walking
83 Posts • 50K views
1 నడకకు కాలంతో కాదు, కేవలం కాళ్లతోనే పని! 2 కాళ్లు కష్టపడితే, దేహం సుఖపడుతుంది! 3 మీ పాదాలు ముందడుగు వేస్తే... రోగం వెనుకంజ వేయక తప్పదు! 4 నడక ఆరోగ్యాన్నే కాదు, మన పరిచయాల పరిధినీ పెంచుతుంది. 5 కాళ్లు రోడ్డుపై పడితే... దేహానికి బరువు తేలిక! 6 నవ్వుతూ నడవండి; సుదీర్ఘంగా జీవించండి! 7 ఆయుష్షు పెరగాలంటే, వాహనాలపై కాదు... కాళ్లపై ప్రయాణం కావాలి! 8 కలిసి నడుద్దాం, మన కష్టాలను మరుద్దాం! 9 మీ కాళ్లు రోడ్డున పడితే, జబ్బులన్నీ దిగాలు పడతాయి! 10 రోగానికి లింగభేదం లేదు, వయోభేదం లేదు, కులమతాల రిజర్వేషన్లూ లేవు! నడకకూ అంతే! 11 ఉదయపు నడకకు రారండి! ఉచితంగా విటమిన్ 'డి'ని పొందండి! 12 'Stay Fit' (ఆరోగ్యంగా ఉండాలంటే)... 'Walk a Bit' (కొంత నడవండి)! 13 ప్రతిరోజు సుదీర్ఘ నడక... వైద్యుడిని దూరంగా ఉంచుతుంది! (Long walk everyday, keeps the medicine away!) 14 మీ కాళ్లు రోడ్డెక్కితే... రోగాలు అటకెక్కినట్లే! చివరి అద్భుతమైన సందేశం: "నడక... ఆరోగ్యానికి అమ్మతో సమానం!" (WALKING is the Mother of Health) #తెలుసుకుందాం #walking
9 likes
14 shares