భాద్రపద మాసంలో ముఖ్యమైన పర్వదినాలు 🔱🕉️🙏
9 Posts • 602 views
PSV APPARAO
603 views 4 months ago
#ఉమా మహేశ్వర వ్రతం పూజ చేయలేకపోయినా ఈ కథ వినండి ఎంతో పుణ్యం లభిస్తుంది, ఓం నమశ్శివాయ 🙏🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: భాద్రపద పూర్ణిమ / ఉమా మహేశ్వర్ వ్రతం ప్రాముఖ్యత #భాద్రపద మాసంలో ముఖ్యమైన పర్వదినాలు 🔱🕉️🙏 *ఉమా మహేశ్వర వ్రతం* *సెప్టెంబర్ 07 ఉమా మహేశ్వర వ్రతం* స్కంధ పురాణంలో ప్రస్తావించిన సవిత్ర వ్రతం ఉమా మహేశ్వర వ్రతం శివపార్వతులను ఆరాధించే పుణ్యదానం ఇది. వైవాహిక ఆనందం కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. ఉమామహేశ్వర వ్రతం భాద్రపద మాసంలో పూర్ణిమ రోజున. ఆచరిస్తారు. కొంతమంది, కొన్ని ప్రాంతాలవారు కార్తీక మాసంలో ఈ వ్రతం ఆచరిస్తారు. పూర్వం ఈ వ్రతం సంవత్సరానికి ఒకసారి 12 సంవత్సరాల పాటు పాటించేవారు. శివ పార్వతుల లోహ విగ్రహాన్ని తయారు వేయించి ఈ రోజున పూజిస్తారు. పన్నెండు సంవత్సరాల పాటు భక్తితో పూజించిన తరువాత చివరి సంవత్సరంలో లోహ మూర్తిని ఏదైనా శివాలయానికి విరాళంగా అందజేస్తారు. ఉమా మహేశ్వర వ్రతం ఆచరించేవారు ఆ రోజున వేకువనే నిద్ర లేవాలి. నిత్యకృత్యాలు ముగించుకుని వెండి లేదా బంగారంతో చేసిన ఉమా మహేశ్వర మూర్తిని నిష్టతో పూజించాలి. భగవంతునికి రకరకాల పవిత్రమైన నైవేద్యాలు సమర్పిస్తారు. తరువాత ఉమామహేశ్వర విగ్రహానికి పంచ్మృతాలతో, ఇతర పదార్థాలతో అభిషేకం చేయాలి. వ్రత కర్తలు రోజంతా ఉపవాసం ఉండాలి. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో, ఇతర భక్తులతో పంచుకోవాలి. రోజంతా పరమశివుని స్మరణలోనే గడపాలి. రోజంతా అంకితభావంతో 'ఓం నమః శివాయ మంత్రం జపించాలి. మరుసటి రోజు తమ పూర్వీకులను పూజించాలి. పరమశివుడు దయాళువు, పార్వతి దయమయి నిరంతరం వారిని తలచుకునే భక్తులను వారు రక్షిస్తారు. సమృద్ధిగా వారికి శ్రేయస్సు అనుగ్రహిస్తారు. వారిని ఆరాధించేవారికి నవగ్రహాల చెడు ప్రభావం ఉండదు. వారి నామాలు జపిస్తే నవగ్రహ దోషాల వల్ల కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి. వ్రతం ప్రారంభించే ముందు గణపతి, నవగ్రహాలు: అష్టదిక్పాలకులకు నమస్కరించాలి. ఆ తర్వాత మీరు మీ పేరు. కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం మీ మనసులో చెప్పుకోవాలి పార్వతీ దేవి, మహేశ్వర అష్టోత్తరం చదవాలి అధంగ పూజ తర్వాత వ్రత కథలను చదివి, చివరకు నైవేద్యంగా పండ్లను సమర్పించాంలి. భార్యభర్తలు కలిసి వ్రతం చేయడానికి వీలుపడనివారు ఇద్దరిలో ఏ ఒక్కరైనా చేసుకోవచ్చు. పెళ్లికానివారుకూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. వితంతువులు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ వ్రతం ఆచరించడం వలన మానసిక ప్రశాంతత, ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వ్రత కథలు చదవలేనివారు ఎవరైనా చదువుతున్నప్పుడు విన్నా శుభ ఫలితాలు ఉంటాయి. సంతోషకరమైన, సంపన్నమైన జీవితం లభిస్తుంది. అపమృత్యు భయం తొలగిపోయి దీర్ఘాయుస్సు కలుగుతుంది. పురోహితునితో వ్రతం చేయించుకోవడం ఉత్తమం. అధంగ పూజ. అనగా శివుని శరీరంలోని అన్ని భాగాలకు పూజ చేయాలి. ఈ పూజ చేస్తున్నప్పుడు శివ పార్వతులకు పుష్పం, అక్షితలు, కుంకుమ లేదా విబూది సమర్పించాలి. తర్వాత శివుడి అష్టోత్తర శతనామావళి చదవాలి. తర్వాత పార్వతి అష్టోత్తర శతనామావళి పఠించాలి. శ్రీఉమా