#దసరా నవరాత్రులు దేవీ అవతారం విశిష్టత #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు
🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #📖నవరాత్రి కథలు📚
2025 దసరా దుర్గ నవరాత్రులలో మొదటిరోజు శ్రీ బాలాత్రిపురసుందరి దేవి అమ్మ అలంకారణ.
అమ్మవారి అలంకారణ : నేడు అమ్మవారిని శ్రీ బాలా త్రిపురసుందరి దేవిగా అలంకరించాలి.
అమ్మ చీర రంగు : లేత ఆకుపచ్చ శారీ, గులాబిరంగు చీర, ఆరెంజ్ రంగు చీర.
నైవేద్యం : కట్టె పొంగలి
పారాయణం : శ్రీ బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి
బాల్యం దైవత్వంతో సమానమని, ఈ బాల రూపం తర్వాతనే వేరు వేరు కథలు వేరు వేరు రూపాలు అన్నీ వస్తాయి. సంతానం లేనివారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది. అందరిలోను దైవాన్ని చూసే భారతీయ సంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సంప్రదాయం ఈ నవరాత్రుల ప్రారంభం రోజులో మనకు కన్పిస్తుంది. అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా చిన్న శక్తినుంచి పెద్ద శక్తివరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాలలో బాలాత్రిపురసుందరి ఆరాధన అవుతుంది.
అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. బాలా త్రిపుర సుందరిదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడశ విద్యకు ఈమే అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము.
త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ , అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్త్, స్వప్న, సుషుప్తి. ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత. ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తు బాలగా అమ్మవారు వినోదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.
శ్రీ బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి :
ఓం కల్యాణ్యై నమః ।
ఓం త్రిపురాయై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం త్రిపురసున్దర్యై నమః ।
ఓం సున్దర్యై నమః ।
ఓం సౌభాగ్యవత్యై నమః ।
ఓం క్లీంకార్యై నమః ।
ఓం సర్వమఙ్గలాయై నమః ।
ఓం హ్రీంకార్యై నమః ।
ఓం స్కన్దజనన్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం పఞ్చదశాక్షర్యై నమః ।
ఓం త్రిలోక్యై నమః ।
ఓం మోహనాధీశాయై నమః ।
ఓం సర్వేశ్వర్యై నమః ।
ఓం సర్వరూపిణ్యై నమః ।
ఓం సర్వసఙ్క్షోభిణ్యై నమః ।
ఓం పూర్ణాయై నమః ।
ఓం నవముద్రేశ్వర్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం అనఙ్గకుసుమాయై నమః ।
ఓం ఖ్యాతాయై నమః ।
ఓం అనఙ్గాయై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం జప్యాయై నమః ।
ఓం స్తవ్యాయై నమః ।
ఓం శ్రుత్యై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం నిత్యక్లిన్నాయై నమః ।
ఓం అమృతోద్భవాయై నమః ।
ఓం మోహిన్యై నమః ।
ఓం పరమాయై నమః ।
ఓం ఆనన్దాయై నమః ।
ఓం కామేశ్యై నమః ।
ఓం కలాయై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం పద్మరాగకిరీటిన్యై నమః ।
ఓం సౌగన్ధిన్యై నమః ।
ఓం సరిద్వేణ్యై నమః ।
ఓం మంత్రిన్త్రిణ్యై నమః ।
ఓం మన్త్రరూపిణ్యై నమః ।
ఓం తత్త్వత్రయ్యై నమః ।
ఓం తత్త్వమయ్యై నమః ।
ఓం సిద్ధాయై నమః ।
ఓం త్రిపురవాసిన్యై నమః ।
ఓం శ్రియై నమః ।
ఓం మత్యై నమః ।
ఓం మహాదేవ్యై నమః ।
ఓం కౌలిన్యై నమః ।
ఓం పరదేవతాయై నమః ।
ఓం కైవల్యరేఖాయై నమః ।
ఓం వశిన్యై నమః ।
ఓం సర్వేశ్యై నమః ।
ఓం సర్వమాతృకాయై నమః ।
ఓం విష్ణుస్వస్రే నమః ।
ఓం దేవమాత్రే నమః ।
ఓం సర్వసమ్పత్ప్రదాయిన్యై నమః ।
ఓం కింకర్యై నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం గీర్వాణ్యై నమః ।
ఓం సురాపానానుమోదిన్యై నమః ।
ఓం ఆధారాయై నమః ।
ఓం హితపత్నికాయై నమః ।
ఓం స్వాధిష్ఠానసమాశ్రయాయై నమః ।
ఓం అనాహతాబ్జనిలయాయై నమః ।
ఓం మణిపూరసమాశ్రయాయై నమః ।
ఓం ఆజ్ఞాయై నమః ।
ఓం పద్మాసనాసీనాయై నమః ।
ఓం విశుద్ధస్థలసంస్థితాయై నమః ।
ఓం అష్టాత్రింశత్కలామూర్త్యై నమః ।
ఓం సుషుమ్నాయై నమః ।
ఓం చారుమధ్యమాయై నమః ।
ఓం యోగేశ్వర్యై నమః ।
ఓం మునిధ్యేయాయై నమః ।
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ।
ఓం చతుర్భుజాయై నమః ।
ఓం చన్ద్రచూడాయై నమః ।
ఓం పురాణాగమరూపిణ్యై నమః ।
ఓం ఐంకారవిద్యాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం ఐంకారాదిమహావిద్యాయై నమః
ఓం పంచ ప్రణవరూపిణ్యై నమః ।
ఓం భూతేశ్వర్యై నమః ।
ఓం భూతమయ్యై నమః ।
ఓం పఞ్చాశద్వర్ణరూపిణ్యై నమః ।
ఓం షోఢాన్యాసమహాభూషాయై నమః ।
ఓం కామాక్ష్యై నమః ।
ఓం దశమాతృకాయై నమః ।
ఓం ఆధారశక్త్యై నమః ।
ఓం తరుణ్యై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం త్రిపురభైరవ్యై నమః ।
ఓం శాంభవ్యై నమః ।
ఓం సచ్చిదానంద దాయై నమః ।
ఓం సచ్చిదానందరూపిణ్యై నమః ।
ఓం మాంగళ్యదాయిన్యై నమః ।
ఓం మాన్యాయై నమః ।
ఓం సర్వ మంగళ కారిణ్యై నమః ।
ఓం యోగలక్ష్మ్యై నమః ।
ఓం భోగలక్ష్మ్యై నమః ।
ఓం రాజ్యలక్ష్మ్యై నమః ।
ఓం త్రికోణగాయై నమః ।
ఓం సర్వసౌభాగ్యసంపన్నాయై నమః ।
ఓం సర్వసమ్పత్తిదాయిన్యై నమః ।
ఓం నవకోణపురావాసాయై నమః ।
ఓం బిందుత్రయసమన్వితాయై నమః ।
ఇతి శ్రీ బాలాత్రిపురసుందరి అష్టోత్తర శతనామావళీ సంపూర్ణం.
బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే
కామేశ్వర్యై చ ధీమహి తన్నోబాలా ప్రచోదయాత్ ||
లోకా సమస్తా సుఖినోభవంతు.
#namashivaya777