ఏకాదశి
205 Posts • 245K views
ఇందిరా ఏకాదశి : ఇందిరా ఏకాదశినాడు ఉపవాసం, జాగరణ చేసినట్లయితే పితృదేవతలు తరిస్తారు. అశ్వమేధయాగంతో సమానమైన ఫలం కలిగిన ఏకాదశి ఇది. సత్యయుగంలో మాహిష్మతీ రాజ్యాన్ని ఇంద్రసేనుడనే మహారాజు పాలించేవాడు. ధనధాన్య, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగిన ఆయన విష్ణుభక్తుడు. ఒకసారి నారద మహర్షి ఆయనకు దర్శనమిచ్చి, యమలోకంలో బాధలు పడుతున్న ఇంద్రసేనుని పితరులను గురించి తెలియచేశాడు. అప్పుడు ఇందిరా ఏకాదశి వ్రతం చేయడం ద్వారా ఇంద్రసేనుడు తన పితరులకు సద్గతులు కలిగించాడు. సాధారణంగా ఏకాదశీ వ్రతవిధానంలో ఉపవాస, జాగరణలుంటాయి. ద్వాదశి ఘడియలు ముగియకముందే అన్నసంతర్పణ చేసి, ఆ తరువాత భోజనం చేయాలి. అయితే ఇందిరా ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశినాడు మాత్రం పితృతర్పణం, పిండప్రదానం కూడా విధిగా చేయాలి. __________________________________________ #📅 చరిత్రలో ఈ రోజు #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #ఏకాదశి #ఏకాదశి శుభాకాంక్షలు
21 likes
16 shares
PSV APPARAO
700 views 28 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: పార్శ్వ ఏకాదశి / పరివర్తిని ఏకాదశి / వామన ఏకాదశి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #భాద్రపద మాస విశిష్టత 🔱🕉️🙏 #భాద్రపద మాసంలో ముఖ్యమైన పర్వదినాలు 🔱🕉️🙏 #ఏకాదశి *ఈ రోజు పరివర్తన ఏకాదశి, వామన ఏకాదశి* భాద్రపద మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన ఏకాదశికి మన ప్రకృతిలో వచ్చే మార్పులకు సంభందించినదిగా పరిగణిస్తారు. కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజ చేస్తే కలుగు ఫలం లభిస్తుందని పురాణాలూ చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే వామన జయంతి. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకం. శ్రీమహావిష్ణువు అది శేషుపైన శయనించి దక్షిణాయనంలో విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకో వైపు శాయనిస్తాడు అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది. పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది. ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో "దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి తనకి శుభము చేకూర్చెదనని" పలికి అదృశ్యమవుతాడు. ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను. ఒక విధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు. అట్టి మాయా బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై... వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. "వామనుడు మూడు పాదముల భూమి"ని అడిగెను. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. #namashivaya777
18 likes
16 shares