మహేశ్వర వ్రతంలోని కథలు చదువుకోవాలి. _శివశర్మ కథ_ ఒకప్పుడు కావేరీ నది ఒడ్డున శివశర్మ అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతనికి శాస్త్రాలపై మంచి పరిజ్ఞానం ఉండేది. పండితాడుగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. శివశర్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారు వివాహమై బాగా స్థిరపడ్డారు. అతని భార్య సుమతి ఉత్తమురాలు. ఆ దంపతులు రోజంతా శివనామం స్మరించుకునేవారు. అనుకోకుండా ఒకరోజు శివశర్మ కంటికి వ్యాధి సోకింది. క్రమంగా కంటి చూపు కోల్పోవడం ప్రారంభమయింది. చాలామంది దగ్గర వైద్యం చేయించుకున్నాడు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఒకరోజు నడుచుకుంటూ వెళుతుండగా అంధత్వం కారణంగా కింద పడడంతో రెండు మోకాళ్లు విరిగిపోయాయి. ఆ దంపతులు తమ సమస్యలు దూరం చేయమని శివుడిని ప్రార్థించారు. మరుసటి రోజు ఉదయం. మహేశ్వరుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపం ధరించి శేవశర్మ ఇంటికి వెళ్ళాడు. శివశర్మ, అతని భార్య ఆ వృద్ధునికి సాష్టాంగం చేశారు. తమ సమస్యలను అధిగమించే మార్గాన్ని చూపమని వేడుకున్నారు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శివుడు శివగిరి కొండపై ఉన్న పరమేశ్వరుడిని దర్శనం వేసుకుంటే వారి సమస్యలు తీరిపోతాయని చెప్పాడు. అతను చెప్పినట్టే వారు కష్టపడి అక్కడికి వెళ్లారు. కంటి చూపు మందగించినా, కార్లు నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ అనేక మెట్టు ఎక్కి శివుడిని దర్శించుకున్నారు. శివ దర్శనంతో వారి కష్టాలన్నీ తీరిపోవడమే కాకుండా, పూర్వజన్మ పాపాలన్నీ నశించిపోయాయి. _శంకర భట్ కథ_ ఒకప్పుడు కృష్ణానది ఒడ్డున శంకరభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను తన గ్రామంలోని వేదపాఠశాలలో సాంప్రదాయ పౌరోహిత్యం నేర్చుకుని పూజారిగా తన విధులను నిర్వహించేవాడు. అతను తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ధర్మబద్ధమైన జీవితం గడిపేవాడు. నిరంతరం పరమశివుని తలచుకుంటూ ఉండేవాడు. అతను ప్రతిభావంతుడు కావడంతో బాగా సంపాదిస్తున్నాడు. అది చివరికి అతనితో అహం పెరగడానికి కారణమయింది. అతని అహం కారణంగా, అతని భక్తి క్షీణించడం ప్రారంభించింది. చెడు అలవాట్లలో పడిపోయాడు. అతని భార్యా, పిల్లలు అతనిని అసహ్యించుకోవడం ప్రారంభించారు. అతను మరించిన అనైతిక ప్రవర్తనలతో పక్కకు తప్పుకోవడంతో గ్రామం నుండి బహిష్కరించారు. శంకర భట్ ఊరూరు తిరుగుతూ భిక్షాటన చేయడం ప్రారంభించాడు. అతని ఆరోగ్యం క్షీణించింది. ఒక ఊరినుండి మరో ఊరికి వెళుతూ ఒక అడవి గుండా వెళ్ళవలసి వచ్చింది. అతను అడవిని దాటకముందే రాత్రి అయింది. దారి కనిపించలేదు. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ అడవి జంతువులు చేసే శబ్దాల వల్ల అతనికి రాత్రంతా నిద్రపట్టలేదు. లేచి మళ్లీ నడవడం ప్రారంభించాడు. శంకరభట్టు శిథిలావస్థలో ఉన్న పాత ఆలయం కనిపించింది. మెల్లగా తడుముకుంటూ లోపలికి వెళ్లి రాత్రి అక్కడే గడపాలని అనుకున్నాడు. అయితే ఆ స్థలం ఆకులతో నిండిపోయింది. అతను ఆ ఆకులను దూరంగా నెట్టాడు. ఆకలిగా ఉండడంతో అతనికి అక్కడకూడా నిద్ర పట్టలేదు. ఆ రోజు శివరాత్రి కావడంతో తనకు తెలియకుండానే ఉపవాసం ఉండడం, నిద్రపోకుండా జాగారం చేయడం. ఆకులను శుభ్రం చేస్తున్నప్పుడు అందులో ఉన్న బిల్వ పత్రాలు శివలింగంపై పడడం వలన అతనికి శివుడు ప్రత్యక్షమై అతని కష్టాలన్నీ తీర్చి అతడిని తిరిగి అతని కుటుంబం వద్దకు ఆరోగ్యంగా పంపించాడు. అప్పటినుండి శంకర్ భట్ ఏలాంటి తప్పులు చేయన మంచి వ్యక్తిగా జీవనం కొనసాగించాడు. డైలీ విష్ ఆధ్యాత్మిక ఆనందం ద్వారా ఇలాంటి వ్రత కథలన్నీ చదువుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
