ఱి అనే గ్రామంలో సంతానరామావధానులు అనే స్మార్తపండితుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయి, కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్దకోడళ్ళు* *ఆరుగురికీ పిల్లలు పుట్టారు గానీ, చిన్నకోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూండడం జరిగేది. అలా ఆరుసార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికీ ఆ ఆరు సంవత్సరాలూ ‘పోలాల అమావాస్య వ్రతం’ చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈ సారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్దకొడళ్ళు నిర్ణయించుకున్నారు.* *సరిగ్గా శ్రావణ అమావాస్యనాడు సుగుణకు ప్రసవమై, మృతశిశువును కంది. ఈ సంగతి తోటికోడళ్ళకు తెలిప్తే తనను వ్రతానికి పిలవరని తలచి, చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి, ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలమూట వుంచి తన తోటికోడళ్ళతో కలిసి ‘పోలాల అమావాస్య వ్రతాన్ని’ ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో స్మశానానికి వచ్చి, గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని, కన్నీరు మున్నీరుగా విలపించ సాగింది. అప్పటికి బాగా చీకటి పడింది.* *ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలు దేరిన పోలాలమ్మదేవి, సుగుణ దగ్గరకు వచ్చి ‘ఎందుకు రోదిస్తున్నావు’ అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, ‘ సుగుణా.., బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి, ఏ పేర్లయితే నీ పిల్లలకు పెట్టాలను కున్నావో ఆ పేర్లతో వారిని పిలు’ అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుత దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరుపేరునా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని, వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్ళకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ, పిల్లా,పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి, తరించింది.* *వ్రత విధానం:* *ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట గోమయంతో అలికి, వరిపిండితో అందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను అక్కడ వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి, ఆ తర్వాత ఆ కందమొక్క లోకి మంగళగౌరీదేవిని గానీ, సంతానలక్ష్మీదేవిని గానీ ఆవాహన చేసి, షోడశోపచారాలతో అర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి.* *ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. అలా చేస్తే.., ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. కనుక మాతృత్త్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన, సౌభాగ్యాలు పొందాలని కోరుచున్నాను.*🙏 ❀꧁మాత్రేనమః꧂❀ https://whatsapp.com/channel/0029Va7BbRz1yT2Fey0AlP0J/505
7 likes
12 shares
PSV APPARAO
812 views 1 months ago
#అమావాస్య విశేషం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రావణమాసం #శ్రావణమాసం విశిష్టత #పోలాల అమావాస్య శుభాకాంక్షలు *పోలాల అమావాస్య* *ఆగస్టు 23 శనివారం అమావాస్య సందర్భంగా...* కేవలం వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ పిల్లలకు అపమృత్యుభయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందేలా చేసే పర్వదినం పోలాల అమావాస్య. పోలేరమ్మ అమ్మవారు గ్రామ దేవత. దాదాపు ప్రతి ఊరి పొలిమేర్లలో అమ్మవారు కొలువుదీరి పూజలందుకుంటూ ఉంటుంది. పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందనీ, సంతానం కలిగిన వారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజస్తూ వ్రతం చేసే పర్వదినమే పోలాల అమావాస్య. శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య "పోలాల అమావాస్య". దీనికే 'పోలా అమావాస్య', 'పోలాలమావాస్య', 'పోలాంబవ్రతం' వంటి పేర్లు కూడా ఉన్నాయి. పోలాల అమావాస్య ఆచరణ వెనుక ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఏడుగురు కుమారులు కలిగారు. యుక్త వయస్సు రాగానే వారందరికీ వివాహాలు చేశారు. వారికి సంతానం కూడా కలిగింది. గ్రామంలో విడివిడిగా నివసించసాగారు. తమ సంతానం బాగా ఉండాలంటే 'పోలాంబ' అమ్మవారిని శ్రావణమాసంలో అమావాస్యనాడు పూజిస్తూ వ్రతం చేయాలని విన్న ఆ ఏడుమంది శ్రావణమాసం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణమాసం వచ్చింది. అనేక వ్రతాలు ఆచరించారు. చివరి రోజు అయిన అమావాస్యనాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వ్రతం రోజు ఉదయాన్నే ఏడవ కోడలి కుమారుడు మరణించాడు. అందువల్ల వ్రతం చేయలేకపోయారు. మరుసటి సంవత్సరం వ్రతం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ఆ సంవత్సరమూ ఏడవ కోడలి మరో బిడ్డ మరణించింది. దీనితో వ్రతం చేయలేక పోయారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం... ఆ రోజు ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం వ్రతం చేయలేకపోవడం.. ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది. మిగతా ఆరుమంది. కోడళ్ళు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూవుంది అని తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడలేని దుఃఖం కలుగుతూ ఉండేది. మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదవ సంవత్సరం వ్రతానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలుస్తే అందరూ నిందిస్తారని, వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని, కోప్పడతారని భయపడ్డ ఆమె తన బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా... చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంటిలోవుంచి తోడి కోడళ్ళతో కలిసి వ్రతంలో పాల్గొంది. అందరూ ఆనందంలో వ్రతం చేస్తూవున్నా... తాను మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంది. రాత్రి వరకూ అలాగే గడిచింది. చీకటి పడి గ్రామం సద్దుమణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరలో ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుని, గుడిముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి, తన పరిస్థితిని తలుచుకుని దుఃఖించ సాగింది. ఇట్టిస్థితిలో పోలేరమ్మ అమ్మవారు గ్రామసంచారం ముగించుకుని అక్కడికి చేరుకుని ఆమెను చూసి, ఆ సమయంలో ఏడుస్తూ తన వద్ద కూర్చునడానికి కారణం అడిగింది. దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది. వీటన్నింటిని విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు ఇచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలువమని చెప్పింది. ఏడవ కోడలు అదేవిధంగా చేసింది. ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్రనుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు. వారందరినీ తీసుకుని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది. మరునాడు ఉదయం గ్రామంలోని వారందరకూ ఈ విషయం వివరించింది. అందరూ సంతోషించారు. అంతేకాకుండా అప్పటినుంచీ అందరూ ప్రతి సంవత్సరం వ్రతం చేయడం ప్రారంభించినట్లు కధనం. వ్రతం రోజు తెల్లవారుఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకుని మహిళలు తమ పిల్లలను వెంటబెట్టుకుని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి ఇంటికి చేరుకుని వ్రతం చేయవలెను. పసుపుతో పోలేరమ్మను చేసుకుని పూజ చేయదలచిన చోట ఏర్పాటు చేసుకున్న పీఠంపై బియ్యంపోసి దానిపైన ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత అమ్మవారిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించాలి. సాధారణంగా గౌరీదేవిని పూజచేస్తారు. పూజ ముగించిన తర్వాత పసుపు రాసిన దారానికి పసుపు కొమ్మును కట్టి 'తోరము' తయారు చేసుకుని పూలతో పూజించాలి. తోరమును ఒక దానిని అమ్మవారికి సమర్పించాలి. మిగతా తోరములను పిల్లల మెడలో వేయాలి. తర్వాత 'పెరుగన్నము' నైవేద్యంగా సమర్పించడంతోపాటూ ఆ రోజు దానినే ఆహారంగా స్వీకరించాలి. తిరిగి సాయంత్రం, మరునాడు పూజచేసి వ్రతం ముగించాలి. ఈ విధంగా వ్రతం ఆచరించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని శాస్త్ర వచనం. #namashivaya777
11 likes
12 shares