13 likes
9 shares
PSV APPARAO
5K views 4 months ago
#పవిత్రోత్సవాలు 🕉️ శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ 🙏 #భాద్రపద మాస విశిష్టత 🔱🕉️🙏 #భాద్రపద మాసంలో ముఖ్యమైన పర్వదినాలు 🔱🕉️🙏 #పవిత్రోత్సవాలు #తిరుమల సమాచారం తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు 👆 శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ తిరుపతి, 2025 సెప్టెంబర్ 04: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం కల్యాణ మండపం నందు స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం చేపట్టారు. అనంతరం జాప్యం, మూలవర్లకు, ఉత్సవర్లకు ఉపసన్నిధి నుందు పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం మరియు మాడ వీధులలో శ్రీ మఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపట్టారు. సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం చేపట్టారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ పెద్ద జీయర్, శ్రీ శ్రీ చిన్న జీయర్లు, టిటిడి డిప్యూడీ ఈవో శ్రీ వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ లు, ఆలయ ఇస్పెక్టర్లు , అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
48 likes
30 shares
PSV APPARAO
728 views 4 months ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: పార్శ్వ ఏకాదశి / పరివర్తిని ఏకాదశి / వామన ఏకాదశి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #భాద్రపద మాస విశిష్టత 🔱🕉️🙏 #భాద్రపద మాసంలో ముఖ్యమైన పర్వదినాలు 🔱🕉️🙏 #ఏకాదశి *ఈ రోజు పరివర్తన ఏకాదశి, వామన ఏకాదశి* భాద్రపద మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన ఏకాదశికి మన ప్రకృతిలో వచ్చే మార్పులకు సంభందించినదిగా పరిగణిస్తారు. కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజ చేస్తే కలుగు ఫలం లభిస్తుందని పురాణాలూ చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే వామన జయంతి. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకం. శ్రీమహావిష్ణువు అది శేషుపైన శయనించి దక్షిణాయనంలో విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకో వైపు శాయనిస్తాడు అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది. పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది. ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో "దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి తనకి శుభము చేకూర్చెదనని" పలికి అదృశ్యమవుతాడు. ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను. ఒక విధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు. అట్టి మాయా బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై... వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. "వామనుడు మూడు పాదముల భూమి"ని అడిగెను. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. #namashivaya777
19 likes
16 shares